Allari Naresh: ‘అల్లరి’ తను నటించిన తొలి సినిమా పేరునే ఇంటి పేరులా మార్చుకున్నారు హీరో నరేశ్. ఇటీవల వైవిధ్యమైన కథాంశాలతో ఆయన సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. ఆ ప్రయత్నంలోనే తాజాగా ఆయన నటించిన ‘నాంది’ సినిమా సక్సెస్ అయ్యింది. అలాగే మరో కొత్త పాయింటుతో నడిచే ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ సినిమాను చేశాడు. ఈ సినిమాలో నరేశ్ సీరియస్ పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా పోస్టర్స్, టీజర్, ట్రైలర్లు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది. ఇక ఈ సినిమా తాజాగా సెన్సార్ పనులు కూడా ముగించుకుంది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసింది. ఈ నెల 25వ తేదీన ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఖరారు చేసుకున్నారు.
Read Also: Pawan kalyan: రామోజీ ఫిల్మ్ సిటీలో ఫైట్స్ చేస్తున్న పవన్ కల్యాణ్.. బహుశా అందుకేనేమో
ఈ నెల 20(రేపు)న హైదరాబాదులోని ‘పార్క్ హయత్’లో ఈ వేడుకకు ప్లాన్ చేశారు. అందుకు సంబంధించిన పోస్టర్ విడుదల చేసింది చిత్రబృందం. రేపు సాయంత్రం 6 గంటల నుంచి ఈ వేడుక ప్రారంభం కానుంది. ఇక ఈ సినిమాలో నరేశ్ పాత్రపై చిత్ర యూనిట్ ప్రశంసలు కురిపిస్తోంది. హాస్య మూవీస్ బ్యానర్ పై రాజేశ్ దండ నిర్మించిన ఈ సినిమాకి, ఏఆర్ మోహన్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో కథానాయికగా ఆనంది అలరించనుంది. కాగా ఈ సినిమాలో ఆనంది హీరోయిన్‌గా నటిస్తుండగా, వెన్నెల కిషోర్, ప్రవీణ్, సంపత్ రాజ్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. సినిమాలోని కంటెంట్ ప్రేక్షకులను ఖచ్చితంగా ఆకట్టుకుంటుందని సెన్సార్ బోర్డు సభ్యులు చిత్ర యూనిట్‌ను అభినందించినట్లుగా తెలుస్తోంది. మారేడుమిల్లి నేపథ్యంలో నడిచే ఈ కథ, అల్లరి నరేశ్ కి మరో హిట్ తెచ్చిపెడుతుందేమో చూడాలి.