Gareth Wynn Owen Meets Hero Nani: తెలుగు రాష్ట్రాలకు బ్రిటీష్ డిప్యూటీ హైకమిషర్‌గా వ్యవహరిస్తున్న గారెత్ విన్ ఓవెన్.. టాలీవుడ్ హీరో నానిని కలిశారు. హైదరాబాద్‌లో నాని నివాసానికి వెళ్లిన గారెత్.. మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ఈ విషయాన్ని గారెత్ తన ఎక్స్ ఖాతా ద్వారా తెలిపారు. నానిని కలవడం తనకు ఎంతో ఆనందం కలిగించిందని బ్రిటీష్ డిప్యూటీ హైకమిషనర్ తెలిపారు.
‘ నానిని కలవడం ఎంతో ఆనందం కలిగించింది. నాని సినీ, వ్యక్తిగత జీవితం గురించి అడిగి తెలుసుకున్నా. తెలుగు చిత్ర పరిశ్రమతో బ్రిటన్ సంబంధాలు ఏ విధంగా బలోపేతం చేసుకోవచ్చు అనే అంశంపై ఇద్దరం చర్చించాము. తాను నటించిన రెండు సినిమాలు చూడమని నేచురల్ స్టార్ నాని నాకు సూచించారు. ఏ సినిమాలు చూడాలో నాకు చెప్పండి’ అని గారెత్ విన్ ఓవెన్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. గారెత్‌కు నెటిజన్స్ తమ సలహాలు ఇస్తున్నారు.
Also Read: SRH vs MI: నగరానికి చేరుకున్న ముంబై, హైదరాబాద్ టీమ్స్.. ఉప్పల్ స్టేడియంలో ప్రాక్టీస్!
ఆ మధ్య కాస్త వెంబడిన నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం వరుస హిట్స్‌తో దూసుకుపోతున్నారు. దసరా, హాయ్ నాన్న సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్నాడు. ప్రస్తుతం ‘సరిపోదా శనివారం’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో మరో హిట్టుని అందుకొని.. హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాత డివివి దానయ్య నిర్మిస్తున్నారు. నాని సరసన ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రానికి జేక్స్ బిజోయ్ సంగీతం సమకూరుస్తున్నారు.
Absolute pleasure to meet @NameisNani to talk about his career behind and in front of the camera and how we can strengthen 🇬🇧 links with #Tollywood.
He suggested a couple of his movies to watch. Which Natural Star movie would you recommend? pic.twitter.com/0cGFWNock2
— Gareth Wynn Owen (@UKinHyderabad) March 25, 2024