జలవిహర్‌లో అక్రమ నిర్మాణాలంటూ హైడ్రాకు సీపీఐ మాజీ ఎంపీ అజీజ్ పాషా ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా స్పందించారు జల విహార్ నిర్వాహకులు.. Ntvతో జలవిహార్ డైరెక్టర్ విజయ్ మాట్లాడుతూ.. జలవిహార్ పై వస్తున్న ఆరోపణల్లో నిజం లేదన్నారు. ప్రభుత్వం ప్రత్యేక జీవో ద్వారా తమకు 12.5 ఎకరాల స్థలానికి కేటాయించిందని, అందులోనే వాటర్ పార్కును ఏర్పాటు చేశామన్నారు. మాకు భూమికి కేటాయించిన తర్వాత కోర్టు కేసుతో ఆలస్యంగా 2007 నుండి యాక్టివిటీ ప్రారంభించామని ఆయన తెలిపారు. హెచ్ఎండిఏ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగానే ఇక్కడ ఆక్టివిటీ జరుగుతుందని, మా కంపెనీకి ప్రతిష్టను దెబ్బ తీసే విధంగా కొంతమంది వ్యక్తులు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారన్నారు డైరెక్టర్ విజయ్.
Vizag: దుప్పికొమ్ము ఆకారంలో రాయి.. ఏఐఎన్‌యూ వైద్యులు అరుదైన శస్త్ర చికిత్స
ఇప్పుడు ఫిర్యాదు చేసిన వాళ్లకు కూడా పూర్తి వివరాలు తెలియకపోయి ఉండవచ్చని, వారు కూడా వచ్చే ఇక్కడ జరుగుతున్న ఆక్టివిటీని చెక్ చేసుకోవచ్చని ఆయన తెలిపారు. హైడ్రా ప్రభుత్వ విభాగం కాబట్టి వారు వచ్చి ఎలాంటి పరిశీలనలు చేసిన మేము పూర్తిగా సహకరిస్తామన్నారు. ఇక్కడ ఉత్పత్తి అయ్యే వ్యర్థాలను హుస్సేన్ సాగర్ లో కలపడం లేదని, సీవేజ్ ట్రీట్మెంట్ చేసి వాటర్ బోర్డ్ లైన్ లో కలుపుతున్నామన్నారు. చెత్తను కూడా సరైన పద్ధతిలో డిస్పోస్ చేస్తూ వాటన్నింటికీ ఫీజులు చెల్లిస్తున్నామన్నారు. ఇక్కడ జరిగిన నిర్మాణాలు కూడా హెచ్ఎండిఏ అనుమతుల మేరకు మాత్రమే చేపట్టామని ఆయన వెల్లడించారు. ప్రభుత్వానికి ఎలాంటి బకాయిలు లేవు అన్ని సక్రమంగా చెల్లిస్తున్నామని, మొదటి దశలో ఐదేళ్లు ఆలస్యం అయిన అంశం మాత్రమే పెండింగ్లో ఉందన్నారు.