ఒకప్పటి మేటి జట్టు నిలిచిన వెస్టిండీస్.. టెస్ట్‌ల్లో టీమిండియాపై విజయం సాధించి దాదాపు రెండు దశాబ్దాల కాలం దాటిపోయిందంటే ఎవరైనా నమ్మగలరా..? నమ్మినా, నమ్మకపోయినా ఇదే నిజం. విండీస్ జట్టు లాస్ట్ టైం 2002లో జమైకాలో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో భారత జట్టుపై విజయం సాధించింది. అప్పటి నుంచి దాదాపు 21 సంవత్సరాలుగా విండీస్‌కు టీమిండియాపై ఇప్పటి వరకు గెలవలేదు.
Read Also: Game Changer: ‘గేం చేంజర్’కి కొత్త డైరెక్టర్.. ఆ ఫొటోతో ఖండించిన శంకర్!
అయితే, విండీస్‌తో రేపటి( బుధవారం) నుంచి తొలి టెస్ట్ ప్రారంభంకానున్న నేపథ్యంలో ఈ ఆసక్తికర అంశం తెరపైకి వచ్చింది. మరి 21 సంవత్సరాల తర్వాతైనా విండీస్ జట్టు.. టీమిండియాపై గెలుస్తుందా అంటే..? ఇప్పుడు అది అస్సలు సాధ్యం కాదని చెపాలి. ప్రస్తుత భారత జట్టుకు విండీస్ కనీస పోటీ కూడా ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. ఇటీవల ముగిసిన వన్డే వరల్డ్ కప్ క్వాలిఫయర్స్‌లో ఆ జట్టు దయనీయ పరిస్థితిని అందరు చూసే ఉంటారు. అయితే ముఖాముఖి రికార్డుల్లో మాత్రం టీమిండియాపై విండీస్‌దే పై చేయిగా నిలిచింది. ఇప్పటి వరకు ఇరు జట్ల మధ్య జరిగిన 98 మ్యాచ్‌ల్లో.. విండీస్ 30 గెలిస్తే, భారత్ జట్టు మాత్రం 22 మ్యాచ్‌ల్లో విజయాలు సాధించింది. 46 మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి. మరి చూడాలి ఈ టూర్ లో భారత జట్టుపై విండీస్ గెలుస్తుందా లేదా అనేది.
Read Also: Balayya : పూరి తో మరో సినిమా చేయడానికి సిద్ధంగా వున్న బాలయ్య..?
తుది జట్ల వివరాలు:
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్, అజింక్య రహానె(వైస్ కెప్టెన్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, ఇషాన్ కిషన్, అక్షర్ పటేల్, శ్రీకర్ భరత్( వికెట్ కీపర్), శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, జయ్‌దేవ్ ఉనద్కత్, నవ్‌దీప్ సైని, ముఖేశ్ కుమార్.
వెస్టిండీస్: క్రెయిగ్ బ్రాత్‌వైట్ (కెప్టెన్), జెర్మైన్ బ్లాక్‌వుడ్ (వైస్ కెప్టెన్), అలిక్ అథనేజ్, త్యాగ్‌నారాయణ్ చంద్రపాల్, రఖీమ్ కార్న్‌వాల్, జోష్వా ద సిల్వా, షనోన్ గాబ్రియల్, జేసన్ హోల్డర్, అల్జారి జోసెఫ్, కిర్క్ మెకంజీ, రేమన్ రీఫర్, కీమర్ రోచ్, జోమెల్ వారికన్