Mamitha Baiju: ‘ప్రేమలు’ బ్యూటీ సంచలన నిర్ణయం.. ఇకపై వాటికి గుడ్‌బై!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mamitha Baiju: ‘ప్రేమలు’ సినిమాతో తెలుగు సహా దక్షిణాది ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ బ్యూటీ మమితా బైజు కీలక నిర్ణయం తీసుకున్నారు. సోషల్ మీడియా ద్వారా వచ్చే పబ్లిసిటీ కంటే మానసిక ప్రశాంతతకే తాను ఎక్కువ ప్రాధాన్యత ఇస్తానని ఆమె తెలిపారు. ఇకపై వ్యక్తిగతంగా సోషల్ మీడియాలో సినిమా అప్డేట్స్ను షేర్ చేయబోనని స్పష్టం చేశారు. తన సినిమాలకు సంబంధించిన వివరాలను పీఆర్ టీమ్ ద్వారా వెల్లడిస్తానని చెప్పారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మమితా తన వ్యక్తిగత విషయాలతో పాటు సినీ కెరీర్‌కు సంబంధించిన ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తాను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు వీరాభిమానినని, ఆయన సినిమాలను పదిసార్లకు పైగా చూసిన సందర్భాలు ఉన్నాయని తెలిపారు. ముఖ్యంగా ‘ఇద్దరమ్మాయిలు’ సినిమాలో అల్లు అర్జున్ వాడిన క్యాసియో వాచ్, ఫుల్ స్లీవ్ టీషర్ట్ స్టైల్ తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని, తాను కూడా ఆ స్టైల్‌ను కాపీ చేసేదాన్నని సరదాగా గుర్తుచేసుకున్నారు. కేరళలోని కొట్టాయంలో జన్మించిన మమితా బైజు తండ్రి డాక్టర్. ఆమె సైకాలజీలో డిగ్రీ పూర్తి చేశారు. తన అన్నయ్య మిథున్ రాష్ట్రస్థాయి క్రికెటర్ అని, తన జీవితంలో ముఖ్యమైన నిర్ణయాలను ఆయనే తీసుకుంటారని చెప్పారు. అంతేకాదు.. తన పెళ్లి విషయంలోనూ అన్నయ్యదే తుది నిర్ణయమని, తనకు వచ్చే లవ్ ప్రపోజల్స్‌ను కూడా ఆయనే డీల్ చేస్తారని చెప్పి ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. ప్రస్తుతం మమితా బైజు వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. సూర్య సరసన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’తో పాటు మూడు భాషల్లో తెరకెక్కుతున్న పలు ప్రాజెక్టుల్లో ఆమె నటిస్తున్నారు. ‘ప్రేమలు’ తర్వాత వచ్చిన క్రేజ్‌ను కొనసాగిస్తూ దక్షిణాదిలో వరుస అవకాశాలు అందుకుంటున్నారు.
Also Read
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!