ఫ్రాంచైజీలు తమ రిటైన్డ్ ప్లేయర్ జాబితాలను సమర్పించేందుకు అక్టోబర్ 31ని గడువుగా ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ నిర్ణయించింది. ఐపీఎల్ 2025 కోసం ఓ ఫ్రాంచైజీ ఆరుగురు ప్లేయర్లను రిటైన్ చేసుకోవచ్చు. అందులో గరిష్టంగా అయిదుగురు క్యాప్డ్ ప్లేయర్లు, ఇద్దరు అన్‌క్యాప్డ్ ప్లేయర్స్ ఉండాలి. ఆరుగురినినేరుగా రిటైన్ చేసుకోవచ్చు, లేదా ఆర్‌టీఎమ్ కార్డ్‌తో వేలంలో దక్కించుకోవచ్చు. రిటైన్ లిస్ట్‌ను సమర్పించడానికి ఫ్రాంచైజీలకు మరికొన్ని గంటలు మాత్రమే గడువు ఉంది. ఇప్పటికే ఫ్రాంచైజీలు దాదాపుగా తమ రిటైన్ లిస్ట్‌ను ఖరారు…