తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు మేరకు ప్రజా సమస్యలను తెలుసుకుని పరిస్కరించేందుకు మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్ లో నేడు నిర్వహించిన ప్రజాదర్బార్ కు విజ్ఞాపన పత్రాలతో ప్రజలు భారీగా తరలివచ్చారు. ప్రజాదర్బార్ కు వచ్చిన ప్రజల సమస్యలను తెలుసుకుని వారి నుంచి వినతులను ఐటీ మంత్రి శ్రీధర్ బాబు స్వీకరించారు. ప్రజల సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తుందని ఆయన చెప్పారు. పెద్దలు, వివిధ వర్గాలతో నెల రోజుల పాటు ప్రజా సమస్యలను సుధీర్ఘంగా చర్చించి మ్యానిఫెస్టో రూపొందించినట్లు తెలిపారు. పారదర్శకంగా, జవాబుదారీతనంతో తమ ప్రభుత్వం పనిచేస్తుందని ఆయన పేర్కొన్నారు.
Read Also: F-16 Jet Crash: దక్షిణ కొరియాలో కూలిన అమెరికాకు చెందిన యుద్ధ విమానం.. పైలట్కు తీవ్రగాయాలు
దరఖాస్తుదారులు తమ విజ్ఞాపనపత్రంలో సమస్యతో పాటు అడ్రస్, ఫోన్ నంబర్ ను పూర్తిగా రాయాలని మంత్రి శ్రీధర్ బాబు సూచించారు. తద్వారా దరఖాస్తుదారుల సమస్యను క్షుణ్ణంగా పరిశీలించి, పరిష్కరించేందుకు ఈజీ అవుతుందన్నారు. ఈ నెల 17 న నిర్వహించనున్న టీఎస్ జెన్కో ఏఈ పరీక్షను వాయిదా వేయాలని అభ్యర్థులు విజ్ఞప్తి చేశారు. అదే రోజు రెండు, మూడు పరీక్షలు ఉన్నట్లు అభ్యర్థులు తెలిపారు. ఈ అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లనున్నట్లు మంత్రి తెలిపారు. సంబంధిత అధికారులతో చర్చించి ఈ పరీక్ష వాయిదాపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనున్నట్లు శ్రీధర్ బాబు చెప్పారు. తమకు ఇచ్చే గౌరవ వేతనాన్ని ప్రతి నెలా రెగ్యులర్ గా ఇవ్వాలని మధ్యాహ్న భోజన వంట కార్మికులు వినతి పత్రం అందజేశారు.. అన్ని సమస్యలను పరిష్కరించటానికి ప్రభుత్వం ప్రజాదర్బార్ నిర్వహిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు.