6.7 అంగుళాల AMOLED 2x డిస్ప్లే, 50MP కెమెరాతో ఆగస్టు 27న రానున్న Samsung Galaxy S26 FE 5G..!
- Samsung Galaxy S26 FE 5G ఆగస్టు 27, 2026న లాంచ్ ..
- భారత్‌లో లాంచ్ ఈవెంట్ సాయంత్రం 5:30 గంటలకు ప్రారంభం
- ఫోన్లో 6.7 అంగుళాల Dynamic AMOLED 2X డిస్ప్లే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Samsung Galaxy S26 FE 5G: శాంసంగ్ గెలాక్సీ ఎస్26 సిరీస్‌లో మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చేందుకు రంగం సిద్ధమైంది. శాంసంగ్ గెలాక్సీ S26 FE 5G (Samsung Galaxy S26 FE 5G) పేరుతో రానున్న ఈ ఫోన్‌ను ఆగస్టు 27న అధికారికంగా లాంచ్ కానుంది. ఇప్పటికే ఈ ఫోన్‌కు సంబంధించిన పలు వివరాలు ఆన్లైన్లో లీక్ అయ్యాయి. మొదట ఈ ఫోన్ సెప్టెంబర్ 2026లో విడుదలయ్యే అవకాశం ఉందని వార్తలు వచ్చినప్పటికీ.. తాజాగా శాంసంగ్ ఆగస్టులో కొత్త గెలాక్సీ ఎస్26 సిరీస్ ఫోన్ కోసం లాంచ్ ఈవెంట్‌ను ప్రకటించింది.
శాంసంగ్ ఆగస్టు 27, 2026న కొత్త గెలాక్సీ ఎస్26 సిరీస్ మొబైల్ ను లాంచ్ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ లాంచ్ ఈవెంట్ వర్చువల్‌గా జరగనుంది. శాంసంగ్ అధికారిక వెబ్సైట్ ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షించవచ్చు. భారత్‌లో ఈ లాంచ్ ఈవెంట్ ఆగస్టు 27న సాయంత్రం 5:30 గంటలకు ప్రారంభం కానుంది. ఇది కేవలం భారత్ కోసం నిర్వహించే ఈవెంట్ కాదు. అయితే శాంసంగ్ ఈ ఫోన్ పేరును అధికారికంగా వెల్లడించలేదు. అయినప్పటికీ ఈ లాంచ్ గెలాక్సీ S26 FE 5G కోసమేనని టెక్ వర్గాల్లో గుసగుసలు వినపడుతున్నాయి.
Also Read
- iQOO Neo 12: iQOO Neo 12 లాంచ్‌కు రెడీ?.. గీక్‌బెంచ్‌లో 16GB RAMతో లిస్టింగ్.. 9,000mAh బ్యాటరీ?
- STAR LINK: మస్క్ చేతిలో డేంజర్ వెపన్! ఈ కారణంతోనే కేంద్రం ఆచితూచి వ్యవహరిస్తోందా?
- Red Magic 12 Pro+: 8,400mAh బ్యాటరీతో Red Magic 12 Pro+.. RGB లిక్విడ్ కూలింగ్‌తో కొత్త గేమింగ్ ఫోన్!
- AI Dance Video: "ప్రాంప్ట్ ఇదిగో".. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
డైనమిక్ AMOLED 2X డిస్ప్లే:
లీక్‌ల ప్రకారం ఇందులో 6.7 అంగుళాల డైనమిక్ AMOLED 2X డిస్ప్లే ఉండనుంది. ఈ స్క్రీన్ 2340 × 1080 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో పాటు 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేసే అవకాశం ఉంది. గరిష్ఠంగా 1900 నిట్స్ బ్రైట్నెస్ను అందించవచ్చని సమాచారం. దీంతో వీడియోలు, గేమింగ్, ఇతర మల్టీమీడియా కంటెంట్‌ను మంచి విజువల్ క్వాలిటీతో చూడొచ్చు.
Exynos 2500 ప్రాసెసర్:
పనితీరు విషయానికి వస్తే.. గాలక్సీ S26 FE 5Gలో శాంసంగ్ సొంత Exynos 2500 చిప్‌సెట్‌ను అందించే అవకాశం ఉంది. దీనికి 8GB ర్యామ్, 256GB ఇంటర్నల్ స్టోరేజ్ జతకానున్నట్లు తెలుస్తోంది. ఫోన్ ఆండ్రాయిడ్ 17 ఆధారిత One UI 9తో వచ్చే అవకాశం ఉంది. శాంసంగ్ ఇటీవల విడుదల చేసిన కొత్త ఫోల్డబుల్ ఫోన్లలోనూ ఆండ్రాయిడ్ 17 ఆధారిత One UI 9ను అందించింది. అదే సాఫ్ట్వేర్ అనుభవాన్ని గ్యాలక్సీ S26 FEలోనూ అందించే అవకాశం ఉంది.
ట్రిపుల్ కెమెరా సెటప్:
కెమెరాల విషయానికి వస్తే.. ఈ ఫోన్ వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉండనుందని సమాచారం. ఇందులో 50MP ప్రైమరీ కెమెరా, 8MP టెలిఫోటో కెమెరాతో పాటు అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉండే అవకాశం ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 12MP కెమెరాను అందించనున్నట్లు సమాచారం.
బ్యాటరీ & ఫాస్ట్ ఛార్జింగ్:
Galaxy S26 FE 5Gలో 4,900mAh బ్యాటరీని అందించే అవకాశం ఉంది. ఇది 45W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేయనుందని సమాచారం. బ్యాటరీ సామర్థ్యం, ఫాస్ట్ ఛార్జింగ్ కలయికతో సాధారణ వినియోగంలో రోజంతా బ్యాకప్ అందించే అవకాశం ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ గ్రే, మింట్ అనే రెండు కలర్ ఆప్షన్లలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు లీక్‌లు సూచిస్తున్నాయి. అయితే ధర, ఇండియా విక్రయ తేదీ, పూర్తి స్పెసిఫికేషన్లపై శాంసంగ్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
తాజావార్తలు
-
Easy Egg Peeling Tips: ఉడికించిన గుడ్లను సులభంగా ఒలిచే సింపుల్ పద్ధతి.. ఈ చిన్న పొరపాట్లు చేయకండి!
-
Pinarayi Vijayan CMRL Case: మాజీ సీఎం పినరయి విజయన్‌కు హైకోర్టులో షాక్.. CMRL కేసులో FIRకు ఆదేశం!
-
Cancer Medicines Price Update: క్యాన్సర్ మందుల ధరలపై కేంద్రం కీలక నిర్ణయం.. 70 శాతం వరకు తగ్గింపు?
-
Basit Ali: నానా పటేకర్ ఇచ్చిన ఆ సలహా ఇప్పటికీ మర్చిపోలేను.. పాకిస్థాన్ మాజీ క్రికెటర్ భావోద్వేగం..!
-
BC Reservations Case: బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ.. పిటిషన్ డిస్మిస్ చేసిన సుప్రీంకోర్టు
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!