విశాఖలో జరిగిన సేనతో సేనాని సభ తర్వాత.. జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భవిష్యత్ రాజకీయాలపై పెద్ద చర్చ మొదలైంది. పవన్ కల్యాణ్ నిజంగా జాతీయ రాజకీయాల వైపు అడుగులు వేయాలి అనుకుంటున్నారా..? జనసేనను రాష్ట్ర స్థాయి పార్టీ నుంచి జాతీయ పార్టీగా విస్తరించాలనే ఆలోచనో న్నారా? ఎందుకంటే.. ఆయన పదే పదే చెబుతున్న జనసేనకు జాతీయవాద లక్షణాలున్నాయి అన్న వ్యాఖ్యలు.. ఆయన భవిష్యత్ ప్రణాళికలపై కొత్త సందేహాలు, కొత్త అంచనాలు రేపుతున్నాయి.…
తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఒరిస్సా రాష్ట్రాలలో జనసేన పార్టీని విస్తరించండని అంటున్నారని.. తాను విస్తరించాలి అంటే ముందు మీరు పోరాటం చేయండి అని జనసేనాని, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. మీకు అండగా సైద్ధాంతిక బలం తాను ఇస్తాను అని, మీరు బలోపేతం చేస్తే ఖచ్చితంగా ఒకరోజున జనసేన జాతీయ పార్టీగా ఎదుగుతుందన్నారు. తాను ఒకరోజు జనసేన జాతీయ పార్టీ అవుతుంది అంటే ఈరోజు హాస్యాస్పదంగా ఉండొచ్చు.. కానీ ఖచ్చితంగా ప్రజలు అందరూ కలిసి…