ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 మెగా వేలం నవంబర్ 24, 25 తేదీల్లో సౌదీ అరేబియాలోని జెడ్డాలో జరుగుతోంది. మెగా వేలంలో 577 మంది ఆటగాళ్లపై బిడ్డింగ్ జరగనుంది. అయితే, గరిష్టంగా 204 మంది ఆటగాళ్లను మాత్రమే విక్రయిస్తారు. ఐపీఎల్‌లో ఇది 18వ వేలం కావడం విశేషం.