Team India Schedule 2025: ముగిసిన ఆస్ట్రేలియా పర్యటన.. టీమిండియా తదుపరి షెడ్యూల్ ఇదే!
- ముగిసిన ఆస్ట్రేలియా పర్యటన
- టీమిండియా తదుపరి షెడ్యూల్ ఇదే
- దక్షిణాఫ్రికా-టీమిండియా పర్యటన పూర్తి షెడ్యూల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆస్ట్రేలియాతో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత జట్టు 2-1 తేడాతో గెలుచుకుంది. ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య సిరీస్‌లోని చివరి మ్యాచ్ నవంబర్ 8న బ్రిస్బేన్‌లోని గబ్బాలో జరిగింది. వర్షం కారణంగా ఆ మ్యాచ్ రద్దయింది. 2008 నుంచి ఆస్ట్రేలియా గడ్డపై భారత్ పొట్టి సిరీస్‌ను కోల్పోలేదు, ఆ పరంపరను ఇంకా కొనసాగిస్తోంది. ఆస్ట్రేలియా పర్యటనలో భారత జట్టు ఐదు టీ20 మ్యాచ్‌లు, మూడు వన్డే సిరీస్ ఆడింది. శుభ్‌మాన్ గిల్ కెప్టెన్సీలో వన్డే సిరీస్‌ను 1-2 తేడాతో కోల్పోయినా.. సూర్య సారథ్యంలో పొట్టి సిరీస్‌ను ఖాతాలో వేసుకుంది. ఆస్ట్రేలియా నుంచి నేడు టీమిండియా ప్లేయర్స్ భారత్ చేరుకోనున్నారు.
ఆస్ట్రేలియా పర్యటన తర్వాత భారత ఆటగాళ్లకు పెద్దగా విరామం లేదు. భారత జట్టు దక్షిణాఫ్రికాతో రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌లను స్వదేశంలో ఆడనుంది. భారత్-దక్షిణాఫ్రికా మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ నవంబర్ 14న కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో ఆరంభం కానుంది. ఈ మ్యాచ్‌కు వారం కంటే తక్కువ సమయం మాత్రమే ఉంది. రెండవ టెస్ట్ మ్యాచ్ నవంబర్ 22న గౌహతిలోని బర్సపారా క్రికెట్ స్టేడియంలో జరగనుంది. వన్డే సిరీస్‌లో తొలి మ్యాచ్ నవంబర్ 30న రాంచీలో జరుగుతుంది. రెండవ మ్యాచ్ డిసెంబర్ 3న రాయ్‌పూర్‌లో, చివరి వన్డే డిసెంబర్ 6న విశాఖపట్నంలో జరుగుతుంది.
Also Read
- Bhagwant Mann: ఢిల్లీ ఎయిర్‌పోర్టులో సీఎం భగవంత్ మాన్కు అవమానం.. ఆప్ ఆగ్రహం
- AP Municipal Elections: జీవీఎంసీ ఎన్నికల్లో కూటమి సీట్ల సర్దుబాటు పూర్తి.. ఏ పార్టీకి ఎన్ని స్థానాలంటే..?
- CM Chandrababu: పోలీసుల త్యాగాలకు సెల్యూట్.. ధైర్యంతో పాటు మానవత్వం అవసరం..
- Simon Harmer: 18 ఏళ్ల రికార్డు బద్దలు.. బౌలర్‌గా వచ్చి బ్యాటింగ్‌లో అదరగొట్టి..
దక్షిణాఫ్రికా, భారత్ జట్ల మధ్య చివరగా టీ20 సిరీస్ జరగనుంది. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లోని మొదటి మ్యాచ్ డిసెంబర్ 9న కటక్‌లో జరగనుంది. ఆ తర్వాతి మ్యాచ్‌లు వరుసగా డిసెంబర్ 11న (ముల్లన్పూర్), డిసెంబర్ 14న (ధర్మశాల), డిసెంబర్ 17న (లక్నో), డిసెంబర్ 19న (అహ్మదాబాద్) జరుగుతాయి. భారత్, దక్షిణాఫ్రికా టీమ్స్ టెస్ట్ సిరీస్ కోసం తమ జట్లను ప్రకటించాయి. టెస్ట్ సిరీస్‌లో భారత జట్టుకు శుభ్‌మాన్ గిల్.. దక్షిణాఫ్రికా జట్టుకు టెంబా బావుమా నాయకత్వం వహిస్తారు. వన్డే, టీ20 సిరీస్‌లకు జట్లను ఇంకా ప్రకటించలేదు.
Also Read: Koti Deepotsavam 2025: వేంకటేశ్వరస్వామి కళ్యాణం, గరుడ వాహన సేవ.. 9వ రోజు విశేష కార్యక్రమాలు ఇవే!
టెస్టు సిరీస్ కోసం భారత జట్టు:
శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రిషబ్ పంత్ (వైస్ కెప్టెన్/వికెట్ కీపర్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, దేవదత్ పడిక్కల్, ధృవ్ జురెల్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, నిహమ్ రాజ్ పట్రాహ్, జస్ప్రీత్ కుమార్ పట్రాహ్, జస్ప్రీత్ కుమార్ పట్రాహ్. కుల్దీప్ యాదవ్ మరియు ఆకాష్ దీప్.
టెస్ట్ సిరీస్ కోసం దక్షిణాఫ్రికా టెస్ట్ జట్టు:
టెంబా బావుమా (కెప్టెన్), కార్బిన్ బాష్, డెవాల్డ్ బ్రూయిస్, టోనీ డి జోర్జి, జుబైర్ హంజా, సైమన్ హర్మర్, మార్కో జాన్సెన్, కేశవ్ మహరాజ్, ఐడెన్ మార్క్రామ్, వియాన్ ముల్డర్, సెనురన్ ముత్తుసామి, కగిసో రబ్లీక్ వెర్రెక్టన్, ర్యాన్రైక్ వెర్కీటన్ ట్రిస్టన్ స్టబ్స్.
దక్షిణాఫ్రికా పర్యటన పూర్తి షెడ్యూల్:
1వ టెస్ట్: నవంబర్ 14 నుండి 18 వరకు, కోల్‌కతా
2వ టెస్ట్: నవంబర్ 22 నుండి 26 వరకు, గౌహతి
1వ వన్డే: నవంబర్ 30, రాంచీ
2వ వన్డే: డిసెంబర్ 3, రాయ్‌పూర్
3వ వన్డే: డిసెంబర్ 6, విశాఖపట్నం
1వ టీ20: డిసెంబర్ 9, కటక్
2వ టీ20: డిసెంబర్ 11, ముల్లన్పూర్
3వ టీ20: డిసెంబర్ 14, ధర్మశాల
4వ టీ20: డిసెంబర్ 17, లక్నో
5వ టీ20: డిసెంబర్ 19, అహ్మదాబాద్
తాజావార్తలు
-
Bhagwant Mann: ఢిల్లీ ఎయిర్‌పోర్టులో సీఎం భగవంత్ మాన్కు అవమానం.. ఆప్ ఆగ్రహం
-
AP Municipal Elections: జీవీఎంసీ ఎన్నికల్లో కూటమి సీట్ల సర్దుబాటు పూర్తి.. ఏ పార్టీకి ఎన్ని స్థానాలంటే..?
-
Police Martyrs’ Day 2026: పోలీసు అమరవీరుల సంస్మరణ దినం 2026.. పోలీసు కుటుంబాలకు సీఎం రేవంత్ రెడ్డి భరోసా
-
CM Chandrababu: పోలీసుల త్యాగాలకు సెల్యూట్.. ధైర్యంతో పాటు మానవత్వం అవసరం..
-
Tiger Shroff Firing Case: టైగర్ ష్రాఫ్ కాల్పుల కేసు.. ఇద్దరు మహిళలు సహా నలుగురు అరెస్ట్!
ట్రెండింగ్
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!
-
Smartphone Battery Draining: స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ త్వరగా డ్రెయిన్ అవుతుందా? త్వరగా ఈ సెట్టింగ్స్ మార్చేసేయండి అంతే..!
-
Transfer WhatsApp Chats: గూగుల్ డ్రైవ్ బ్యాకప్‌లతో పనిలేకుండా.. వాట్సాప్ చాట్స్ ఎలా ట్రాన్స్ఫర్ చేయాలంటే.? సింపుల్ ప్రాసెస్ ఇదిగో..
-
165Hz డిస్ప్లే, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్తో అక్టోబర్ 27న రాబోతున్న REDMI K100..!
-
Virat Kohli: కోహ్లీకి గోల్డెన్ ఛాన్స్.. సాధిస్తే ప్రపంచంలో తొలి బ్యాటర్‌గా రికార్డు.!