అమృత్ పాల్ సింగ్.. ఇప్పుడు భారతదేశంలో సంచలనం రేపుతున్న పేరు. దేశంలో ఉద్రిక్తతలకు తెరలేపుతూ.. ఖలిస్థాన్ సానుభూతిపరుడిగా పోలీసులను ముప్పు తిప్పలు పెడుతున్నాడు. ఈ అమృత్ పాల్ సింగ్ వెనుక పాకిస్థాన్ నిఘా సంస్థ (ఐఎస్ఐ) హస్తం ఉన్నట్లుగా ఉనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విదేశీ నిధుల ప్రమేయం కూడా ఉన్నట్లు బలంగా వినిపిస్తోంది. వీటితో పాటు అమృత్ పాల్ సింగ్ కు మాదకద్రవ్యాల ముఠాలతో కూడా సన్నిహిత సంబంధాలు ఉండొచ్చు అని పోలీసులు అనుమానిస్తున్నారు. అమృత్ పాల్ సింగ్ కు మెర్సిడెజ్ కారును ఈ ముఠాలే బహుమతిగా ఇచ్చాయని దర్యాప్తు అధికారుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆయుధాలకు సంబంధించిన సహాకారాన్ని ఐఎస్ఐ అందిస్తోందని భావిస్తున్నారు.
Also Read : Night Watchman: సర్కారీ స్కూళ్ళలో ఇక నైట్ వాచ్ మెన్ల నియామకం
అమృత్ పాల్ సింగ్ తమ కళ్లు గప్పి తప్పించుకున్న సమయంలో ఆ కారులోనే ఉన్నట్లుగా వారు ఈ సందర్భంగా గుర్తు చేశారు. అంతేకాదు. నిందితుడైన అమృత్ పాల్ సింగ్ కు ఓ ప్రైవేట్ సైన్యమే ఉందన్నారు. పంజాబ్ ఇన్ స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సుఖ్ ఛైన్ సింగ్ గిల్ సోమవారం జాతీయ భద్రతా చట్లం కింద వీరిలోని ఐదుగురు వ్యక్తుల మీద కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. ఇప్పటి వరకు వీరి మీద ఆరు కేసులు నమోదు చేశామన్నారు. 114 మందిని అరెస్ట్ చేసినట్లు సుఖ్ ఛైన్ సింగ్ గిల్ తెలిపారు.
Also Read : Finland : ప్రపంచంలోనే అత్యంత హ్యాపీయస్ట్ దేశం
ఈ క్రమంలోనే శనివారం రాత్రి అమృత్ పాల్ సింగ్ మామయ్య హరిజీత్ సింగ్ లొంగిపోయారు. ఆయన మీదా ఎన్ఎస్ఏ కేసు నమోదు అయిందని.. అతనిని డిబ్రూగఢ్ జైలుకు తరలించామని పోలీసులు వెల్లడించారు. అమృత్ పాల్ సింగ్ ను అరెస్ట్ చేస్తామని.. అతని మీద కూడా ఎన్ఎస్ఏ కేసు నమోదు చేస్తామన్నారు. అమృత్ పాల్ సింగ్ అనుచరులైన అతని మామయ్యతో పాటు.. డ్రైవర్ హరి ప్రీత్ సింగ్ కూడా ఆదివారం రాత్రి పొద్దుపోయిన తర్వాత లొంగిపోయారు. ఇక పంజాబ్ లో అక్కడి సర్కార్ ఇంటర్నెట్, ఎస్ఎంఎస్ లపై నిషేదం విధించడం.. ఇంకా కొనసాగుతునే ఉంది. ట్విట్టర్ అకౌంట్లు కూడా పనిచేయడం లేదు. అమృత్ పాల్ సింగ్ ను నకిలి ఎన్ కౌంటర్ లో మట్టు పెట్టేందుకు పోలీసులు ఆలోచిస్తున్నారని వారిస్ పంజాబ్ దే న్యాయవాది ఇమాన్ సింగ్ ఖారా అన్నారు. ఇప్పటికే అమృత్ పాల్ సింగ్ ను అరెస్ట్ చేశారని న్యాయవాది ఇమాన్ సింగ్ అన్నారు.
Also Read : Ugadi Pachadi Recipe: ఉగాది పచ్చడి తయారీ విధానం
అమృత్ పాల్ సింగ్ చాలాకాలం దుబాయ్ లో ఉన్నాడని అక్కడ ఉన్న టైంలోనే ఉగ్ర ముఠాలతో సంబంధాలు ఏర్పడ్డాయని దర్యాప్తులో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. 2012లో ట్రక్ డ్రైవర్ గా పని చేసేందుకు అమృత్ పాల్ సింగ్ సింగ్ దుబాయ్ కి వెళ్లాడు. అక్కడే అతనికి ఉగ్రవాది పరమశిత్ సింగ్ పమ్మా.. పాకిస్తాన్ కేంద్రంగా పనిచేసే ఖలిస్థాన్ నేత లఖ్ బీర్సింగ్ రోడే సోదరుడు జస్వంత్ లతో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలోనే దుబాయ్ నుంచి అమృత్ పాల్ సింగ్ ఇండియాకి వచ్చే కంటే ముందే జార్జియాకు వెళ్లినట్లుగా నిఘావర్గాల దర్యాప్తులో తెలిసింది. అక్కడే ఐఎస్ఐ శిక్షణ పొందినట్లు అనుమానిస్తున్నారు.
Also Read : Revanth Reddy: హాత్ సే హాత్ జోడో యాత్ర కు ఐదు రోజులు బ్రేక్
ఆ తర్వాత పంజాబ్ కి వచ్చిన అమృత్ పాల్ సింగ్ వారిస్ పంజాబ్ దేను పక్కా ప్లాన్ ప్రకారమే తన గుప్పిట్లోకి తీసుకుని.. వేగంగా ఎదిగాడు. పంజాబ్ లో అశాంతిని రేకెత్తించాలన్న పక్కా ప్లాన్ తో భారతదేశంలోకి అడుగుపెట్టిన అతని ఆలోచనలను క్రమక్రమంగా అమలు చేశాడు. అమృత్ పాల్ సింగ్ కు సిక్ ఫర్ జస్టిస్ సంస్థతో కూడా సంబంధాలు ఉన్నాయని నిఘా వర్గాలు వెల్లడించాయి.