Gujarat Titans Captaincy Optins for IPL 2024: ఐపీఎల్ ప్రాంచైజీ గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా.. మళ్లీ తన పాత జట్టు ముంబై ఇండియన్స్‌కు ఆడనున్నట్లు తెలుస్తోంది. ఆటగాళ్లను పరస్పరం మార్చుకునే ‘ట్రేడింగ్ విండో’ ద్వారా ముంబై, గుజరాత్ జట్ల మధ్య ఒప్పందం జరిగినట్లు ఓ స్పోర్ట్స్ వెబ్‌సైట్ తన కథనంలో పేర్కొంది. అయితే ఈ ఒప్పందంపై అటు గుజరాత్ గానీ.. ఇటు ముంబై గానీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఐపీఎల్ 2024కు సంబందించిన మినీ వేలం వచ్చే నెలలో జరగనుంది. రిటెన్షన్, రిలీజ్ ప్లేయర్స్ లిస్ట్ ప్రకటించేందుకు నవంబర్ 26 వరకు అన్ని జట్లకు అవకాశం ఉంది.
గుజరాత్ టైటాన్స్ యాజమాన్యంతో విభేదాల కారణంగా హార్దిక్ పాండ్యా ఆ ఫ్రాంచైజీని వీడనున్నాడని తెలుస్తోంది. ఒకవేళ హార్దిక్ గుజరాత్‌ను వీడితే.. కెప్టెన్ ఎవరు? అనే ప్రశ్న ఇప్పుడు అందరిలో మనస్సులో ఉంది. ప్రస్తుతం గుజరాత్ కెప్టెన్సీ రేసులో న్యూజీలాండ్ సారథి కేన్ విలియమ్సన్, టీమిండియా ఓపెనర్ శుభ్‌మన్ గిల్‌లు ముందు వరుసలో ఉన్నారు. అఫ్గాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్, దక్షిణాఫ్రికా సారథి డేవిడ్ మిల్లర్‌లు కూడా కెప్టెన్సీ పోస్ట్‌కు పోటీలో ఉన్నారు.
Also Read: China Pneumonia: చైనాలో విస్తరిస్తున్న కొత్తరకం న్యుమోనియా.. ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన!
హార్ధిక్ పాండ్యా స్థానాన్ని అనుభవం ఉన్న వ్యక్తితో భర్తీ చేయాలనుకుంటే.. కేన్ విలియమ్సన్ గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ అవుతాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో కేన్ ఇప్పటికే తానేంటో నిరూపించుకున్నాడు. ఆలా కాకుండా భవిష్యత్ కోణం, స్వదేశీ కెప్టెన్ కోణంలో చూస్తే శుభ్‌మన్ గిల్ సారథి అవుతాడు. గిల్ ఇదివరకే ఐపీఎల్‌తో పాటు అంతర్జాతీయ క్రికెట్‌లో తానేంటో ప్రూవ్ చేసుకున్నాడు. గత ఏడాదిన్నర కాలంగా పరుగుల వరద పారిస్తున్నాడు. భారత జట్టు భవిష్యత్ సారథి రేసులో గిల్ కూడా ఉన్నాడు. రషీద్ ఖాన్ గుజరాత్ టీమ్‌కు వైస్ కెప్టెన్. గత సీజన్‌లో పాండ్యా లేనప్పుడు సారథ్య బాధ్యతలు కూడా నిర్వహించాడు. అయితే ప్రధానంగా కేన్, గిల్ మధ్యనే పోటీ ఉన్నట్లు తెలుస్తోంది.