Naga Chaitanya and Sobhita Dhulipala Engagement: టాలీవుడ్ హీరో నాగచైతన్య, నటి శోభిత ధూళిపాళ్ల ఎంగేజ్‌మెంట్ హైదరాబాద్‌లో ఘనంగా జరిగినట్లు తెలుస్తోంది. గురువారం (ఆగష్టు 8) ఉదయం జరిగిన ఈ నిశ్చితార్థంకు ఇరు కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారని సమాచారం. అయితే నాగచైతన్య ఎంగేజ్‌మెంట్ విషయమై అక్కినేని కుటుంబం నుంచి అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడంతో చై-శోభిత జంటకు నెటిజన్లు శుభాకాంక్షలు చెబుతున్నారు.
Also Read: Kumaradevam Cinema Tree: సినీ వృక్షంను బతికించాలి.. మరిన్ని సినిమాలు తీస్తా: డైరెక్టర్ వంశీ
ఈ ఎంగేజ్‌మెంట్ సందర్భంగా సోషల్ మీడియాలో ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. నాగచైతన్య మాజీ సతీమణి సమంత ప్రపోస్ చేసిన రోజు, శోభిత ధూళిపాళ్లతో ఎంగేజ్‌మెంట్ రోజు ఒకటే అని ఓ నెటిజన్ పేర్కొన్నాడు. ‘ఒక ట్విస్ట్.. మాజీ భార్య సమంత లవ్ ప్రపోస్ చేసిన రోజు, శోభితతో ఎంగేజ్‌మెంట్ రోజు ఒక్కటే. అందుకే ఈరోజునే నాగచైతన్య నిశ్చితార్థం చేసుకోవాలనుకున్నాడు’ అని పేర్కొన్నాడు. ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. 2017లో ప్రేమించి పెళ్లి చేసుకున్న చై-సామ్.. 2021లో విడాకులు తీసుకున్నారు.