MS Dhoni: అది ధోని అంటే.. ఆయన కోసం సిఎస్కె జట్టు ఏకంగా.?
- చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ఓ పాత నిబంధనను మళ్లీ అమలు చేయనున్నారు.
- ఐదేళ్ల క్రితం అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైరైన ఆటగాళ్లను ఈ నిబంధన అన్ క్యాప్డ్ కేటగిరీలో ఉంచుతుంది.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MS Dhoni CSK Team: రాబోయే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) మెగా వేలం కోసం ప్లేయర్ రిటెన్షన్‌కు సంబంధించిన నిబంధనలను భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (బిసిసిఐ) ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అయితే.. కొన్ని నివేదికల ప్రకారం, అభ్యర్థన మేరకు బోర్డు అలా నిర్ణయించింది. ఇకపోతే చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ఓ పాత నిబంధనను మళ్లీ అమలు చేయనున్నారు. ఇది ఫ్రాంచైజీకి మాజీ భారత కెప్టెన్ MS ధోనిని నిలుపుకోవడంలో సహాయపడుతుంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు చూస్తే..
Jatadhara First Look: సుధీర్ బాబు ‘జటాధర’ ఫస్ట్ లుక్ విడుదల..
Also Read
- Indiramma Indlu: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు శుభవార్త.. అదనంగా మరో రూ.72 వేలు అకౌంట్లోకి..
- Trump-Netanyahu: అమెరికా-ఇజ్రాయెల్ ఎన్నికల ముందు ఇరాన్‌పై దాడి జరగనుందా? ట్రంప్-నెతన్యాహు ఏం చర్చించారు?
- Vangaveeti Radhakrishna: జనసేనలోకి వంగవీటి రాధాకృష్ణ?.. పటమటలో వెల్లివిరిసిన బ్యానర్లు!
- Rain Alert: మరో మూడు రోజులు వర్షాలు.. ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన జల్లులు!
ఐదేళ్ల క్రితం అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైరైన ఆటగాళ్లను ఈ నిబంధన అన్ క్యాప్డ్ కేటగిరీలో ఉంచుతుంది. ఈ నియమం ఐపీఎల్ ప్రారంభ సీజన్ నుండి 2021 వరకు అమలులో ఉంది. ఏ ఫ్రాంచైజీ ఈ నియమాన్ని ఉపయోగించనందున ఇది తీసివేయబడింది. అయితే నివేదిక ప్రకారం, జూలై 31న ఫ్రాంచైజీలు, బీసీసీఐ మధ్య జరిగిన సమావేశంలో CSK ఈ సమస్యను లేవనెత్తింది. ఈ నియమాన్ని మళ్లీ అమలు చేయాలని యాజమాన్యం బోర్డుని అభ్యర్థించింది. ఇకపోతే CSKకి ఇతర ఫ్రాంచైజీల నుండి పెద్దగా మద్దతు లభించనప్పటికీ, బీసీసీఐ ఈ నియమాన్ని తిరిగి ప్రవేశపెట్టడానికి అనుకూలంగా ఉంది. ఇది ధోనిని ఒక అన్‌క్యాప్డ్ ప్లేయర్ గా ఉంచడానికి, దాని ప్రధాన క్యాప్డ్ ప్లేయర్ లను కూడా ఉపయోగించుకునేలా చేస్తుంది. దింతో ఇప్పుడు ఈ నియమం తిరిగి వచ్చే అవకాశం ఉంది. గత నెలలో జరిగిన సమావేశంలో ఇది వివరంగా చర్చించబడింది. ఆటగాళ్లకు సంబంధించిన నిబంధనలను ప్రకటించినప్పుడు దానిని తిరిగి తీసుకురావచ్చని సమాచారం.
హైదరాబాద్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ధోనీ, ఐపీఎల్లో తన భవిష్యత్తు పూర్తిగా రాబోయే వేలం కోసం రిటెన్షన్ నిబంధనలపై ఆధారపడి ఉంటుందని అంగీకరించినప్పుడు ఈ పరిణామం వెలుగులోకి వచ్చింది. ఈ సందర్బంగా.. “అందుకు చాలా సమయం ఉంది. ప్లేయర్ రిటెన్షన్ తదితరాలపై వాళ్లు ఏం నిర్ణయం తీసుకుంటారో చూడాలి. ప్రస్తుతానికి బంతి మన కోర్టులో లేదు. కాబట్టి నియమాలు, నిబంధనలు లాంఛనప్రాయమైన తర్వాత నేను నిర్ణయం తీసుకుంటాను. కానీ, ఈ జట్టు భారత్ కు మేలు చేసేలా ఉండాలని ధోనీ పేర్కొన్నాడు. 2022లో రూ. 12 కోట్లకు అంటిపెట్టుకున్న ధోనీ, 2024 సీజన్ ప్రారంభానికి ముందే సీఎస్‌కే కెప్టెన్సీ నుంచి వైదొలిగి రుతురాజ్ గైక్వాడ్‌కు బాధ్యతలు అప్పగించాడు.
తాజావార్తలు
-
Indiramma Indlu: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు శుభవార్త.. అదనంగా మరో రూ.72 వేలు అకౌంట్లోకి..
-
Trump-Netanyahu: అమెరికా-ఇజ్రాయెల్ ఎన్నికల ముందు ఇరాన్‌పై దాడి జరగనుందా? ట్రంప్-నెతన్యాహు ఏం చర్చించారు?
-
Vangaveeti Radhakrishna: జనసేనలోకి వంగవీటి రాధాకృష్ణ?.. పటమటలో వెల్లివిరిసిన బ్యానర్లు!
-
Rain Alert: మరో మూడు రోజులు వర్షాలు.. ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన జల్లులు!
-
Rohit Sharma MI Captain: మళ్లీ ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ.. హింట్ ఇచ్చేసిన ఫ్రాంచైజీ!
ట్రెండింగ్
-
12,070mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో హానర్ నుంచి పవర్ఫుల్ ఫోన్లు వచ్చేస్తున్నాయ్..!
-
Temba Bavuma: కెప్టెన్‌గా మొదటి ఓటమి.. ప్రపంచ రికార్డుతో చరిత్ర సృష్టించిన బవుమా..!
-
IND vs WI 4th T20I: నేడు భారత్-వెస్టిండీస్ నాలుగో టీ20.. పిచ్ రిపోర్ట్, లైవ్ స్ట్రీమింగ్, ప్లేయింగ్ 11 ఇవే!
-
7 అంగుళాల Liquid Retina డిస్ప్లేతో ఇంటిని స్మార్ట్‌గా మార్చే Apple HomeView.. Siri AIతో అదిరిపోయే ఫీచర్లు..!
-
ఇక రిమోట్‌తో పనిలేదు.. వాయిస్‌తోనే ఫుల్ కంట్రోల్..! Siri AI, A19 చిప్‌తో కొత్త Apple TV 4K లాంచ్..