DD vs LSG: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024లో నాల్గవ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ (DC) లక్నో సూపర్ జెయింట్స్ (LSG)తో తలపడనుంది. ఈ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు కెప్టెన్‌గా అక్షర్ పటేల్ ముందుండి నడిపించనున్నాడు. అలాగే మరోవైపు లక్నో సూపర్ జెయింట్స్‌కు రిషబ్ పంత్ నాయకత్వం వహిస్తున్నాడు. ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. వైజాగ్ లోని వైఎస్ రాజశేఖర రెడ్డి స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. ఈ పిచ్ బ్యాటింగ్ కు అనుకూలంగా ఉండడంతో ఎక్కువ స్కోరింగ్‌కు చేసేందుకు అవకాశం ఉంటుంది. గత ఐపీఎల్ సీజన్‌లో ఈ మైదానంలో కోల్‌కతా నైట్ రైడర్స్ 272 పరుగుల భారీ స్కోరు సాధించింది.
ఈ మ్యాచ్‌ను అభిమానులు JioHotstar ద్వారా ప్రత్యక్ష ప్రసారంగా వీక్షించవచ్చు. అలాగే, స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్స్ ద్వారా టీవీలో లైవ్ టెలికాస్ట్ అందుబాటులో ఉంటుంది. ఇక ఈ రెండు జట్ల మధ్య మొత్తం 5 మ్యాచ్లు జరగగా ఇందులో ఢిల్లీ క్యాపిటల్స్ (DC) 2 సార్లు విజయం సాధించగా., లక్నో సూపర్ జెయింట్స్ (LSG) 3 సార్లు విజయం సాధించారు.
Read Also: RBI: బ్యాంక్ కస్టమర్లకు షాక్.. ఏటీఎం ఛార్జీలు పెంపు.. అమల్లోకి ఎప్పటినుంచంటే?
ప్రస్తుతం, ఇది వరకు జట్టుతో పోలిస్తే లక్నో సూపర్ జెయింట్స్ జట్టు మరింత బలంగా కనిపిస్తోంది. LSG జట్టులో డేవిడ్ మిల్లర్, నికోలస్ పూరన్, రిషబ్ పంత్ వంటి హిట్టింగ్ ఆటగాళ్లు ఉన్నారు. మిడిల్ ఆర్డర్‌లో ఐడెన్ మార్క్రామ్, షాబాజ్ అహ్మద్, ఆయుష్ బడోని వంటి బ్యాట్స్‌మెన్స్ ఉన్నారు. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో చూసినట్లైతే కెఎల్ రాహుల్, అక్షర్ పటేల్ వంటి ప్రధాన ఆటగాళ్లు ఉన్నారు. బౌలింగ్ విభాగంలో కుల్దీప్ యాదవ్, మిచెల్ స్టార్క్, ముఖేష్ కుమార్ వంటి అనుభవజ్ఞులైన బౌలర్లు కూడా ఉన్నారు. అయితే ఢిల్లీతో పోలిస్తే LSG జట్టు కాస్త బలంగా కనపడుతోంది. మరి ఈ సారైనా ఢిల్లీ క్యాపిటల్స్ కు కలిసి వస్తుందో లేదో. ఇక నేడు ఇరు జట్ల ఆడే ప్లేయింగ్ XI ను ఈ విధంగా అంచనా వేయవచ్చు.
Read Also: Hit3 : హిట్-3 ఫస్ట్ సాంగ్ వచ్చేసింది..
ఢిల్లీ క్యాపిటల్స్ (DC) ప్లేయింగ్ XI:
అక్షర్ పటేల్ (కెప్టెన్), అభిషేక్ పోరెల్, కెఎల్ రాహుల్, ఫాఫ్ డు ప్లెసిస్, జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్, ట్రిస్టన్ స్టబ్స్, మిచెల్ స్టార్క్, ముఖేష్ కుమార్, కుల్దీప్ యాదవ్, టి నటరాజన్, మోహిత్ శర్మ.
LSG ప్లేయింగ్ XI:
రిషబ్ పంత్ (కెప్టెన్ & వికెట్ కీపర్), అర్షిన్ కులకర్ణి, డేవిడ్ మిల్లర్, నికోలస్ పూరన్, మిచెల్ మార్ష్, ఆయుష్ బడోని, అబ్దుల్ సమద్, రాజ్‌వర్ధన్ హంగర్గేకర్, షాబాజ్ అహ్మద్, రవి బిష్ణోయ్, షమర్ జోసెఫ్.