Vidyut Jammwal: లైవ్ ఈవెంట్లో 15 నిముషాలు ఊపిరి ఆపిన బాలీవుడ్ హీరో.. సాధ్యమేనా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vidyut Jammwal: సాధారణ మానవుడు రెండు మూడు నిమిషాల కంటే ఎక్కువ సమయం ఊపిరి బిగబట్టడమే అసాధ్యం. అలాంటిది ఏకంగా 15 నిమిషాల పాటు శ్వాస తీసుకోకుండా ఉండటం సాధ్యమేనా? ఇప్పుడు ముంబై వేదికగా జరిగిన ఓ కార్యక్రమంలో బాలీవుడ్ యాక్షన్ స్టార్ విద్యుత్ జమ్వాల్ చేసిన విన్యాసం అందరినీ విస్మయానికి గురిచేయడమే కాకుండా పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తోంది. హాలీవుడ్ ప్రఖ్యాత నిర్మాణ సంస్థ పారామౌంట్ పిక్చర్స్ రూపొందిస్తున్న భారీ చిత్రం ‘స్ట్రీట్ ఫైటర్’లో విద్యుత్ జమ్వాల్ ప్రసిద్ధ వీడియో గేమింగ్ క్యారెక్టర్ ‘ధల్సిమ్’ పాత్రతో అంతర్జాతీయ తెరకు పరిచయమవుతున్నారు. ముంబైలో నిర్వహించిన ఈ చిత్ర ప్రమోషనల్ వేడుకలో, ధల్సిమ్ కాస్ట్యూమ్స్‌లో ఉన్న కాస్ప్లేయర్లతో కలిసి విద్యుత్ వేదికపై కూర్చున్నారు. అనంతరం వరుసగా 15 నిమిషాల పాటు శ్వాసను పూర్తిగా నియంత్రించి గాఢ ధ్యానంలోకి జారుకున్నారు.
బహిరంగ వేదికపై పావుగంట సేపు శ్వాస ఆపడం చూసి అక్కడున్న వారంతా ఒక్కసారిగా నివ్వెరపోయారు. వైద్య పరంగా తీవ్రమైన సవాలుగా భావించే ఈ చర్యపై ప్రస్తుతం సినీ, ఫిట్నెస్ వర్గాల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది. ఈ విన్యాసం ముగిసిన తర్వాత విద్యుత్ మాట్లాడుతూ, ఇది మాయాజాలం కాదని, ప్రాచీన భారతీయ జ్ఞానమని స్పష్టం చేశారు.మహర్షి పాతంజలి అందించిన ప్రాచీన యోగ పద్ధతులను, ప్రాణాయామ సాధనను ఉపయోగించి శ్వాసను నియంత్రించగలిగానని ఆయన వెల్లడించారు. చిన్నతనం నుంచే భారతీయ మార్షల్ ఆర్ట్స్ కలరిపయట్టు, యోగాభ్యాసంలో గడిపిన శిక్షణే తనకు ఈ స్థాయి శారీరక, మానసిక నిగ్రహాన్ని ఇచ్చిందని పేర్కొన్నారు. ప్రస్తుత తరానికి ఈ ప్రాచీన శ్వాస నియంత్రణ విద్యలను నేర్పించేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. ‘స్ట్రీట్ ఫైటర్’ చిత్రం అక్టోబర్ 16న భారత్‌లో ఇంగ్లిష్తో పాటు తెలుగు, తమిళం, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది. తెరపై యోగా శక్తులు ప్రదర్శించే ధల్సిమ్ పాత్రకు తాను ఎంతటి సహజసిద్ధమైన ఎంపికో విద్యుత్ ఈ లైవ్ ఫీట్ ద్వారా చాటిచెప్పారు.
Also Read
- Sabudana Soup Recipe: మార్కెట్లో లభించే ఎనర్జీ డ్రింక్స్‌ను పక్కన పెట్టి.. ఈ సగ్గుబియ్యం సూప్ తాగితే అలసట, నీరసం ఉండవు..
- సైబర్ నేరగాళ్లపై Telangana Cyber Security Bureau మెగా ఆపరేషన్.. 6 రాష్ట్రాల్లో 101 మంది అరెస్ట్..!
- Homemade Ghee: గంటల తరబడి చిలకాల్సిన పనిలేదు.. ఇంట్లోనే మీగడ నుంచి పూస పూస లాంటి నెయ్యి తయారు చేయండిలా..
- Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
తాజావార్తలు
-
Vidyut Jammwal: లైవ్ ఈవెంట్లో 15 నిముషాలు ఊపిరి ఆపిన బాలీవుడ్ హీరో.. సాధ్యమేనా?
-
Fauzi Teaser: ‘ఫౌజీ’ నుంచి 3 నిమిషాల టీజర్.. ప్రభాస్ ఫ్యాన్స్‌కు పండగే!
-
Sabudana Soup Recipe: మార్కెట్లో లభించే ఎనర్జీ డ్రింక్స్‌ను పక్కన పెట్టి.. ఈ సగ్గుబియ్యం సూప్ తాగితే అలసట, నీరసం ఉండవు..
-
సైబర్ నేరగాళ్లపై Telangana Cyber Security Bureau మెగా ఆపరేషన్.. 6 రాష్ట్రాల్లో 101 మంది అరెస్ట్..!
-
Homemade Ghee: గంటల తరబడి చిలకాల్సిన పనిలేదు.. ఇంట్లోనే మీగడ నుంచి పూస పూస లాంటి నెయ్యి తయారు చేయండిలా..
ట్రెండింగ్
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!