9 ఏండ్లు బీఆర్‌ఎస్ నేతల కంపును ఒక ఫినాయిల్ బాటిల్ సరిపోదన్నారు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. ధరణి సమస్యలపై.. అప్పటి cs సోమేశ్ కి ఎంత చెప్పినా చెవిటోడి ముందు శంఖం ఊదినట్టు అయ్యిందన్నారు. ధరణి ఎత్తివేయాలని రాహుల్ గాంధీ చెప్పారన్నారు జగ్గారెడ్డి. రైతులకు మేలు జరగనిది ఎందుకు అని రాహుల్ గాంధీ రద్దు చేస్తాం అన్నారని ఆయన వ్యాఖ్యానించారు. కోదండరాం రైతుల సమస్యలపై ఎప్పుడూ తిరిగే వారని, ఫార్మా సిటీ.. భూములు సమస్యలన్నింటి పై కోదండ రెడ్డి కొట్లాడారన్నారు జగ్గారెడ్డి. ధరణిలో అవకతవకలు అన్నీ బయటకు తీయాలని, ఎవరెవరున్నారు అనేది తేలాలన్నారు జగ్గారెడ్డి. కేసీఆర్ చేసిన పాపాలు..లోపాలు కడగాలి అంటే.. బ్యారెల్..బ్యారెల్ ఫినాయిల్ కావాలన్నారు. ఖజానా అంత ఫినాయిల్ కె పోయేట్టు ఉందన్నారు.
Viral Video: అద్భుతంగా కారు నడిపిన 95 ఏళ్ల బామ్మ.. వీడియో చేసిన నాగాలాండ్ మంత్రి
కేటీఆర్ శాఖలో జరిగిన అవకతవకలకు ఆయన బాధ్యత వహించాలన్నారు జగ్గారెడ్డి. 9 ఏండ్ల తరవత అసెంబ్లీలో మూడున్నర గంటల చర్చ జరిగిందని, ప్రజలకు అసెంబ్లీ లో ఏం జరుగుతుంది అనేది తెలిసిందన్నారు జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. ఎప్పుడైనా ప్రతిపక్షం మాట్లాడంగా 9 ఏండ్లలో చూడలేదని, కానీ ఇవాళ కనిపించిందన్నారు. సంప్రదాయం పాటించని పార్టీ బీఆర్‌ఎస్ జగ్గారెడ్డి. ప్రతిపక్ష నాయకుడిని సభకు రా.. అని సీఎం అడిగే పతిస్థితి వచ్చిందన్నారు. ఆదా..ప్రతిపక్ష నేత పని అని ఆయన అన్నారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షం పో..పో అని నోరు మూశారని, కానీ సీఎం రేవంత్.. రా రా అంటున్నాడన్నారు జగ్గారెడ్డి. అధికారం ఇస్తే సభకు వస్తవు…అధికారం ఇవ్వకపోతే అసెంబ్లీ కి రావా..? ప్రజల తీర్పు ని అవమానిస్తున్నాడు కేసీఆర్ అని జగ్గారెడ్డి మండిపడ్డారు.
Abu Dhabi: అబుదాబిలో తొలి హిందూ దేవాలయం.. ఎప్పుడు ప్రారంభమంటే..!