బుల్లితెర పై సక్సెస్ ఫుల్ కామెడీ షో జబర్దస్త్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఎంతో మంది కమెడీయన్లు ఈ షో ద్వారా మంచి పేరును తెచ్చుకుంటూ సినిమా అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు. కొందరు సినిమా డైరెక్టర్లు కూడా అయ్యారు.. ఇక జబర్దస్త్ లో లేడీ కమెడియన్ మంచి పాపులారిటిని సంపాదించిన నటి పవిత్ర గురించి అందరికి తెలిసే ఉంటుంది.. పవిత్ర త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. తాను ప్రేమించిన వ్యక్తితోనే పవిత్ర ఏడడుగులు వేయబోతున్నారు.. తాజాగా తనకు కాబోయే భర్తను పరిచయం చేస్తూ.. రొమాంటిక్ డ్యాన్స్ చేసింది.. అందుకు సంబందించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..
ఈమె కొద్ది రోజుల క్రితం తన ప్రేమ విషయాన్ని, పెళ్లి విషయాన్ని పవిత్ర సోషల్ మీడియా ద్వారా అందరికి తెలియజేశారు. సంతోష్ అనే వ్యక్తిని పవిత్ర పెళ్లి చేసుకోబోతున్నారు. ఇటీవలే నిశ్చితార్థం కూడా జరుపుకున్నారు. పెళ్లి తేదీని ఇంకా తెలియజేయని ఈ జంట.. ప్రస్తుతం లవ్ లైఫ్ ని మరింత ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా పవిత్ర ఒక వీడియోని తన ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేశారు. ఆ వీడియోలో పవిత్ర తన కాబోయే భర్త సంతోష్ తో కలిసి.. లోఫర్ మూవీలోని రొమాంటిక్ సాంగ్ ‘జియా జలే’ సాంగ్ కలిసి డాన్స్ వేశారు. అయితే సంతోష్ కి మాత్రం డాన్స్ వేయడం చేతకావడం లేదు. ఈ విషయాన్ని తెలియజేస్తూనే పవిత్ర ఇలా రాసుకొచ్చారు.. ‘కొన్ని సిట్యువేషన్స్ లో మనకి డాన్స్ వేయడం రానప్పుడు ఎం చెయ్యాలో తెలుసా.. డాన్స్ వచ్చినట్లు మ్యానేజ్ చెయ్యాలి అంటూ వీడియోకు జత చేసింది..
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. పవిత్రకి సంతోష్ ముందుగా తన ప్రేమని ప్రపోజ్ చేశారు. కొంత కాలం తరువాత పవిత్ర కూడా ఓకే చెప్పడం, వన్ ఇయర్ లవ్ రిలేషన్ తో తరువాత ఎంగేజ్మెంట్ రింగ్ లు మార్చుకొని పెళ్లి జీవితానికి మొదటి అడుగు వేశారు. మరి ఈ ఇద్దరు ఎప్పుడు ఏడడుగులు వేయబోతున్నారో తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఈ ఇద్దరు యూట్యూబ్ వీడియోలతో సందడి చేస్తున్నారు. పాగల్ పవిత్ర పేరుతో ఉన్న ఒక యూట్యూబ్ ఛానల్ లో వీరిద్దరూ వీడియోలను పోస్ట్ చేస్తున్నారు..