RGV: రేపు నా బర్త్ డే, ఎవరూ విష్ చేయకండి రా.. బాబు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగుతో పాటు హిందీ చిత్ర పరిశ్రమలోనూ దర్శకుడిగా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తుంపు తెచ్చుకున్న వ్యక్తి రామ్ గోపాల్ వర్మ. తెలుగులో నాగార్జునతో కలిసి శివ సినిమా తీసి సంచలన విజయాన్ని అందుకున్నారు. ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమలో అగ్రశ్రేణి డైరెక్టర్లుగా కొనసాగుతున్న చాలా మంది ఆర్జీవీ దగ్గర పాఠాలు నేర్చుకున్న వాళ్లే.. హిందీలోనూ అమితాబ్ బచ్చన్ లాంటి సూపర్ స్టార్స్ తో పలు సినిమాలు తెరకిక్కించి అద్భుత విజయాలు అందుకున్నారు. ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ సినిమాల కంటే సోషల్ మీడియా ద్వారా బాగా పాపూలర్ అయ్యారు. సినిమాలు, రాజకీయాలు,సామాజికి అంశాలు ఒకటేమిటీ.. ప్రతిదాంట్లో ఆయన మార్క్ స్పందన కనిపిస్తుంది.
Tmrw the 7 th is my happy birthday..Please don’t wish me ..That’s because wishes are free and useless ..I am ok with cheap gifts ..CHEAP is better than FREE
Also Read
- UP Election 2027: ‘‘150 కాదు.. కాంగ్రెస్‌కు 50 సీట్లే ఎక్కువ’’.. ఎస్పీ-కాంగ్రెస్ మధ్య ముదురుతున్న విభేదాలు!
- AP Drought: ఏపీలో 544 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించాలి.. జాతీయ విపత్తుగా ప్రకటించాలి..
- Nara Lokesh: ఏపీలో 50 శాతం మంది ఎమ్మెల్యేలు యువత.. పరిశ్రమలకు కొత్త అర్థం చెప్పడమే మా లక్ష్యం..
- India vs Pakistan: పాకిస్థాన్‌ను చిత్తు చేసిన భారత్.. టీమిండియా ఖాతాలో మరో స్వర్ణం..
— Ram Gopal Varma (@RGVzoomin) April 6, 2023
Read Also : National Walking Day 2023: ఎంత నడిస్తే.. మీ గుండె అంత పదిలం
విషయం ఏదైనా తన స్టైల్లో ట్వీట్లు చేస్తుంటారు. వాస్తవానికి ఆర్జీవీ మాట్లాడే ప్రతి మాట చాలా లాజిక్ గా ఉంటుంది. తనకు నచ్చినట్లు ఉండటం.. తనకు నచ్చింది చేయడంలో ఆయన తర్వాతే మరెవరైనా అని చెప్పొకోవచ్చు. వాస్తవానికి తను చేసే పనులన్నీ అందరికీ నచ్చుతాయి. కానీ బయటకు చెప్పలేరు. పైగా ఆయనపై విమర్శలు చేస్తుంటారు. కానీ పరిశీలించి.. చూస్తే తను చేసేది కరెక్ట్ అనిపిస్తుంది. తాజాగా ఆయన చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. రేపు ( ఏప్రిల్ 7న ) ఆర్జీవీ బర్త్ డే.. అయితే తన బర్త్ డే సందర్భంగా ఎవరూ శుభాకాంక్షలు చెప్పకూడదని ఆయన ట్వీట్ చేశారు. విషెస్ అనేవి దేనికి పనికి రానివన్నారు.
Read Also : Donald Trump: అరెస్ట్ తర్వాత అమాంతం పెరిగిన డొనాల్డ్ ట్రంప్ ప్రజాదరణ…
దయచేసి తనకు రేపు నా పుట్టిన రోజు సందర్భంగా ఎవరు కూడా శుభాకాంక్షలు చెప్పకండి.. విషెస్ అనేవి ఉచితం అయినవి పనికి రానివి కూడా.. నేను చౌకైన బహుమతులతో సరిపెట్టుకుంటాను.. ఉచితం కంటే చౌక ఉత్తమం అని నా అభిప్రాయం అంటూ ఆర్జీవీ ట్వీ్ట్ లో పేర్కొన్నాడు. రామ్ గోపాల్ వర్మ రిసెంట్ గా తన డిగ్రీ పట్టా అందుకున్నారు. డిగ్రీ పూర్తయ్యాక 37 ఏళ్లకు ఆయన సర్టిఫికేట్ తసీుకోవడం విశేషం. ఎవరైనా పాస్ కాగానే సర్టిఫికేట్ తీసుకుంటారు. కానీ.. అలా తీసుకుంటే ఆయన ఆర్జీవీ ఎందుకు అవుతాడు. తాజాగా ఆచార్య నాగార్జున యూనివర్సిటీ అకాడామి ఎగ్జిబిషన్ కి వర్మ ముఖ్య అతిథిగా వెళ్లారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ అధికారులు ఆయనను సన్మానించారు. అదే సమయంలో బీటెక్ డిగ్రీ పట్టాని అందించి ఆశ్చర్యపరిచారు. ఈ పట్టాను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో వర్మ పంచుకున్నారు. నిజానికి ఆర్జీవీ సినిమాల్లోకి రాకముందు బీటెక్ చదివారు.. గుంటూరు నాగార్జున యూనివర్సిటీలో సివిల్ ఇంజనీర్ గా చేశారు. అయితే తనకు చిన్నప్పటి నుంచి సినిమాలు అంటే పిచ్చి.. ఎప్పుడూ సినిమాల గురించే ఆలోచించే వారు.. చదివాం అంటే చదివాం అన్నట్లు బీటెక్ కంప్లీట్ చేశాడు. చివరకు ఓ బార్డర్ మార్కులతో బయటపడ్డాడు. పాసయ్యాక కనీసం డిగ్రీ పట్టా కూడా తీసుకోలేదు.
తాజావార్తలు
-
Pan IIT Summit : చంద్రబాబు చూపు ఈవీపై.. ఏపీకి కొత్త టెక్నాలజీ ప్లాన్..
-
UP Election 2027: ‘‘150 కాదు.. కాంగ్రెస్‌కు 50 సీట్లే ఎక్కువ’’.. ఎస్పీ-కాంగ్రెస్ మధ్య ముదురుతున్న విభేదాలు!
-
Young Heroines : తల్లయితే తప్పేంటి?
-
Bollaram Army Weapons Theft: బొల్లారం ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. లోపలి వ్యక్తులే సూత్రధారులు
-
Venu Swamy : “నేను సన్నీ లియోన్ లాంటోడిని.. ఆల్రెడీ అన్నీ ఇప్పేసుకున్నా!”!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!