IPL Retention 2025: ఢిల్లీ క్యాపిటల్స్ షాకింగ్ నిర్ణయం.. మెగా వేలంలోకి పంత్! కన్నేసిన మూడు టీమ్స్
- ఢిల్లీ కెప్టెన్సీలో మార్పు
- మెగా వేలంలోకి పంత్
- కన్నేసిన మూడు టీమ్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2025 మెగా వేలంకు సంబంధించి రిటెన్షన్ రూల్స్‌ను ఇటీవలే బీసీసీఐ ప్రకటించిన విషయం తెలిసిందే. ఓ ఫ్రాంచైజీ ఆరుగురు ప్లేయర్లను రిటైన్ చేసుకునే వెసులుబాటును కల్పించింది. ఇందులో గరిష్టంగా అయిదుగురు క్యాప్డ్ ప్లేయర్లు, ఇద్దరు అన్క్యాప్డ్ ప్లేయర్స్ ఉండాలి. ప్రాంచైజీలు తమ రిటెన్షన్ లిస్ట్‌ను సమర్పించేందుకు అక్టోబర్ 31 తుది గడువు. గడువు సమీపిస్తున్న నేపథ్యంలో ఓ షాకింగ్ న్యూస్ బయటికొచ్చింది. ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ) కెప్టెన్ రిషబ్ పంత్.. ఆ ఫ్రాంచైజీని వీడనున్నట్లు తెలుస్తోంది.
ఐపీఎల్ ట్రోఫీ ఢిల్లీ క్యాపిటల్స్‌కు అందని ద్రాక్షగానే మిగిలింది. ఈసారి ఎలాగైనా ట్రోఫీ దక్కించుకోవాలని చూస్తున్న డీసీ.. సంచలన నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటికే రికీ పాంటింగ్‌ను కోచ్ బాధ్యతల నుంచి, సౌరవ్ గంగూలీని డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ పదవి నుంచి తప్పించింది. వీరి స్థానాల్లో హేమాంగ్ బదాని, వేణుగోపాల్ రావులను తీసుకుంది. ఇక కెప్టెన్సీలోనూ మార్పు చేయాలని ఢిల్లీ మేనేజ్మెంట్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. కెప్టెన్సీ మార్పుకు రిషబ్ పంత్ ఒప్పుకోలేదట. తనకే సారథ్య బాధ్యతలు కావాలని డిమాండ్ చేశాడట. పంత్ డిమాండ్‌ను డీసీ యాజమాన్యం ఒప్పుకోలేదట. దాంతో ఢిల్లీని వీడాలని పంత్ డిసైడ్ అయిపోయాడట. ఈ మేరకు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
Also Read
- Off The Record: తెలంగాణ బీజేపీలో 'నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్'
- NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
- Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
- Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్‌లోకి వైభవ్
Also Read: Pant-Kohli: విరాట్ కోహ్లీని దాటేసిన రిషబ్ పంత్! అగ్ర స్థానంలో బుమ్రా
మెగా వేలంలోకి వస్తున్న రిషబ్ పంత్‌ను దక్కించుకోవడానికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఇప్పటికే ప్రయత్నాలు మొదలెట్టినట్లు తెలుస్తోంది. ఆర్సీబీకి ఇప్పుడు కెప్టెన్, వికెట్ కీపర్ అవసరం ఎంతో ఉంది. దినేష్ కార్తీక్ వీడ్కోలు పలకగా.. ఫాఫ్ డుప్లెసిస్‌ను రెటైన్ చేసుకునే అవకాశం లేదు. పంత్‌తో అయినా రాత మారుతుందేమో అని ఆర్సీబీ భావిస్తోంది. మరోవైపు లక్నో సూపర్ జెయింట్స్, పంజాబ్ కింగ్స్ వంటి జట్లు కూడా తమ జట్టుకు కెప్టెన్‌గా పంత్‌ను కొనుగోలు చేయడంలో ఆసక్తిని కలిగి ఉన్నాయని సమాచారం.
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్‌లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్‌లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్‌తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!