IPL 2025 Auction: శ్రేయస్ అయ్యర్‌పై ఆ రెండు టీమ్స్ కన్నేసాయి.. గవాస్కర్ బోల్డ్ ప్రిడిక్షన్!
- నవంబర్ 24, 25 తేదీలలో మెగా ఆక్షన్
- 574 మందిని షార్ట్ లిస్ట్ చేసిన బీసీసీఐ
- అయ్యర్‌పై గవాస్కర్ బోల్డ్ ప్రిడిక్షన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 మెగా వేలానికి సమయం ఆసన్నమైంది. నవంబర్ 24, 25 తేదీలలో సౌదీ అరేబియాలోని జెడ్డా వేదికగా మెగా ఆక్షన్ జరగనుంది. వేలానికి మొత్తంగా 1,574 మంది ఆటగాళ్లు పేర్లను నమోదు చేసుకోగా.. అందులో 574 మందిని బీసీసీఐ షార్ట్ లిస్ట్ చేసింది. ఇందులో 366 మంది భారత ఆటగాళ్లు, 208 మంది విదేశీ ప్లేయర్లు ఉన్నారు. ఇక 204 ఆటగాళ్లను కొనుగోలు చేయడానికి 10 ఫ్రాంచైజీలు సిద్ధమయ్యాయి.
ఐపీఎల్ 2025 మెగా వేలంలో టీమిండియా స్టార్ ప్లేయర్స్ రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్‌లు ఉన్నారు. కెప్టెన్సీ అనుభవం ఉన్న ఈ ముగ్గురిపై కాసుల వర్షం కురవనుంది. మెగా వేలం నేపథ్యంలో శ్రేయస్ గురించి భారత దిగ్గజ క్రికెటర్, వ్యాఖ్యాత సునీల్ గవాస్కర్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. కోల్‌కతా నైట్ రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ ప్రాంఛైజీలు శ్రేయస్ కోసం పోటీ పడతాయని తెలిపారు. వేలంలో శ్రేయస్ వచ్చినప్పుడు కేకేఆర్ బిడ్ (రైట్ టు మ్యాచ్) వేస్తుందని, ఢిల్లీ కూడా అతని కోసం ప్రయత్నించవచ్చని బోల్డ్ ప్రిడిక్షన్ చెప్పారు.
Also Read
- Thick Milk Cream: పాలపై మీగడ రావడం లేదా? 1-5-6 ఫార్ములా ట్రై చేయండి.. మందమైన మీగడ పొందండి.!
- Sanath Jayasuriya: టీమిండియా భవిష్యత్తు వైభవ్.. కానీ.. బీసీసీఐకి వరల్డ్ కప్ హీరో కీలక సలహా..
- YCP Protest: డీఎస్సీ స్పోర్ట్స్ కోటా వివాదం.. నేడు వైసీపీ నిరసన.. పోటీగా టీచర్ల ర్యాలీ?
- Rain Alert: బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం.. పలు జిల్లాలో అత్యంత భారీ వర్షాలు!
స్టార్ స్పోర్ట్స్ షో ‘గేమ్ ప్లాన్’లో సునీల్ గవాస్కర్ మాట్లాడుతూ… ‘గత సంవత్సరం కేకేఆర్ టైటిల్ గెలిచినప్పుడు శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్‌గా ఉన్నాడు. నేను ఇంతకు ముందు చెప్పినట్లు రిషబ్ పంత్ ఫీజు విషయంలో భిన్నాభిప్రాయాలు రావొచ్చు. అయితే శ్రేయాస్ వేలంలోకి వచ్చిన తర్వాత కేకేఆర్ బిడ్ వేయొచ్చని నేను భావిస్తున్నాను. ఢిల్లీ కూడా ప్రయత్నించవచ్చు. పంత్ దక్కని సందర్భంలో శ్రేయస్ కోసం ఢిల్లీ తప్పక ట్రై చేస్తుంది. పంత్ కోసం ఢిల్లీ ఆర్‌టీఎమ్ కార్డ్ ఉపయోగిస్తుంది కూడా. ఎందుకంటే ఢిల్లీకి కెప్టెన్ అవసరం ఉంది’ అని చెప్పుకొచ్చారు.
Also Read: Shreyas Iyer: కెప్టెన్‌గా శ్రేయస్.. అయ్యర్ సారథ్యంలో సూర్యకుమార్!
ఐపీఎల్ 2025 కోసం సునీల్ నరైన్, ఆండ్రీ రస్సెల్, రింకూ సింగ్, రమణదీప్ సింగ్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తిలను కేకేఆర్ అట్టిపెట్టుకుంది. రింకు రూ.13 కోట్లతో కేకేఆర్ టాప్ రిటెన్షన్ కాగా.. వరుణ్, సునీల్, రస్సెల్‌లను రూ.12 కోట్లతో రిటైన్ చేసుకుంది. అన్‌క్యాప్డ్ ప్లేయర్ కేటగిరీ కింద రూ.4 కోట్లతో హర్షిత్, రమణదీప్‌లతో ఒప్పందం చేసుకుంది. ఐపీఎల్ 2024లో కేకేఆర్‌ను ఛాంపియన్‌గా నిలిపిన శ్రేయస్ అయ్యర్‌ను రిటెన్షన్ చేసుకుందామనుకున్నా.. అతడు ఒప్పుకోలేదు. మరి శ్రేయాస్ ఏ జట్టుకు ఆడుతాడో చూడాలి.
తాజావార్తలు
-
El Nino: ధరల మోత మరోసారి మోగనుంది.. సామాన్యులను నిండా ముంచిన ఎల్‌నినో!
-
Abhishek-Vaibhav: స్వదేశంలో సింహం, విదేశాల్లో పిల్లి.. అభిషేక్, సూర్యవంశీలపై మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
Asian Games 2026: షూటింగ్లో మరో రజత పతకం.. టేబుల్ టెన్నిస్‌లో పాకిస్థాన్‌ను 3-0తో చిత్తు చేసిన భారత్
-
Thick Milk Cream: పాలపై మీగడ రావడం లేదా? 1-5-6 ఫార్ములా ట్రై చేయండి.. మందమైన మీగడ పొందండి.!
-
Hanuman Ansh: ‘హనుమాన్ అంశ్’ను 15 సార్లు చూసిన నీమ్ కరోలి బాబా కుమార్తె.. ప్రతిసారీ కన్నీళ్లే..
ట్రెండింగ్
-
Jio vs Airtel: రూ.3,599 ప్లాన్.. ఏడాది వ్యాలిడిటీతో పాటు OTT + అనేక ప్రయోజనాలు.. ఏది బెస్ట్.?
-
Suryakumar Yadav: ధోనీ, కోహ్లీ, రోహిత్ టాలెంట్ వద్దు.. ఆ ఒక్కడిలో ఆ ఒక్క టాలెంట్ దొంగిలిస్తా!
-
iPhone 18 Pro Max: ఐఫోన్ 18 ప్రో మాక్స్ ఛార్జింగ్ టెస్ట్‌లో సంచలనం..
-
Jio యూజర్లకు అదిరిపోయే ఆఫర్.. ఏడాది పాటు Amazon Prime Lite ఫ్రీ.. ఎలా పొందాలంటే.?
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!