Hormuz Strait: ప్రపంచానికి ఊపిరి పోసిన అమెరికా-ఇరాన్ ఒప్పందం.. హర్మూజ్ గుండా చమురు రవాణా షురూ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hormuz Strait: మిడిల్ ఈస్ట్‌లో సుదీర్ఘకాలంగా సాగుతున్న యుద్ధ మేఘాలు తొలగిపోయి, అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన శాంతి ఒప్పందం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు సరికొత్త ఊపిరి పోసింది. ఈ ఒప్పందంలో భాగంగా అంతర్జాతీయ వాణిజ్యానికి అత్యంత కీలకమైన ‘హర్మూజ్ జలసంధి’ని తెరిచేందుకు ఇరాన్ అంగీకరించింది. ప్రపంచ దేశాల చమురు అవసరాలను దృష్టిలో ఉంచుకుని డొనాల్డ్ ట్రంప్ సైతం అక్కడ విధించిన అమెరికా నౌకాదళ దిగ్బంధనాన్ని తొలగించారు. దాదాపు రెండు నెలల పాటు సాగిన ఈ దిగ్బంధనం ఎత్తివేయడంతో ఇరాన్ నుంచి ముడి చమురు రవాణా పునఃప్రారంభమైంది.
సముద్ర మార్గంలో 4.8 మిలియన్ బారెళ్ల చమురు ప్రయాణం
‘ట్యాంకర్‌ట్రాకర్స్’ నివేదిక ప్రకారం.. నేషనల్ ఇరానియన్ ట్యాంకర్ కంపెనీ (NITC)కి చెందిన ‘డియోనా’ (DIONA), ‘హీరో2’ (HERO2) అనే రెండు భారీ వీఎల్సీసీ (VLCC) సూపర్‌ట్యాంకర్లు సుమారు 3.8 మిలియన్ బారెళ్ల ఇరాన్ ముడి చమురుతో బయలుదేరాయి. గత రెండు నెలల్లో ఇరాన్ నుంచి జరిగిన మొదటి ఎగుమతి ఇదే కావడం విశేషం. జూన్ 15, 2026 నాటి ఏఐఎస్ (AIS) డేటా, శాటిలైట్ చిత్రాల ద్వారా ఈ లీకేజీ రవాణా ధృవీకరించబడింది. వీటితో పాటు మరో ‘సూయజ్‌మ్యాక్స్’ (Suezmax) ట్యాంకర్ కూడా 1 మిలియన్ బారెళ్ల చమురుతో ప్రయాణమైంది. ప్రస్తుతం ఈ చమురు నౌకలు ఓమన్ గల్ఫ్ సమీపంలోని అరేబియా సముద్రంలో ప్రయాణిస్తూ, గత ఏప్రిల్ 2026లో అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల సమయంలో విధించిన దిగ్బంధన సరిహద్దు రేఖను దాటుతున్నట్లు మ్యాప్‌ల ద్వారా స్పష్టమవుతోంది. మరోవైపు, గత 7 వారాలుగా ఇరాన్‌లోకి ప్రవేశించలేక ఈఈజెడ్ (EEZ) పరిధిలోనే నిలిచిపోయిన ‘స్ట్రీమ్’ (STREAM) అనే మరో ఇరాన్ ట్యాంకర్ కూడా ఇప్పుడు దిగ్బంధన రేఖ వైపు కదులుతోంది.
Also Read
- Dr Priyanka Murder Case: డాక్టర్ ప్రియాంక హత్య కేసు.. నిందితుల రిమాండ్ పొడిగింపు!
- Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్‌తో ఇంట్లోనే పదును పెట్టండి..!
- Missi Jersey Auction: ఒకే వేలంలో మెస్సీ, రొనాల్డో ఫైట్.. ఊహించని ధరకు అమ్ముడైన దిగ్గజాల జెర్సీలు..
- Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
ఒప్పందంతో కుప్పకూలిన ముడి చమురు ధరలు
అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదరడంతో ప్రపంచ దేశాలన్నీ ఊపిరి పీల్చుకున్నాయి. డొనాల్డ్ ట్రంప్ ఈ చారిత్రాత్మక డీల్‌ను ప్రకటించిన వెంటనే అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు భారీగా పతనమయ్యాయి. గతంలో గ్లోబల్ మార్కెట్‌ను భయపెడుతూ 100 నుండి 110 డాలర్ల మధ్య పలికిన బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర, ఇప్పుడు ఏకంగా 80 డాలర్ల దిగువకు పడిపోయింది. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ధర 79.02 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. ఇది గత మూడు నెలల కాలంలోనే అత్యంత కనిష్ట స్థాయి. అదేవిధంగా, డబ్ల్యూటీఐ (WTI) క్రూడ్ ఆయిల్ ధర 76.15 డాలర్లకు పడిపోగా, మర్బన్ క్రూడ్ ధర కూడా 7 శాతం కంటే ఎక్కువ క్షీణించి 71 డాలర్ల వద్ద స్థిరపడింది. ఈ విధంగా ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు భారీగా తగ్గడంతో, అన్ని దేశాలపైనా ఉన్న ద్రవ్యోల్బణం (ధరల పెరుగుదల) ముప్పు ఒక్కసారిగా తగ్గిపోయింది.
తాజావార్తలు
-
Dr Priyanka Murder Case: డాక్టర్ ప్రియాంక హత్య కేసు.. నిందితుల రిమాండ్ పొడిగింపు!
-
Alaska Plane Crash: ఘోర విమాన ప్రమాదం.. ఇద్దరు పైలట్లతో సహా 8 మంది మృతి
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్‌తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Missi Jersey Auction: ఒకే వేలంలో మెస్సీ, రొనాల్డో ఫైట్.. ఊహించని ధరకు అమ్ముడైన దిగ్గజాల జెర్సీలు..
-
Prabhas Fauji: ‘ఫౌజీ’లో అదిరిపోయే యాక్షన్ బ్లాక్స్.. పీక్స్‌కు చేరిన హైప్.. బాక్సాఫీస్ తగలబడిపోద్ది ఇగ!
ట్రెండింగ్
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్‌కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్‌తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!
-
గూగుల్ బంపర్ ఆఫర్.. వారందరికీ ఏడాది పాటు Google AI Plus ఉచితం.!
-
6.7 అంగుళాల AMOLED 2x డిస్ప్లే, 50MP కెమెరాతో ఆగస్టు 27న రానున్న Samsung Galaxy S26 FE 5G..!