ప్రపంచ క్రికెట్ లో టెస్ట్ లు, వన్డేలకు అలవాటు పడిన సమయంలో క్రికెట్ కు మరింత క్రేజీ తీసుకొచ్చి మార్గంలో టీ20 ఫార్మేట్ ని ఇంట్రడ్యూస్ చేశారు. ఇలా 20 ఓవర్ల మ్యాచ్ మొదలైన తర్వాత బిసిసిఐ మొదలుపెట్టిన ఐపీఎల్ ఏ రేంజ్ లో విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇందులో భాగంగానే ప్రస్తుతం ఐపీఎల్ 17వ సీజన్ జరుగుతోంది. అయితే ప్రతి ఏడాది ఐపీఎల్ లో భాగంగా బీసీసీఐ కొత్త కొత్త రూల్స్ తీసుకొస్తుంది. బౌలర్స్ కు, బ్యాటర్స్ కు సమాన అవకాశాలు కల్పిస్తూ ఐపీఎల్ ను మరింత ముందుకు తీసుకెళ్తున్నారు. అయితే ఐపీఎల్ లో వర్తించే రూల్స్ కొన్ని ఐసీసీ నిర్వహిస్తున్న టి20 లకు వర్తించవు. ఈ సంవత్సరం చివరిలో జరగబోయే టి20 వరల్డ్ కప్ లో కూడా ఈ ఐపీఎల్ రూల్స్ మధ్య కన్ఫ్యూజ్ లేకుండా ఏ రూల్స్ తేడా ఉంటాయో ఒకసారి తెలుసుకుందాం.
ఇంపాక్ట్ ప్లేయర్: గత సంవత్సరం జరిగిన ఐపీఎల్ 16వ సీజన్లో భాగంగా ఈ కొత్త రూల్ తీసుకువచ్చింది బీసీసీఐ. ఈ సీజన్లో కూడా ఈ రూల్ కంటిన్యూ అవుతుంది. ఈ రూల్ ఉపయోగించి టీం లోని 12 అడగడని ప్లేయింగ్ 11 లో ఉన్న ఇతర ఆటగాడితో మ్యాచ్ లో సమయంలోనైనా ఆటగాడిని రీప్లేస్ చేసుకోవచ్చు.
Also Read: Venkatesh : వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబో మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ ఫిక్స్..
నోబాల్, వైడ్ బాల్ చాలెంజ్:
కేవలం ఎల్బిడబ్ల్యు వరకే డిఆర్ఎస్ పద్ధతిని ఉపయోగిస్తున్న సమయంలో.. పేర్లు ఇచ్చిన నోబాల్, వైడ్ బాల్స్ ను కూడా ఛాలెంజ్ చేసే విధంగా ఈ రూల్ ను తీసుకోవచ్చారు. అయితే ఇది ఇంటర్నేషనల్ టి20 లలో లేదు.
స్ట్రాటెజిక్ టైమౌట్:
ఐపీఎల్ లో 20 ఓవర్ల సమయంలో రెండుసార్లు 2 నిమిషాల 30 సెకండ్ల పాటు బ్రేకులు తీసుకోవచ్చు. ఇందులో మొదటి టైమౌట్ ఫిల్లింగ్ సైడ్ కోసం.. ఆరు నుంచి తొమ్మిది ఓవర్ల మధ్య తీసుకోవాల్సి ఉండగా.. రెండో టైమ్ అవుట్ బ్యాటింగ్ చేసే జుట్టు కోసం 13 నుంచి 16 ఓవర్ల మధ్య తీసుకోవాల్సి ఉంటుంది.
Also Read: Holi Celebrations : హోలీలో సెలబ్రేషన్స్ కు కండీషన్స్.. ఇలా చేస్తే కఠిన చర్యలు
రెండు బౌన్సర్స్:
ఇది ప్రస్తుతం జరిగే ఐపీఎల్ 17 సీజన్ నుండి మొదలుపెట్టారు. ఇదివరకు కేవలం ఒక్క ఓవర్లో ఒక్క బౌన్సర్ వేసేందుకే అనుమతి ఇవ్వగా.. ప్రస్తుతం దానిని ఓవర్లో రెండు బంతులకు బోన్సర్లు వేసే విధంగా మార్పులు చేశారు. అయితే టి20 లలో కేవలం ఒక్క బంతి వరకే పరిమితం కొనసాగుతుంది.
ఇక ఈ ఏడాది ఐపిఎల్ లో స్మార్ట్ రిప్లై సిస్టం మొదలుపెట్టారు. దీంతో బ్రాడ్ క్యాస్టర్ అవసరం లేకుండా కచ్చితంగా నిర్ణయాలు తీసుకునే విధంగా కొత్త టెక్నాలజీని ఉపయోగించారు. అయితే ఇది కేవలం ఐపీఎల్ వరకే పరిమితం కానుంది. ఇక 2024 లో జరగబోయే టి20 ప్రపంచ కప్ లో ఐసీసీ కొత్తగా ‘స్టాప్ క్లాక్’ నిర్ణయాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. ఇందులో ముందు ఓవర్ ముగిసిన తర్వాత మరో ఓవర్ని కేవలం 60 సెకండ్ల లోపు మొదలు పెట్టాల్సి ఉంటుంది. ఒకవేళ ఇలా జరగకపోతే అంపేర్స్ రెండుసార్లు ఫీలింగ్ టీమ్ ను హెచ్చించిన తర్వాత.. బ్యాటింగ్ టీంకు 5 పరుగులను జమ చేస్తారు. కాకపోతే ఇది ఐపీఎల్ లో లేదు.