Dr Priyanka Murder Case: డాక్టర్ ప్రియాంక హత్య కేసు.. నిందితుల రిమాండ్ పొడిగింపు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజమండ్రిలో సంచలనం సృష్టించిన డాక్టర్ ప్రియాంక హత్య కేసులో నిందితుల రిమాండ్‌ను జిల్లా కోర్టు మరోసారి పొడిగించింది. ఈ కేసులో నిందితులు సూరవరపు దస్వంత్, జోసెఫ్ ఎడ్వర్డ్స్‌లకు విధించిన పోలీస్ కస్టడీ ముగియడంతో.. వీరిని రాజమహేంద్రవరం జిల్లా కోర్టులో పోలీసులు హాజరుపరిచారు. పోలీస్ కస్టడీ సమయంలో నిందితులను పలుమార్లు విచారించిన దర్యాప్తు అధికారులు కేసుకు సంబంధించిన పలు కీలక అంశాలపై సమాచారం సేకరించినట్లు తెలుస్తోంది.
కస్టడీ గడువు పూర్తికావడంతో నిందితులను కోర్టు ఎదుట ప్రవేశపెట్టగా.. కేసు విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో వారి రిమాండ్‌ను న్యాయస్థానం మరో 14 రోజులు పొడిగించింది. కోర్టు ఆదేశాల అనంతరం నిందితులను కట్టుదిట్టమైన భద్రత నడుమ తిరిగి రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించి అప్పగించారు. డాక్టర్ ప్రియాంక హత్య కేసు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో దర్యాప్తు అధికారులు అన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నారు. ఈ కేసులో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశముందని పోలీసులు భావిస్తున్నారు. దర్యాప్తు పురోగతిపై ప్రజల్లో ఉత్కంఠ కొనసాగుతోంది.
Also Read
తాజావార్తలు
-
Virat Kohli Bat: విరాట్ కోహ్లీ బ్యాట్ రహస్యం ఇదే.. దీని ప్రత్యేకతలు, ధర ఎంతో తెలుసా?
-
Rajinikanth Dharman: సూపర్ స్టార్ క్రేజీ ప్రాజెక్ట్.. విలన్ రోల్లో తెలుగు స్టార్ హీరో!
-
SS Rajamouli: రాజమౌళి నెక్స్ట్ హీరో అతడేనా..? హింట్ ఇచ్చేసిన జక్కన్న..!
-
Tirupati Crane Accident: తిరుపతిలో ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి, ఇద్దరికి గాయాలు
-
Golden Bhagyam Glimpse: టాలీవుడ్, కోలీవుడ్ కమెడియన్ల సినిమా.. నవ్వులు పూయిస్తోన్న గ్లింప్స్!
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!