Anantapur: దుకాణం నడుపుతున్నారా.. అయితే తస్మాత్ జగ్రత్త.. షాపింగ్ అంటూ వచ్చి దుకాణంలో ఉన్న విలువైన వస్తువులను కాజేసి ఉడాయిస్తున్నారు. ఈ మాట ఇప్పుడు చెప్పడానికి కారణం.. సాధారణంగా దొంగతనాలు ఎవరు లేని సమయం లోనో.. రాత్రి సమయం లోనో జరుగుతుంటాయి. కానీ షాపింగ్ అంటూ వచ్చిన విలువైన చీరలతో ఉడాయించారు కొందరు మహిళలు. ఈ ఘటన అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది. వివరాలలోకి వెళ్తే.. అనంతపురం జిల్లా లోని నార్పల మండలం లోని కేశేపల్లిలో కొందరు లేడీలు కేడీలు గా మారారు. పెళ్ళి కుదిరిందని చీరలు కావాలంటూ కొందరు మహిళలు ఓ షాప్ కి వెళ్లారు. అయితే ఆ షాప్ లో సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి. దీనితో ఆ మహిళలు అక్కడ వాళ్ళ చేతి వాటం చూపించడానికి వెనకడుగు వేశారు.
Read also:Bigg Boss Telugu 7 : ఫినాలే రేస్.. అదరగొట్టిన రైతుబిడ్డ.. అమర్ వల్ల కన్నీళ్లు పెట్టుకున్న యావర్..
కాగా ఆ షాప్ పక్కనే కేశవ అతని భార్య వాళ్ళ ఇంటిని దుకాణంగా మార్చారు. ఆ దుకాణానికి శ్రీ లక్ష్మి చెన్నకేశవ స్వామి సిల్క్స్ అనే పేరు పెట్టి బట్టలు అమ్ముతున్నారు. ఈ నేపథ్యంలో ఆ మహిళలు కేశవ దంపతులు నడుపుతున్న దుకాణానికి వెళ్లారు. పెళ్ళి ఉంది.. చీరలు కొనడానికి వచ్చామని.. ఖరీదైన పట్టు చీరలు కావాలి చూపించమన్నారు ఆ మహిళలు.. ఈ నేపథ్యంలో విలువైన చీరలను ఆ మహిళలకు చూపించారు దుకాణదారులు. చీరలు చూస్తున్న మహిళల్లో ఓ మహిళ కాస్త మనిషి నీళ్లు ఇవ్వాల్సిందిగా దుకాణదారులని అడిగింది. ఈ నేపథ్యంలో నీళ్ళని తీసుకు రావడానికి లోపలకి వెళ్లారు దుకాణదారులు. ఆ క్షణం కోసమే ఎదురు చూస్తున్న మహిళలు చేతి వాటం చూపించారు.. లక్షా యాభైవేల ఖరీదైన చీరలతో అక్కడ నుడి ఉడాయించారు.
Read also:UP: టాయిలెట్ వస్తోంది.. ఆపమంటే కండక్టర్ బస్సు నుంచి తోసేశాడు.. కూలీ దుర్మరణం
నీళ్ల కోసం వెళ్లిన వ్యక్తి తిరిగొచ్చే సరికి అక్కడ మహిళలు లేరు. ఖరీదైన చీరలు లేవు. దీనితో వచ్చింది లేడీలు కాదు కేడీలు అని గ్రహించిన దుకాణం యజమానులు పోలీసులను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితులు ముందుగా వెళ్లిన షాప్ లోని సీసీటీవీ ఫుటేజ్ ను సేకరించిన పోలీసులు ఆ సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా లేడీ కిలాడీల కోసం గాలిస్తున్నారు.