నాడు నేడు ద్వారా ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారుస్తున్న సీఎం జగన్మోహన్ రెడ్డి తాజాగా మరో నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో నైట్ వాచ్ మెన్ల నియామకానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 5388 నాడు-నేడు స్కూళ్లకు నైట్ వాచ్ మెన్లను నియమించేలా ఉత్తర్వులు జారీచేశారు. ఈ మేరకు పేరెంట్స్ కమిటీకి అధికారాలు దఖలుపరుస్తూ జీవో జారీ అయింది. ఈ వాచ్ మెన్లకు ఎంత జీతం ఇవ్వాలనేది కూడా జీవోలో పేర్కొన్నారు. నెలకు రూ. 6 వేల మేర నైట్ వాచ్ మెన్లకు గౌరవ భృతి ఇవ్వాలని జీవోలో పేర్కొంది ఏపీ సర్కార్.
Read Also: Constable Adventure: కానిస్టేబుల్ సాహసం..నదిలోకి దూకిన యువతిని కాపాడి హీరో అయ్యాడు
టాయిలెట్ మెయిన్ టెనెన్స్ ఫండ్ నుంచి నైట్ వాచ్ మెన్లకు గౌరవ భృతి ఇవ్వాలని జీవోలో వివరించింది. నైట్ వాచ్ మెన్లను నియమించే ప్రక్రియలో స్కూళ్లల్లో పని చేసే ఆయాల భర్తలకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశాలిచ్చారు. గ్రామ, వార్డుల్లో అందుబాటులో ఉన్న ఎక్స్ మిలటరీ మెన్లకు రెండో ప్రాధాన్యత ఇవ్వాలని జీవోలో వెల్లడించింది. నైట్ వాచ్ మెన్ల నియామకంతో సర్కారీ స్కూళ్ళ భద్రతకు అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. అంతేకాకుండా. స్కూళ్ళకు సంబంధించిన ఆస్తుల పరిరక్షణ జరుగుతుందని అంటున్నారు.
Read Also: Revanth Reddy: హాత్ సే హాత్ జోడో యాత్ర కు ఐదు రోజులు బ్రేక్