ఒకప్పటి మేటి జట్టు నిలిచిన వెస్టిండీస్.. టెస్ట్‌ల్లో టీమిండియాపై విజయం సాధించి దాదాపు రెండు దశాబ్దాల కాలం దాటిపోయిందంటే ఎవరైనా నమ్మగలరా..? నమ్మినా, నమ్మకపోయినా ఇదే నిజం. విండీస్ జట్టు లాస్ట్ టైం 2002లో జమైకాలో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో భారత జట్టుపై విజయం సాధించింది. అప్పటి నుంచి దాదాపు 21 సంవత్సరాలుగా విండీస్‌కు టీమిండియాపై ఇప్పటి వరకు గెలవలేదు.
ఆస్ట్రేలియాతో జరిగిన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ తర్వాత భారత జట్టుకు నెలరోజుల విశ్రాంతి లభించింది. అనంతరం వచ్చె నెలలో వెస్టిండీస్ పర్యటనకు టీమిండియా వెళ్లనుంది. ఈ పర్యటనలో ఆతిధ్య విండీస్‌తో రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20లు టీమిండియా ఆడనుంది.
టీమిండియా ఆటగాడు విరాట్ కోహ్లీ ప్రపంచంలోనే అత్యుత్తమ ఆటగాడు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. సమకాలీన ఆటగాళ్లలో కోహ్లీ, స్మిత్, రూట్, విలియమ్సన్ ఫార్మాట్‌తో సంబంధం లేకుండా అత్యుత్తమ ఆటగాళ్లుగా చలామణి అవుతున్నారు. కానీ వీరిలో విరాట్ కోహ్లీ మాత్రం గత మూడేళ్లుగా ఫామ్ లేమితో ఇబ్బందులు పడుతున్నాడు. పరుగుల యంత్రం కోహ్లీ అన్ని ఫార్మాట్లలోనూ ఆడుతున్నా సెంచరీ చేసి మూడేళ్లు దాటిపోతోంది. పేలవ ఫామ్ కారణంగా కెప్టెన్సీ కూడా కోల్పోయాడు. కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాక ఆటగాడిగా…