బిగ్ బాస్ సీజన్ 7 రోజు రోజుకు రసవత్తరగా మారుతుంది.. ఈ వారం ఒక్కొక్కరి ఆట తీరును కడిగిపారేయడానికి హోస్ట్ నాగార్జున వచ్చేశారు. తాజాగా విడుదలైన ప్రోమోలో.. ముందుగా తేజా, యావర్ జంటను తెగ పొగిడేశాడు.. తేజను అయితే మరీ ఎక్కువగా పొగడ్తలతో ముంచేసాడు.. ఆ తర్వాత ఒక్కొక్కరికి చురకలు అంటించి తెగ వార్నింగ్ ఇచ్చేశాడు.. ఎంటర్టైన్ చేస్తానని మాటిచ్చావ్.. ఎంటర్టైన్ చేశావ్. మీ ఇద్దరిని చూస్తే ముచ్చటేసింది. తెలుగులో టీచర్ కావాలా అంటూ యావర్ ను ఆటపట్టించాడు నాగ్. ఇక ఆ తర్వాత టాస్కులో అతి తెలివి చూపించిన అమర్ దీప్ గాలి తీసేశాడు నాగ్.
టాస్క్ కంప్లీట్ చేయకుండా బెల్ కొట్టడం కరెక్టేనా ? అంటూ ప్రశ్నించాడు నాగ్. అయితే అమర్ దీప్ కవరింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తుండగా.. జ్యూస్ టాస్క్ వీడియో చూపించి మరీ ఉతికారేశారు.. ఇక ఈ టాస్క్ కు సంచాలక్ ఎవరని ప్రశ్నించారు నాగ్.. కానీ ఎవ్వరు లేరని అమర్ చెప్పగా.. హౌస్ మేట్స్ అందరు అమర్ అని చెప్పారు.. ఇక మాటి మాటికీ ప్రతి ఒక్కరిని బొక్కలో జడ్జ్మెంట్ అంటావ్ కదా అని అడగ్గా.. ఫ్రెండ్ షిప్ లో సరదాగా అన్నానని అమర్ వివరణ ఇచ్చుకోవడానికి ట్రై చేశాడు. దీంతో నేను సరదాగానే అంటున్నాను అంటూ “తొక్కలో సంచాలక్.. బొక్కలో జడ్జ్మెంట్..” అంటూ కౌంటరిచ్చాడు.
మొత్తానికి ఈ వీకెండ్ అమర్ దీప్, సందీప్ ల ఆట కట్టించినట్లుగా తాజా ప్రోమో చూస్తే తెలుస్తోంది.. ఇక తర్వాత హౌస్ లోని ఒక్కొక్కరికి ఇచ్చి పడేసాడు నాగ్.. అసలు ఎందుకు వచ్చారు.. ఏం చేస్తున్నారు అంటూ సీరియల్ బ్యాచ్ కు కౌంటర్ల మీద కౌంటర్ లు ఇచ్చాడు.. ఇక ప్రోమోలో నామినేషన్స్ గురించి మాట్లాడలేదు.. అంటే ఆరుగురు ఎంట్రీ ఇవ్వనున్నారని తెలుస్తుంది.. ఇక ఈ వారం మూవీ ప్రమోషన్స్ కోసం సినిమా వాళ్లు కూడా రానున్నారని తెలుస్తుంది.. దీని గురించి తెలియాలంటే ఈరోజు ఎపిసోడ్ ను మిస్ అవ్వకుండా చూడాల్సిందే..