Ishan Kishan: బీసీసీఐ వార్నింగ్.. వెనక్కితగ్గిన ఇషాన్ కిషన్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ishan Kishan to play Ranji Trophy 2024 Match after BCCI Slams: టీమిండియా వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ దూకుడు కాస్త తగ్గినట్టు ఉంది. సెంట్రల్ కాంట్రాక్ట్ ఉన్న ఆటగాళ్లు జాతీయ జట్టులోకి తిరిగి రావాలంటే దేశవాలీ టోర్నీల్లో తప్పక ఆడాలని బీసీసీఐ వార్నింగ్ ఇచ్చిన నేపథ్యంలో.. ఈ వారంలో రాజస్థాన్‌తో జరిగే జార్ఖండ్ చివరి రంజీ ట్రోఫీ లీగ్ గేమ్‌లో ఇషాన్ ఆడనున్నాడని తెలుస్తోంది. అంతేకాదు త్వరలో ప్రారంభంకానున్న డీవై పాటిల్ టోర్నీలో కూడా పాల్గొనాలని నిర్ణయించుకున్నాడట. ఐపీఎల్ 2024 ప్రాక్టీస్‌ను పక్కన పెట్టి దేశవాలీ మ్యాచ్‌లు ఆడేందుకు సిద్దమయ్యాడట.
2023 డిసెంబర్ నుంచి ఇషాన్ కిషన్ భారత జట్టుకు దూరంగా ఉంటున్నాడు. ఈ ఏడాది ఆరంభంలో దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లిన ఇషాన్.. వ్యక్తిగత కారణాలతో సిరీస్ ఆరంభానికి ముందే స్వదేశానికి వచ్చాడు. అప్పటి నుంచి బీసీసీఐ, టీమ్ మేనెజ్మెంట్తో టచ్‌లో లేడు. స్వదేశంలో ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు ఇషాన్ అందుబాటులో ఉంటాడనుకున్నా.. అది జరగలేదు. రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదంకు గురికావడంతో రెగ్యులర్ కీపర్ సమస్య వేధిస్తున్న నేపథ్యంలో ఇషాన్‌ను జట్టులోకి తీసుకోవాలని చాలా మంది సూచించారు. అయితే 2 నెలలకు పైగా ఎలాంటి క్రికెట్ ఆడని అతడిని నేరుగా తుది జట్టులో ఎలా తీసుకుంటామని బీసీసీఐ వాదిస్తుంది.
Also Read
- IND Vs SL Test Free Entry: భారత్ - శ్రీలంక టెస్టు సిరీస్‌కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
- Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
- Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
- Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్‌కు ఎంపిక కావాలంటే ఇషాన్ కిషన్ కచ్చితంగా రంజీ ట్రోఫీ 2024లో ఆడాల్సిందే అని భారత హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ స్పష్టం చేశాడు. అయితే కిషన్ మాత్రం రాహుల్ వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకోకుండా.. బరోడాలో ముంబై ఇండియన్స్ ఆటగాళ్లతో కలిసి ఐపీఎల్ 2024 కోసం ప్రాక్టీస్ చేస్తున్నాడు. జార్ఖండ్ తరఫున రంజీ ట్రోఫీ 2024లో బరిలో దిగే అవకాశం ఉన్నా.. ఇషాన్ ఐపీఎల్ కోసం సన్నద్ధమవుతున్నాడు. ఇషాన్ ప్రవర్తనపై బీసీసీఐ సీరియస్ అయింది. సెంట్రల్ కాంట్రాక్ట్ కలిగిన ప్లేయర్స్.. జాతీయ జట్టులోకి తిరిగి రావాలంటే దేశవాలీ టోర్నీల్లో ఆడాలని తప్పనిసరి చేసింది. జాతీయ జట్టు సభ్యులకు, ఎన్సీఏలో ఉన్న ఆటగాళ్లకు ఇందుకు మినహాయింపు ఉందని పేర్కొంది.
Also Read: Today Gold Price: తగ్గుముఖం పడుతున్న బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో నేటి రేట్స్ ఇవే!
బీసీసీఐ ప్రకటన పరోక్షంగా తనను ఉద్దేశించే అని గ్రహించిన ఇషాన్ ఇషాన్ ఎట్టకేలకు దిగొచ్చాడు. ఐపీఎల్ 2024 ప్రాక్టీస్‌ను పక్కన పెట్టి.. ఈ నెల 16 నుంచి రాజస్థాన్‌తో జరిగే జార్ఖండ్ చివరి రంజీ ట్రోఫీ లీగ్ గేమ్‌లో ఆడాలని నిర్ణయించుకున్నాడట. త్వరలో ప్రారంభంకానున్న డీవై పాటిల్ టోర్నీలో కూడా బరిలోకి దిగుతాడట. ఈ విషయాన్ని ఇషాన్ స్వయంగా చెప్పనప్పటికీ.. అతని సన్నిహితులు మీడియాతో చెప్పినట్లు సమాచారం. ఐపీఎల్ 2024కు ముందు దేశవాలీ టోర్నీల్లో ఆడకుంటే.. సెంట్రల్ కాంట్రాక్ట్ రద్దవుతుందని ఇషాన్ బయపడ్డాడట.
తాజావార్తలు
-
IND Vs SL Test Free Entry: భారత్ – శ్రీలంక టెస్టు సిరీస్‌కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
-
Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
-
Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
-
Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
-
Dhurandhar : నెట్‌ఫ్లిక్స్‌లో ‘ధురంధర్’ ప్రపంచ రికార్డు..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!