Israel-Lebanon: బీరుట్లో ఇజ్రాయెల్ దాడి.. 8 మంది మృతి
- బీరుట్ సబర్బన్ ప్రాంతాలలో ఇజ్రాయెల్ దాడి
- 8 మంది మృతి.. 59 మందికి గాయాలు
- చనిపోయిన వారిలో ఓ అగ్ర సైనికుడు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మొదట పేజర్ పేలుడు, ఆ తర్వాత రేడియో సెట్లు.. వాకీ టాకీల పేలుడు ఘటనల అనంతరం.. ఇజ్రాయెల్ సైన్యం వరుసగా రెండవ రోజు హిజ్బుల్లాపై వైమానిక దాడులను కొనసాగించింది. ఒక నివేదిక ప్రకారం.. ఇజ్రాయెల్ సైన్యం స్వయంగా ఈ సమాచారం తెలిపింది. బీరుట్‌లోని కొన్ని ప్రదేశాలను లక్ష్యంగా చేసుకుని తమ వైపు నుండి దాడి చేశామని పేర్కొంది. ఈ దాడి వివరాలను లెబనీస్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలుపుతూ.. బీరుట్ సబర్బన్ ప్రాంతాలలో ఇజ్రాయెల్ దాడిలో 8 మంది చనిపోయారు.. 59 మంది గాయపడినట్లు వెల్లడించారు. చనిపోయిన వారిలో ఓ అగ్ర సైనికుడు ఉన్నాడు. కాగా.. ఇజ్రాయెల్ లెబనాన్‌లోని హిజ్బుల్లా లక్ష్యాలపై దాడి చేసిన సంగతి తెలిసిందే..
Read Also: Asteroid: భూమికి సమీపంగా వస్తున్న గ్రహశకలం.. నాసా ఏం చెబుతుందంటే..
Also Read
- Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
- RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్‌కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
- Abhishek Sharma: మళ్లీ రికార్డుల వేట.. కాటేరమ్మ కొడుకు అరుదైన రికార్డు..
హిజ్బుల్లాపై గత నాలుగు రోజులుగా ఇజ్రాయెల్ దాడులు చేస్తూనే ఉంది. ఈ క్రమంలో గత మంగళవారం.. లెబనాన్‌లోని హిజ్బుల్లా యోధులు కమ్యూనికేషన్ కోసం ఉపయోగిస్తున్న వేలాది టెలిఫోన్లను ధ్వంసం చేశారు. పేజర్ పేలుడులో చాలా మంది యోధులు ప్రాణాలు కోల్పోయారు. అలాగే.. బుధవారం రేడియో సెట్లు, వాకీ-టాకీలతో కూడిన పేలుళ్లలో చాలా మంది యోధులు మరణించారు. సమాచారం ప్రకారం, ఈ రెండు పేలుళ్లలో 30 మందికి పైగా మరణించగా.. 3000 మందికి పైగా గాయపడ్డారు.
Read Also: Jalavihar : జలవిహార్‌పై వస్తున్న ఆరోపణల్లో నిజం లేదు..
ఈ పరికరాల పేలుడుకు ఇజ్రాయెల్ కారణమని హిజ్బుల్లా తెలిపింది. అయితే ఇజ్రాయెల్ సైన్యం మాత్రం ఈ విషయంలో స్పందించలేదు. గురువారం తెల్లవారుజామున ఇజ్రాయెల్‌పై హిజ్బుల్లా చేసిన దాడిలో ఇద్దరు ఇజ్రాయెల్ ఆర్మీ సైనికులు మరణించారు. ఆ తర్వాత ఇజ్రాయెల్ ప్రతీకారం తీర్చుకుంది. హిజ్బుల్లాపై తన దాడులను తీవ్రతరం చేసింది. ఈ నేపథ్యంలో లెబనాన్ సరిహద్దుల్లో సైనికుల మోహరింపును ఇజ్రాయెల్ పెంచింది. అదే సమయంలో.. పరికరాల పేలుడు గురించి హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా ఇజ్రాయెల్‌ను బెదిరించారు. హిజ్బుల్లా బెదిరింపులకు తాము భయపడమని, హిజ్బుల్లా దాడులకు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఇజ్రాయెల్ ఆర్మీ చీఫ్ చెప్పారు.
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్‌తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్‌తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!