Kerala New DGP: ఆంధ్రప్రదేశ్ వాసి కేరళలో కీలక బాధ్యతలు చేపట్టనున్నారు.. వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన షేక్ దర్వేష్ సాహెబ్ కేరళ రాష్ట్ర డీజీపీగా నియమితులయ్యారు. కేరళ పోలీస్ బాస్‌గా ఈ రోజు బాధ్యతలు స్వీకరించనున్నారు షేక్ దర్వేష్ సాహెబ్.. జిల్లాలోని పోరుమామిళ్ల బెస్తవీధికి చెందిన మహబూబ్‌సాహెబ్, గౌసియాబేగం దంపతుల కుమారుడైన షేక్ దర్వేష్ సాహెబ్.. 1990 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ ఆఫీసర్.. కేరళ కేడర్‌లో విధులు నిర్వహిస్తూ వస్తున్న ఆయనను ఇప్పుడు పోలీస్ బాస్ పోస్ట్ వరించింది.. ఈ ఐపీఎస్ అధికారి పుట్టి పెరిగిన ఊరు పోరుమామిళ్ల. ఆయన తండ్రి ఫారెస్ట్ డిపార్ట్మెంట్‌మెంట్‌లో ఉద్యోగం చేస్తూ బెస్తవీధిలో నివాసం ఉండేవారు. ఇక, దర్వేష్ సాహెబ్.. 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు పోరుమామిళ్ల OLF పాఠశాలలో చదివారు. ఆరు నుండి 10వ తరగతి వరకు ప్రభుత్వ స్కూల్‌లో, ఇంటర్ పట్టణంలోని గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ లో అభ్యసించారు.. ఆ తర్వాత డిగ్రీ, పీజీ తిరుపతిలో పూర్తి చేశారు.
Read Also: Delhi University: మోడీ పర్యటనతో ఢిల్లీ యూనివర్సిటీలో ఆంక్షలు.. నల్లరంగు దుస్తులు ధరించవద్దని ఆదేశాలు
ఐఏఎస్ కావడమే లక్ష్యంగా పెట్టుకున్న ఆయన.. పట్టుదలకుండా కష్టపడ్డాడు.. తొలిసారి ఇండియన్ ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్‌లో సెలెక్ట్ అయ్యారు.. కానీ, ఆయన టార్గెట్ ఐఏఎస్ కావడంతో.. ఇండియన్ ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్‌ను వదిలేసి.. మరోసారి ఐఏఎస్ కు ప్రిపేర్ అయ్యారు. ఈసారి ఐపీఎస్ కేరళ క్యాడర్‌కు సెలెక్ట్ అయ్యారు.. దీంతో.. కేరళలో ఉద్యోగాన్ని మొదలు పెట్టారు. నెడుమంగడ్‌లో అదనపు పోలీసు సూపరింటెండెంట్‌గా తన సేవను ప్రారంభించిన షేక్, వయనాడ్, కాసరగోడ్, కన్నూర్ మరియు పాలక్కాడ్ జిల్లాల్లో జిల్లా పోలీసు చీఫ్‌గా పనిచేశాడు. రాష్ట్ర రైల్వే పోలీస్ మరియు స్టేట్ స్పెషల్ బ్రాంచ్‌లో సూపరింటెండెంట్‌గా పనిచేశారు. అతను సాయుధ బెటాలియన్‌లో కూడా పనిచేశాడు. కొసోవాలోని యూఎన్ శాంతి పరిరక్షక మిషన్‌లో భాగంగా ఉన్నాడు. నేషనల్ పోలీస్ అకాడమీలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా, డిప్యూటీ డైరెక్టర్‌గా కూడా విధులు నిర్వహించారు.. పదోన్నతి పొందిన తర్వాత పోలీస్ హెడ్ క్వార్టర్స్, క్రైమ్ బ్రాంచ్, విజిలెన్స్, లా అండ్ ఆర్డర్, నార్త్ జోన్‌లో ఏడీజీపీగా పనిచేశారు. ప్రస్తుతం, షేక్ ఫైర్ అండ్ రెస్క్యూ సర్వీసెస్‌లో డైరెక్టర్ జనరల్‌గా ఉండగా.. ఇప్పుడు కేరళ డీజీపీగా బాధ్యలు స్వీకరించబోతున్నారు.. అయితే, ప్రస్తుత పోలీస్ చీఫ్ అనిల్ కాంత్. ఈ రోజు పదవీ విరమణ చేయనున్నారు.