Ivana : ‘లవ్ టుడే’ సినిమాతో బిగ్ సక్సెస్ ను ఖాతాలో వేసుకున్న నటి ఇవానా. బాలనటిగా కెరీర్ ప్రారంభించిన ఈ మలయాళ కుట్టి జ్యోతిక ‘నాచియార్’తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత శివకార్తికేయన్ ‘హీరో’లోనూ కీలక పాత్ర పోషించింది. అయితే ఇటీవల విడుదలైన ‘లవ్ టుడే’ అమ్మడికి బిగ్ బ్రేక్ ని ఇచ్చింది. తమిళ నాట ఈ సినిమా 5 కోట్లతో రూపొంది 70 కోట్లకు పైగా వసూలు చేసి ఇంకా స్ట్రాంగ్ కలెక్షన్లతో దూసుకుపోతోంది. ఇప్పుడీ సినిమాను అదే పేరుతో తెలుగులో విడుదల చేశారు దిల్ రాజు. తెలుగునాట కూడా సక్సెస్ ఫుల్ గా ప్రదర్శితం అవుతున్న ఈ సినిమా ఇవానాకు తెలుగులో అవకాశం తెచ్చిపెట్టంది. దిల్ రాజు బ్యానర్ లోనే హీరోయిన్ గా ఎంపికైంది ఇవానా.
Read Also: Hero Simbu: టైమ్ ఇవ్వు పిల్లా.. అంటున్న శింబు
దిల్ రాజు తన అన్నకుమారుడు ఆశిష్ ను హీరోగా పరిచయం చేస్తూ ‘రౌడీ బాయ్స్’ సినిమా నిర్మించాడు. అయితే ఆ సినిమా అనుకున్న స్థాయిలో పేరు తెచ్చిపెట్టలేక పోయింది. ఇప్పుడు ఆశిష్ తో మరో సినిమా తీస్తున్నాడు దిల్ రాజు. ఈ సినిమాలో హీరోయిన్ గా ఇవానా ను హీరోయిన్ గా బుక్ చేశారు దిల్ రాజు. కరోనా కారణంగా ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పుడు హీరోయిన్ సెట్ కావటంతో డిసెంబర్ నుంచి షూటింగ్ మొదలు పెట్టనున్నారు. మరి దిల్ రాజు సంస్థ ద్వారా తెలుగులో ఎంట్రీ ఇవ్వబోతున్న ఇవానాకు ఆ సినిమా ఎలాంటి బ్రేక్ ఇస్తుందో చూడాలి.