యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)లో తొలి హిందూ దేవాలయం నిర్మితమైంది. బుధవారం ఈ ఆలయం ప్రారంభం కానుంది. ఇదిలా ఉంటే రెండ్రోజుల పర్యటన నిమిత్తం ప్రధాని మోడీ (PM Modi) మంగళవారం యూఏఈకి వెళ్తున్నారు. మంగళ, బుధవారాల్లో ఆయన అక్కడ పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా అబుదాబిలో (Abu Dhabi) నిర్మించిన తొలి హిందూ దేవాలయాన్ని ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు. ప్రారంభోత్సవానికి హాజరయ్యే అతిథులకు జ్ఞాపకంగా బహుమతులు అందజేయనున్నారు.
అలాగే అబుదాబిలోని జాయెద్ స్పోర్ట్స్ సిటీలో భారతీయ సమాజాన్ని ఉద్దేశించి మోడీ ప్రసంగించనున్నారు. UAEలో కనీసం 3.5 మిలియన్ల మంది భారతీయులు గల్ఫ్‌లోని భారతీయ శ్రామికశక్తిలో భాగమయ్యారు. ఆలయ ముఖభాగంలో రాజస్థాన్, గుజరాత్ నుంచి వచ్చిన 25,000 మంది నైపుణ్యం కలిగిన కళాకారులచే రూపుదిద్దుకుంది. ఆలయం కోసం ఉత్తర రాజస్థాన్ నుంచి అబుదాబికి గణనీయమైన సంఖ్యలో గులాబీ ఇసుకరాయి రవాణా చేయబడింది. ఆలయ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం 40,000 క్యూబిక్ ఫీట్ల పాలరాతిని ఇంటీరియర్స్ నిర్మించారు.
#WATCH | Inside visuals of the Bochasanwasi Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS) Mandir, the first Hindu temple in Abu Dhabi. It will be inaugurated by Prime Minister Narendra Modi on February 14. pic.twitter.com/8oOt7Sh6gh
— ANI (@ANI) February 12, 2024
#WATCH | Inside visuals of the Bochasanwasi Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS) Mandir, the first Hindu temple in Abu Dhabi. It will be inaugurated by Prime Minister Modi on February 14. pic.twitter.com/bS6s8bEqlp
— ANI (@ANI) February 11, 2024