Israel-Gaza Conflict: ఇజ్రాయెల్ – గాజా మధ్య యుద్ధ వాతావరణం.. 5000 రాకెట్ల ప్రయోగం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Israel-Gaza Conflict: గాజా స్ట్రిప్‌లోని హమాస్ ఉగ్రవాదులు శనివారం తెల్లవారుజామున ఇజ్రాయెల్ వైపు డజన్ల కొద్దీ రాకెట్లను ప్రయోగించారు. ఇది యుద్ధ పరిస్థితిని సృష్టించింది. ఇజ్రాయెల్‌పై ఉగ్రవాదులు దాడి చేశారు. దీనిని ఇజ్రాయెల్ అధికారులు ధృవీకరించారు. హమాస్ ఉగ్రవాదుల దాడిలో ఒకరు మృతి చెందగా, ముగ్గురు గాయపడ్డారు. ఈ దాడికి హమాస్ బాధ్యత వహించింది. దీనికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ సైన్యం కూడా గాజా స్ట్రిప్‌లో వైమానిక దాడులు చేసింది.
Read Also:Bigg Boss 7 Telugu: ‘తొక్కలో సంచాలక్..బొక్కలో తీర్పు ‘.. అమర్ పరువుతీసిన నాగ్..
Also Read
- Sri City Boiler Blast: శ్రీ సిటీలో ఘోర ప్రమాదం.. టిల్ హెల్త్‌కేర్ పరిశ్రమలో బాయిలర్ పేలి ఇద్దరు మృతి
- India vs Pakistan: మళ్లీ అదే సీన్ రిపీట్.. పాకిస్థాన్‌ను కూరలో కరివేపాకులా తీసి పారేసిన టీమిండియా..!
- India vs Pakistan: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ ఇదే..
- Honda Rebel 500 Recall: హోండా కీలక ప్రకటన.. Rebel 500 బైక్‌లు రీకాల్.. అసలు సమస్య ఏంటంటే?
హమాస్ ఉగ్రవాదుల దాడుల దృష్ట్యా ఇజ్రాయెల్‌లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. దీంతో పాటు హమాస్ ఉగ్రవాద సంస్థ ఇందుకు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఇజ్రాయెల్ విదేశాంగ శాఖ హెచ్చరించింది. హమాస్ ఉగ్రవాద సంస్థ గంట క్రితం దాడి చేసిందని ఆయన ట్వీట్ చేశారు. వారు రాకెట్లను ప్రయోగించి ఇజ్రాయెల్ భూభాగంలోకి చొరబడ్డారు. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ పౌరులకు రక్షణ కల్పిస్తుంది. హమాస్ ఉగ్రవాదులకు గుణపాఠం చెబుతుంది. దాడి తర్వాత ఇజ్రాయెల్‌లోని అనేక ప్రాంతాల్లో సైరన్‌లు మోగించాయి. టెల్ అవీవ్‌లోని డిఫెన్స్ ఫోర్సెస్ హెడ్‌క్వార్టర్స్‌లో భద్రతను ప్రధాని,రక్షణ మంత్రి అంచనా వేస్తున్నారని ప్రధాని నెతన్యాహు కార్యాలయం తెలిపింది. దీనితో పాటు ఇజ్రాయెల్ ప్రస్తుతం నివాసితులను ఇంటి లోపల ఉండాలని ఆదేశించింది.
Read Also:The farmer died : రైలు వేగానికి ఎగిరిపడి రైతు మృతి
Rockets firing hasn’t stopped since the morning! #Gaza pic.twitter.com/cw7U9acgPp
— Muhammad Smiry 🇵🇸 (@MuhammadSmiry) October 7, 2023
అంతకుముందు, ఇజ్రాయెల్ ఆక్రమణకు వ్యతిరేకంగా “ఆపరేషన్ అల్-అక్సా ఫ్లడ్” ప్రారంభించినట్లు ప్రకటించినందున, ఇజ్రాయెల్‌పై 5,000 కంటే ఎక్కువ రాకెట్లను ప్రయోగించామని హమాస్ తెలిపింది. తాజా పరిస్థితులను చూస్తుంటే.. ఇజ్రాయెల్ సైన్యం కూడా యుద్ధానికి సిద్ధమని చెప్పింది. సైన్యం తమ సైనికులకు ‘యుద్ధానికి సంసిద్ధత’ హెచ్చరిక జారీ చేసింది. దీనితో పాటు గాజాలోని విద్యా మంత్రిత్వ శాఖ పాఠశాలలకు సెలవు ప్రకటించింది. నిజానికి ఈ ప్రాంతంలో కనీసం 100 ఏళ్లుగా ఈ వివాదం కొనసాగుతోంది. వెస్ట్ బ్యాంక్, గాజా స్ట్రిప్, గోలన్ హైట్స్ వంటి ప్రాంతాలపై వివాదం ఉంది. తూర్పు జెరూసలేంతో సహా ఈ ప్రాంతాలపై పాలస్తీనా వాదిస్తోంది. జెరూసలేంపై తన వాదనను వదులుకోవడానికి ఇజ్రాయెల్ సిద్ధంగా లేదు. ప్రతిరోజూ ఉద్రిక్తత పరిస్థితి కొనసాగుతుంది.
తాజావార్తలు
-
BSNL Insurance Offer: BSNL కస్టమర్లకు ఉచిత ఇన్సూరెన్స్.. రూ.1 లక్ష యాక్సిడెంటల్ డెత్ కవర్, రూ.10 వేల సైబర్ ప్రొటెక్షన్!
-
Sri City Boiler Blast: శ్రీ సిటీలో ఘోర ప్రమాదం.. టిల్ హెల్త్‌కేర్ పరిశ్రమలో బాయిలర్ పేలి ఇద్దరు మృతి
-
India vs Pakistan: మళ్లీ అదే సీన్ రిపీట్.. పాకిస్థాన్‌ను కూరలో కరివేపాకులా తీసి పారేసిన టీమిండియా..!
-
MALDIVES: అప్పట్లో అక్కడో దేశం ఉండేది..!
-
Akshara Haasan: “టెన్త్‌లో 3 సార్లు ఫెయిల్.. చదువు ఆపేశా”.. కమల్ హాసన్ కూతురి షాకింగ్ కామెంట్స్!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!