Venkatesh : వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబో మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ ఫిక్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ నటించిన సైంధవ్ మూవీ సంక్రాంతి కానుకగా విడుదల అయి డిజాస్టర్ గా నిలిచింది. అయితే, ‘సైంధవ్’ మూవీ తర్వాత వెంకటేష్…తనకు ‘ఎఫ్ 2’, ‘ఎఫ్ 3′ వంటి మంచి హిట్స్ అందించిన అనిల్ రావిపూడితో సినిమా చేయబోతున్నారు. వెంకటేష్, అనిల్ రావిపూడి కలయికలో వస్తున్న ఈ హ్యాట్రిక్ సినిమాకు బ్లాక్ బస్టర్ మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించనున్నారు. ఆల్రెడీ భీమ్స్ ఈ మూవీ మ్యూజిక్ వర్క్ స్టార్ట్ చేసినట్లు తెలిసింది.’బలగం’, ‘మ్యాడ్’ వంటి సూపర్ హిట్ సినిమాలకు లాస్ట్ ఇయర్ భీమ్స్ మ్యూజిక్ అందించారు. రెండు మూడు సినిమాలకు స్పెషల్ సాంగ్స్ కూడా చేశారు. ఈ ఏడాది విడుదల అయిన ‘రజాకార్’ మూవీ కూడా ఆయనకు మంచి పేరు తెచ్చింది. ప్రస్తుతం భీమ్స్ ‘టిల్లు స్క్వేర్’కు రీ రికార్డింగ్ చేస్తున్నారు. అది కాకుండా ఆయన చేతిలో నాలుగైదు సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు వెంకీ సినిమా కూడా యాడ్ అయింది..
హీరో వెంకటేష్..దర్శకుడు అనిల్ రావిపూడి..సంగీత దర్శకుడు భీమ్స్..ఈ ముగ్గురి కలయికలో వస్తున్న ఫస్ట్ సినిమా ఇది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన మొదటి మూడు సినిమాలకు సాయి కార్తీక్ సంగీతం అందించారు. ఆ తర్వాత మూడు సినిమాలకు దేవి శ్రీ ప్రసాద్ పని చేశారు. ‘భగవంత్ కేసరి’కి తమన్ వర్క్ చేశారు. ఇప్పుడు వెంకీ సినిమాకు సూపర్ ఫామ్ కంటిన్యూ చేస్తున్న భీమ్స్ ను తీసుకున్నారు. అయితే క్రేజీ కాంబోలో వస్తున్న ఈ మూవీ వెంకటేష్ కు 76వ చిత్రం కావడం విశేషం..మే లేదా జూన్ నెలలో వెంకటేష్, అనిల్ రావిపూడి సినిమా సెట్స్ మీదకు వెళ్లే అవకాశాలు ఉన్నాయని ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల దగ్గుబాటి వారి ఇంట్లో పెళ్లి సందడి ముగిసింది. విక్టరీ వెంకటేష్ రెండో కుమార్తె హయ వాహిని మరియు డాక్టర్ నిశాంత్ వివాహం ఘనంగా జరిగింది.
Also Read
- Pakistan: "మక్కా ఒప్పందం అండగా లేదు".. సౌదీ-హౌతీ వార్‌లో పాకిస్తాన్ డ్యామెజ్ కంట్రోల్..
- Trump-Jinping: సెప్టెంబర్ 24న వైట్‌హౌస్‌లో ట్రంప్‌తో జిన్‌పింగ్ భేటీ.. కీలక అజెండా ఇదేనా?
- SKY: సూర్యకుమార్ యాదవ్ 36వ పుట్టినరోజు.. 'మిస్టర్ 360' అరుదైన రికార్డుల ప్రయాణం ఇలా..
- CM Revanth Reddy: బాహుబలి సీన్‌ను రీక్రియేట్.. వినాయక మండపంలో రేవంత్ రెడ్డి విగ్రహం!
తాజావార్తలు
-
Pakistan: “మక్కా ఒప్పందం అండగా లేదు”.. సౌదీ-హౌతీ వార్‌లో పాకిస్తాన్ డ్యామెజ్ కంట్రోల్..
-
Trump-Jinping: సెప్టెంబర్ 24న వైట్‌హౌస్‌లో ట్రంప్‌తో జిన్‌పింగ్ భేటీ.. కీలక అజెండా ఇదేనా?
-
SKY: సూర్యకుమార్ యాదవ్ 36వ పుట్టినరోజు.. ‘మిస్టర్ 360’ అరుదైన రికార్డుల ప్రయాణం ఇలా..
-
Asia Cup Trophy Row: అది ప్లేయర్స్ నిర్ణయం కాదు.. బీసీసీఐది!
-
Tharun – Eesha: జంటగా గణపయ్య పూజలో తరుణ్ భాస్కర్ – ఈషా రెబ్బ ! ఇక పెళ్లికి అఫీషియల్ ప్రకటన వచ్చినట్లేనా ?
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!