నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ బిజీ గా వున్నారు.ప్రస్తుతం బాలయ్య యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో భగవంత్ కేసరి అనే సినిమాలో నటిస్తున్నారు.రీసెంట్ గానే వీర సింహారెడ్డి సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ విజయం అందుకున్నారు బాలయ్య.అనిల్ రావిపూడి సినిమా కోసం బాలయ్య ఏకంగా ఫ్లోర్ స్టెప్ కూడా వేశాడు అంటూ వార్తలు కూడా వస్తున్నాయి.ఈ సినిమా లో బాలయ్య సరసన హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ నటిస్తుంది.ఈ సినిమా తరువాత డైరెక్టర్ బాబీ దర్శకత్వం లో ఓ సినిమాకి కమిట్ అయ్యాడు బాలయ్య. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా లో హీరోయిన్ గా నయనతార సెలెక్ట్ అయినట్లు తెలుస్తుంది. అలాగే ఈ సినిమా తో పాటు బాలయ్యకు ఎంతో ఇష్టం అయిన డైరెక్టర్ అయిన పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో మరో సినిమా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.
పూరి జగన్నాధ్ లైగర్ సినిమా తో భారీ ప్లాప్ ను అందుకుని చాలా ఇబ్బంది పడుతున్నాడు. అలాంటి సమయం లో రామ్ పూరి సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రీసెంట్ గా డబుల్ ఇస్మార్ట్ అంటూ రామ్ తో సినిమా ను మొదలు పెట్టేసాడు పూరి.. ఇక ఈ సినిమా పూర్తి అయ్యాక బాలయ్య తో పూరి సినిమా చేయబోతున్నట్లు సమాచారం..నిజానికి పూరి కి రామ్ తో చేసే సినిమా కంటే ముందే బాలయ్య సినిమా చేసే ఆఫర్ వచ్చింది కానీ బాలయ్య కి వరుస సినిమా కమిట్ మెంట్స్ పూర్తి అవ్వడానికి కొంత టైం పడుతుండటం తో పూరి రామ్ సినిమా చేస్తున్నట్లు సమాచారం.అయితే పూరి తెరకెక్కిస్తున్న డబుల్ ఇస్మార్ట్ మంచి విజయం సాధిస్తేనే పూరికి స్టార్ హీరోలతో సినిమా అవకాశాలు వస్తాయి.అందుకే పూరి కెరీర్ కు డబుల్ ఇస్మార్ట్ సినిమా ఎంతో కీలకం అని తెలుస్తుంది.