MLA Raja Singh: నన్ను అరెస్ట్ చేస్తే జరిగే విధ్వంసాలకు నేను బాధ్యుడిని కాదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLA Raja Singh: నన్ను అరెస్ట్ చేస్తే హనుమాన్ భక్తులు వింధ్వసం సృష్టిస్తే నేను బాధ్యుడిని కాదని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హనుమాన్ శోభాయాత్రకు బయలుదేరిన రాజాసింగ్‌ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఇటీవలి కాలంలో ఎక్కడికి వెళ్లినా మతంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నాడు రాజాసింగ్. తనపై కేసులు నమోదవుతున్నప్పటికీ రాజాసింగ్ మాత్రం వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తునే ఉన్నారు. అయితే తాజాగా శ్రీరామ నవమి సందర్భంగా నిర్వహించిన శోభాయాత్రలో రాజాసింగ్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ఈరోజు హనుమాన్ శోభాయాత్ర కొనసాగుతోంది. ఈ క్రమంలో రాజాసింగ్ ఈరోజు మళ్లీ ఎక్కడ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తారోనని భావించిన పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. అయితే రాజాసింగ్ మాట్లాడుతూ.. హనుమాన్ జయంతి ఉత్సవాల్లో ఎమ్మెల్యే రాజా సింగ్ అరెస్ట్ పాల్గొన్నారు. ప్రతి ఏడాది హనుమాన్ జయంతి ఉత్సవాల్లో బైక్ ర్యాలీలో పాల్గొనేందుకు బయలు దేరానని అన్నారు. ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో పోలీసులు చెప్పాలని అన్నారు. తెలంగాణ 8వ నిజాం రజాకార్ పోలీసుల వల్లే హిందువులను అణిచివేయలని చూస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారని అన్నారు. ఇలాంటి పరిస్థతుల్లో హిందువులు బతకగలుగుతారా? అంటూ ప్రశ్నించారు. నన్ను అరెస్ట్ చేస్తే హనుమాన్ భక్తులు వింధ్వసం సృష్టిస్తే నేను బాధ్యుడిని కాదని అన్నారు.
ఇది ఇలా ఉంటే.. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పై అనేక కేసులు నమోదవుతున్నాయి. ఏదో ఒక చోట, ఏదో ఒక కార్యక్రమంలో మతం, వర్గాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. ముంబైలో జరిగిన ఓ బహిరంగ సభలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారంటూ రెండు రోజుల క్రితం రాజాసింగ్ పై ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. అయినా రాజాసింగ్ తన తీరు మార్చుకోలేదు. ఎప్పటిలాగే రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తూ అందరిపై విరుచుకుపడుతున్నాడు. తాజాగా రాజాసింగ్ చేసిన మరో ప్రసంగంపై కేసు నమోదైంది. శ్రీరామ నవమి సందర్భంగా నిర్వహించిన శోభాయాత్రలో రాజాసింగ్ చేసిన ప్రసంగంపై ఎస్సై వీరబాబు అభ్యంతరం తెలిపారు. రాజాసింగ్ తన కుమారుడిని పరిచయం చేస్తూ ఇతర వర్గాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో ఎస్సై వీరబాబు ఎమ్మెల్యేపై అఫ్జల్‌గంజ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు రాజా సింగ్‌పై ఐపీసీ 153-ఎ, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
Also Read
- Telangana Eagle Force: సింథటిక్ డ్రగ్స్‌పై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం.. పరిశ్రమల నుంచి కొరియర్ సంస్థల వరకు నిఘా.!
- Fake Form-7 Applications: బోగస్ ఫారం-7 పత్రాల కలకలం.. 31 ఓట్ల తొలగింపునకు నకిలీ దరఖాస్తులు.!
- Bribe in Dead Drop Method: డెడ్ డ్రాప్ పద్ధతిలో లంచాలు.. టౌన్ ప్లానింగ్ అధికారి సునీత ట్రాప్‌లో సంచలన విషయాలు.!
- FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
ఇక మరోవైపు, జనవరి 29, 2023న ముంబైలో జరిగిన బహిరంగ సభలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినందుకు పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు. విద్వేషపూరిత ప్రసంగం చేసినందుకు ఐపీసీ సెక్షన్ 153ఏ 1(ఏ) కింద రాజాసింగ్‌పై ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదే వ్యాఖ్యలపై హైదరాబాద్ పోలీసులు రాజాసింగ్‌కు నోటీసులు కూడా అందించారు. ఒక కేసులో బెయిల్ మంజూరు చేసే సమయంలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయకూడదని తెలంగాణ హైకోర్టు షరతు విధించిందని నోటీసులో పేర్కొన్నారు. ఈ విషయమై పోలీసులు వివరణ కోరారు. అలాగే, 2022 అక్టోబర్‌లో హైదరాబాద్ శిల్పారామంలో హాస్యనటుడు మునవర్ షోకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ షోకు అనుమతి ఇవ్వడంపై రాజాసింగ్ సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేశారు. ఆ వీడియో మహ్మద్ ప్రవక్తకు వ్యతిరేకంగా ఉందని ఎంఐఎం నేతలు ఆరోపించారు. అనేక ముస్లిం సంఘాలు కూడా ఆందోళనలు నిర్వహించాయి. రాజాసింగ్‌పై నమోదైన కేసులను దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్ పోలీసులు పీడీ యాక్టు నమోదు చేసి జైలుకు తరలించారు. ఆ కేసులో గతేడాది నవంబర్ 9న హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.
Royal Enfield New Record: వాడు నడిపే బండీ.. రాయల్ ఎన్‌ఫీల్డు. సేల్స్‌లో కొత్త రికార్డు
తాజావార్తలు
-
Telangana Eagle Force: సింథటిక్ డ్రగ్స్‌పై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం.. పరిశ్రమల నుంచి కొరియర్ సంస్థల వరకు నిఘా.!
-
Indian Railways: చార్ట్ సిద్ధమైనా రైలు టికెట్ బుక్ చేసుకోవచ్చు.. ఈ ప్రత్యేక రూల్ తెలుసా?
-
Fake Form-7 Applications: బోగస్ ఫారం-7 పత్రాల కలకలం.. 31 ఓట్ల తొలగింపునకు నకిలీ దరఖాస్తులు.!
-
CM Chandrababu Delhi Visit: మరోసారి సీఎం చంద్రబాబు హస్తిన బాట.. ప్రధాని మోడీతో భేటీ..!
-
Bajaj Pulsar Festive Offer: Bajaj బైక్‌లపై అదిరిపోయే ఫెస్టివ్ ఆఫర్.. రూ.12,000 వరకు బెనిఫిట్స్, పూర్తి లిస్ట్ ఇదే!
ట్రెండింగ్
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి