ISRO: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ అంతరిక్షరంగంలో ఎప్పటికప్పుడు సరికొత్త అడుగులు వేస్తూ ముందుకు దూసుకుపోతుంది. తాజాగా వికాస్ లిక్విడ్ ఇంజిన్ రీస్టార్ట్ చేసే డెమోను సక్సెస్ పుల్ గా నిర్వహించింది.
ISRO New Chief: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ కొత్త ఛైర్మన్‌గా డాక్టర్ వి.నారాయణన్ ఎంపికయ్యారు. సంస్థకు ప్రస్తుతం నాయకత్వం వహిస్తున్న ఎస్.సోమనాథ్ నుంచి ఆయన ఈ నెల 14వ తేదీన పదవి బాధ్యతలు స్వీకరించనున్నారు.
PSLV-C60 Rocket: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ షార్‌లోని రెండో ప్రయోగ వేదిక నుంచి డిసెంబర్ (సోమవారం) 30వ తేదీన రాత్రి 9.58 గంటలకు పీఎస్‌ఎల్‌వీ సీ60 రాకెట్‌ను ప్రయోగించేందుకు ఏర్పాట్లు అన్నీ పూర్తి అయ్యాయి.
GSAT-20: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో రూపొందించిన అత్యంత అధునాతన సమాచార శాటిలైట్ జీశాట్-20 (జీశాట్-N2) నింగిలోకి దూసుకుపోయింది. స్పేస్‌ఎక్స్‌కు చెందిన ఫాల్కన్ 9 రాకెట్ ఈ జీశాట్-20ను నింగిలోకి మోసుకుపోయింది.
చంద్రుడి నుంచి మట్టి నమూనాలను తీసుకురావడానికి భారత్ సిద్ధమవుతోంది. 2029లో చంద్రయాన్-4 మిషన్ చంద్రుడిపైకి వెళ్లి అక్కడి నుంచి మట్టి నమూనాలను తీసుకువస్తుందని ఇస్రో తెలిపింది.
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఛైర్మన్ ఎస్. సోమనాథ్ గగన్‌యాన్ మిషన్ గురించి కీలక అప్‌డేట్ ఇచ్చారు. గగన్‌యాన్ మిషన్‌కు సంబంధించిన రాకెట్‌లోని మూడు దశలు శ్రీహరికోటలోని షార్ రేంజ్‌కు చేరుకున్నాయని ఆయన శుక్రవారం తెలిపారు. ఈ ఏడాది చివరి నాటికి ఏజెన్సీ తన మొదటి టెస్ట్ ఫ్లైట్‌ను ఇస్రో లక్ష్యంగా పెట్టుకుంది.
భారత అంతరిక్ష సంస్థ ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన తొలి సోలార్ మిషన్ ఆదిత్య-ఎల్1 గురించి ఇస్రో చీఫ్ కీలక ప్రకటన చేశారు. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) ఛైర్మన్ ఎస్. సోమనాథ్ ఐఐటీ బొంబాయి వార్షిక సైన్స్ అండ్ టెక్నాలజీ ఫెస్టివల్‌కు హాజరయ్యారు. ఈ ఫెస్టివల్‌లో ఆయన మిషన్‌కు సంబంధించిన వివరాలను పంచుకున్నారు.
శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి సెప్టెంబర్ 2న విజయవంతంగా ప్రయోగించిన ఆదిత్య ఎల్1 మిషన్‌పై ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ కీలక అప్‌డేట్ ఇచ్చారు. భారతదేశపు తొలి సోలార్ మిషన్ ఆదిత్య-ఎల్1 జనవరి 6న భూమికి 1.5 మిలియన్ కిమీ దూరంలో ఉన్న లాగ్రాంజియన్ పాయింట్ (ఎల్1) గమ్యస్థానానికి చేరుకుంటుందని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చైర్మన్ ఎస్ సోమనాథ్ తెలిపారు.
Gaganyaan Mission: భారతీయ వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపే ప్రతిష్టాత్మక మిషన్ గగన్ యాన్ కౌంట్ డౌన్ స్టార్ అయింది. తొలుత మానవ రహిత విమాన పరీక్షకు సర్వం సిద్ధమైనట్లు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) శుక్రవారం (అక్టోబర్ 20) తెలిపింది.