IPL 2024 CSK vs GT Dream11 Team Prediction: ఐపీఎల్ 2024లో భాగంగా నేడు రసవత్తర సమరం జరుగనుంది. గత సీజన్ విజేత చెన్నై సూపర్ కింగ్స్, రన్నరప్ గుజరాత్ టైటాన్స్ తలపడనున్నాయి. చెన్నైలోని చిదంబరం స్టేడియంలో రాత్రి 7.30కు ఈ మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ సీజన్‌లో ఇరు జట్లు తమ తొలి మ్యాచ్‌ల్లో విజయాలు సాధించి మంచి జోష్‌లో ఉన్నాయి. చెన్నై తమ తొలి మ్యాచ్‌లో బెంగళూరుపై.. గుజరాత్ తమ తొలి మ్యాచ్‌లో ముంబైపై గెలుపొందాయి. దాంతో రెండో విజయం ఎవరు సాధిస్తారో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
హెడ్ టు హెడ్ రికార్డుల్లో చెన్నై సూపర్ కింగ్స్‌పై గుజరాత్ టైటాన్స్ పైచేయి కలిగి ఉంది. ఇరుజట్లు ఇప్పటివరకు ఐదు మ్యాచ్‌ల్లో ఎదురుపడగా.. గుజరాత్ 3, చెన్నై 2 మ్యాచ్‌ల్లో గెలుపొందాయి. ఇరు జట్లు గత సీజన్ ఫైనల్లో చివరిసారిగా తలపడ్డాయి. ఆ మ్యాచ్‌లో గుజరాత్‌ను ఓడించిన చెన్నై ఐదోసారి ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలిచింది. చెపాక్‌లో వాతావరణం ఆటకు ఆనువుగా ఉంటుంది. వాతావరణం నుంచి మ్యాచ్‌కు ఎలాంటి అవాంతరాలు ఉండవు. సొంత మైదానంలో ఆడనుండటంతో ఈ మ్యాచ్‌లో సీఎస్‌కే ఫెవరేట్ అని చెప్పాలి.
తుది జట్లు:
చెన్నై సూపర్ కింగ్స్: ఋతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), రచిన్ రవీంద్ర, అజింక్యా రహానే, డారిల్ మిచెల్, రవీంద్ర జడేజా, సమీర్ రిజ్వీ, ఎంఎస్ ధోనీ, దీపక్ చహర్, మహీశ తీక్షణ, ముస్తాఫిజుర్ రెహమాన్, తుషార్ దేశ్‌పాండే.
గుజరాత్ టైటాన్స్: శుభమాన్ గిల్ (కెప్టెన్), వృద్ధిమాన్ సాహా, సాయి సుదర్శన్, విజయ్ శంకర్, డేవిడ్ మిల్లర్, అజ్మతుల్లా ఒమర్జాయ్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, ఉమేష్ యాదవ్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, స్పెన్సర్ జాన్సన్.
Also Read: Hero Nani: హీరో నానిని కలిసిన బ్రిటీష్ డిప్యూటీ హైకమిషనర్!
డ్రీమ్ 11 టీమ్:
వికెట్ కీపర్: వృద్ధిమాన్ సాహా
బ్యాటర్లు: రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), శుభమన్ గిల్ (వైస్ కెప్టెన్), అజింక్యా రహానే, సాయి సుదర్శన్
ఆల్ రౌండర్లు: రవీంద్ర జడేజా, రచిన్ రవీంద్ర, అజ్మతుల్లా ఒమర్జాయ్
బౌలర్లు: రషీద్ ఖాన్, ముస్తాఫిజుర్ రెహమాన్, ఆర్ సాయి కిషోర్