Betting : ఐపీఎల్ వచ్చిందంటే చాలు.. 45 రోజులు పాటు యువత బెట్టింగ్ ఆడుతూనే ఉంటారు ..బాల్ ..బాల్..కి బెట్టింగ్ చేస్తూ డబ్బులు పోగొట్టుకునే వాళ్ళు పోగొట్టుకుంటారు.. వచ్చేవాళ్ళకు వస్తేనే ఉంటాయి ..ఆన్లైన్ బెట్టింగ్లపై నిఘా ఉండడంతో ఇప్పుడు వాట్సాప్ లో టెలిగ్రామ్ లో బెట్టింగ్లో మొదలయ్యాయి.. బెట్టింగ్ మాఫియా చిన్న గ్రూపులను తయారుచేసి ఆ గ్రూపుల ద్వారా బెట్టింగ్ ఆడిస్తుంది ..స్థాయిని బట్టి గ్రూపులు ఏర్పాటు చేసి పెట్టి నిర్వహిస్తది. జాతీయ అంతర్జాతీయ స్థాయి నుంచి గల్లి వరకు బెట్టింగ్ స్వేచ్ఛగా నడుస్తుంది. బెట్టింగ్ మాఫియాని కంట్రోల్ చేసేందుకు అటు పోలీసులు నానా ప్రయత్నాలు చేస్తున్నారు బెట్టింగ్ అనేది లేకుండా చేయాలని ప్లాన్ చేస్తున్నారు కానీ మాఫియా మాత్రం వాట్సాప్ టెలిగ్రామ్ ఇంస్టాగ్రామ్ లో కోడ్ భాషల్లో ఈ బెట్టింగులు నిర్వహిస్తుంది. ఎవరైతే బెట్టింగ్ పాలుపంచుకుంటున్నారో వాళ్లకు డైరెక్టుగా లింకులు వస్తున్నాయి ..అదే మాదిరిగా బెట్టింగ్ ఆడుతున్న వారికి వాట్సప్ గ్రూపులో యాడ్ అయిపోతున్నారు ..టెలిగ్రామ్ లో లెక్కలేనంత లిమిట్స్ లేకపోవడంతో అందులో చాలామంది ఆడ్ అవుతున్నారు ..గుట్టు గా పర్సన్ టు పర్సన్ నడుస్తున్న ఈ బెట్టింగ్ వ్యవహారం చేసేందుకు అధికారులు సైతం తీవ్ర ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.. హాట్ ఫేవరెట్ గా ఉన్న జట్లపైన ఈ డబ్బులు మరీ ఎక్కువగా పెట్టేస్తున్నారు. చాలామంది అప్పులు చేసి మరీ బెట్టింగ్ ఆడుతున్నారు.. బెట్టింగ్ మాఫియాని కట్టడి చేయడానికి అధికారులు ప్రత్యేక దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేశారు అయినప్పటికీ కూడా బెట్టింగ్ కంట్రోల్ లోకి రాకపోగా విపరీతమైపోయింది..
జట్టు.. కెప్టెన్ …. ఓవర్ ..సిక్స్ లు ఫోర్లు గ్రౌండ్ ఇలా ఒకటేమిటి క్రికెట్లో ఉన్న అన్నిటి మీద బెట్టింగ్ నడుస్తుంది.. పట్టణం, పల్లె అనే తేడా లేకుండా జోరుగా సాగుతోంది. జూదం వ్యసనంలా మారి జేబులు ఖాళీ చేస్తోంది. క్రికెట్, ఆటగాళ్లపై అభిమానం హద్దు మీరి యువతలో వ్యసనంగా మారుతోంది. ఆటను చూసి ఆనందించాల్సి పోయి ఏకంగా బెట్టింగ్‌కు పాల్పడుతూ ఇల్లు గుల్ల చేసుకుంటున్నారు. వేలాది రూపాయలు బెట్టింగ్ కాస్తూ కొందరు యువకులు అప్పుల పాలవుతున్నారు. ఈ బెట్టింగ్ వ్యవహారం పట్టణ ప్రాంతాల్లోనే కాకుండా గ్రామీణ ప్రాంతాలకూ చేరింది. బెంగళూరు రాయల్ చాలెంజ్, గుజరాత్ టైటాన్స్ జట్లపై పది వేలు పోయినయిరా. ఆర్సీబీ గెలుస్తుందని పది వేలు బెట్టింగ్ పెట్టిన జీటీ గెలిచిందిరా. నా డబ్బులే కాదురా పది మందిమి ఆర్సీబీ గెలుస్తుందని పది వేల చొప్పున బెట్టింగ్ పెటినం. అందరి డబ్బులు పోయినయ్..” ఇదీ ఇద్దరు యువకుల మధ్య జరిగిన ఫోన్ సంభాషణ. ఐపీఎల్ బెట్టింగ్ జోరుగా సాగుతుందనడానికి వీరి సంభాషణే ఉదాహరణగా చెప్పొచ్చు. మ్యాచ్‌కు ముందుగానే జట్టు బలాలను అంచనా వేస్తూ బెట్టింగ్‌కు పాల్పడుతున్నారు. కొందరు అభిమాన కెప్టెన్లపై నమ్మకంతో బెట్టింగ్‌కు దిగుతుండగా.. మరికొందరు జట్టులోని క్రీడాకారులు ఆటతీరుపై బెట్టింగ్‌లు కాస్తున్నట్లు తెలిసింది. ఒక్కోసారి వారి అంచనాలు తారుమారై నష్టపోతున్నట్లు తెలిసింది.
బెట్టింగ్ చెల్లింపులు అన్నీ ఫోన్ పే ద్వారానే సాగుతున్నాయి. బెట్టింగ్‌లో పాల్గొనే వ్యక్తులు మధ్యవర్తికి ఫోన్ పే ద్వారా డబ్బులు పంపిస్తున్నారు. ఏ జట్టు గెలిస్తే ఆ జట్టు తరపున బెట్టింగ్ కాచిన వ్యక్తికి మధ్యవర్తి డబ్బులు చెల్లించే విధంగా ముందుగానే ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారని సమాచారం. అధికారులు స్పందించి బెట్టింగ్‌లకు కళ్లెం వేయాల్సిన అవసరం ఉంది. లేదంటే మే నెల 25న జరిగే ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ వరకు బెట్టింగ్‌ల జోరు కొనసాగే అవకాశాలున్నాయి.. ఇప్పటికే చాలామంది బెట్టింగ్ యాప్లలో డబుల్ పెట్టి పోగొట్టుకున్నారు.. కొంతమంది యువకులు ఆత్మహత్య చేసుకున్నారు.. కొందరు తీరని ఆర్థిక నష్టాల్లో కోరుకొని పోయారు ..అయితే ఈ బెట్టింగ్ యాప్లు కావచ్చు బెట్టింగ్లకు పాల్పడవద్దని పోలీసులు సూచిస్తున్నారు.. బెట్టింగ్ అంతా కూడా మాయ అని దాని ఉచ్చులో పడవద్దు అని అధికారులు చెప్తున్నారు..
Kalki-2 : కల్కి-2పై నాగ్ అశ్విన్ అప్ డేట్.. షూటింగ్ ఎప్పుడంటే..?