Daggubati Purandeswari: పలు రాష్ట్రాల పార్టీ అధ్యక్షులను మార్చేసిన భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధిష్టానం.. తెలుగు రాష్ట్రాల పార్టీ చీఫ్‌లను కూడా ఛేంజ్ చేసింది.. అయితే, ఆంధ్రప్రదేశ్ విషయంలో అనూహ్య నిర్ణయం తీసుకుంది.. సోము వీర్రాజును తొలగించడం ఖాయమనే సంకేతాలు వచ్చినప్పటి నుంచి రకరకాల పేర్లు తెరపైకి వచ్చాయి.. ఇటీవలే సోము వీర్రాజుపై అధిష్టానానికి ఫిర్యాదులు కూడా వెళ్లాయి.. లీగల్ సెల్ సమావేశంలో సోము చేసిన కామెంట్లపై ఫిర్యాదులు అందాయి.. బీజేపీలో ఉంటే గెలవలేమనే రీతిలో సోము వీర్రాజు కామెంట్లు చేశారని ఫిర్యాదు లేఖలో అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు.. తానూ వేరే పార్టీకి వెళ్తే గెలిచేవాడినన్న సోము వీర్రాజు వ్యాఖ్యలు ఆయన కిందకు నీళ్లు తెచ్చాయని అంటున్నారు.. అప్పటికే ఉన్న ఫీడ్ బ్యాక్ తో పాటు.. ఈ ఫిర్యాదునూ అధిష్టానం సీరియస్‌గా తీసుకుందని పార్టీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది.. అయితే, అనూహ్యంగా తెరపైకి దగ్గుబాటి పురంధేశ్వరి రావడం.. ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా పురంధేశ్వరిని ఖరారు చేయడంతో ఏపీ బీజేపీ నేతలు షాక్ తిన్నారట.
Read Also: Posani krishnamurali: నంది అవార్డులపై పోసాని కీలక ప్రకటన.. ఉత్తములు, అర్హులకు ఇస్తాం!
టీడీపీ ముద్ర ఉండడంతో అధ్యక్ష స్థానాన్ని సత్య కుమార్ దక్కించుకోలేక పోయారనే చర్చ నడుస్తోంది.. బీజేపీ సీనియర్ నేత, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అనుంగు అనుచరుడిగా బీజేపీలో సత్యకుమార్‌కు గుర్తింపు ఉంది.. కానీ, అధ్యక్ష పదవి మాత్రం అందకుండా పోయింది.. అయితే, న్యూట్రల్ లుక్ కోసమే పురంధేశ్వరిని బీజేపీ హైకమాండ్ ఎంచుకుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నమాట.. మరోవైపు.. మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు వ్యవహారి శైలి నచ్చకే గతంలో తెలుగుదేశం పార్టీని వీడారు దగ్గుబాటి వెంకటేశ్వరరావు, పురంధేశ్వరి దంపతులు. దాంతోనే ఆమెను ఎంచుకున్నారనే చర్చ కూడా సాగుతోంది.. అంతేకాదు.. గతంలో అవసరం అయినప్పుడు పార్టీ బాధ్యతలను భుజాన వేసుకున్న జూనియర్ ఎన్టీఆర్.. చాలా కాలం నుంచి పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్నారు.. ఇప్పుడు పురంధేశ్వరికి బాధ్యతలు అప్పగించడంతో.. జూనియర్ ఎన్టీఆర్‌ను దువ్వేందుకు కూడా ఆమె ఉపయోగపడతారనే యోచనలో బీజేపీ హైకమాండ్ ఉందట.. పార్టీకి సినీ గ్లామర్ అద్దెందుకు జూనియర్ ఎన్టీఆర్ అవసరమని భారతీయ జనతా పార్టీ భావిస్తోంది.. గతంలో కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షాతో జూనియర్ ఎన్టీఆర్ సమావేశం కూడా జరిగింది.. ఇప్పుడు మేనత్త (పురంధేశ్వరి)కి బాధ్యతలు ఇవ్వడం ద్వారా ఎన్టీఆర్‌ను బీజేపీకి దగ్గర చేసే ప్లాన్ కూడా ఉందనే ప్రచారం సాగుతోంది.
Read Also: West Bengal: పశ్చిమ బెంగాల్లో బాంబు పేలుడు.. ఇద్దరు చిన్నారులు సహా నలుగురికి తీవ్ర గాయాలు..!
ఇక, ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా నియమితులైన దగ్గుబాటి పురంధేశ్వరి ప్రస్తుతం అమర్‌నాథ్ యాత్రలో ఉన్నారు.. యాత్రలో ఉండగానే ఆమెకు గుడ్‌న్యూస్ అందింది.. ఇప్పటి వరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సోము వీర్రాజు.. అధిష్టానం అదేశాలతో అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు.. ఆ తర్వాత పురంధేశ్వరిని నియమిస్తూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రకటన విడుదల చేశారు.. మరోవైపు.. పురంధేశ్వరికి శుభాకాంక్షలు తెలిపారు సోము వీర్రాజు.. పురంధేశ్వరి సేవలు.. అనుభవం పార్టీ విస్తరణకు ఉపయోగపడతాయని ఆకాంక్షిస్తున్నానంటూ సోము వీర్రాజు ట్వీ్‌ట్ చేశారు. మరి పురంధేశ్వరి నియామకం ఏపీ బీజేపీకి ఎంత వరకు కలిసి వస్తుందో వేచిచూడాలి.