iPhone 14 Price Cut in Flipkart Big Billion Days Sale 2023: ‘యాపిల్’ కంపెనీ గత నెలలో ఐఫోన్ 15 సిరీస్‌ను లాంచ్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికీ 15 సిరీస్ అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. ఎప్పటిలానే.. కొత్త సిరీస్ 15 లాంచ్ అనంతరం పాత సిరీస్ 14 మోడళ్ల ధరలు తగ్గాయి. అయితే ఐఫోన్ 14 ధరలు మరింత తగ్గనున్నాయి. ఈ కామర్స్ దిగ్గజం ‘ఫ్లిప్‌కార్ట్’లో రూ. 50వేల కంటే తక్కువ ధరకే ఐఫోన్ 14ను సొంతం చేసుకోవచ్చు. ఈ విషయాన్ని ఫ్లిప్‌కార్ట్ స్వయంగా తెలిపింది.
అక్టోబర్ 8 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో ‘బిగ్ బిలియన్ డేస్’ సేల్ ఆరంభం కానుంది. అక్టోబర్ 8న మొదలయ్యే ఈ సేల్..15 వరకు కొనసాగుతుంది. ఫ్లిప్‌కార్ట్ ప్లస్, వీఐపీ మెంబర్స్‌కు ఒకరోజు ముందుగానే ఆఫర్స్ అందుబాటులో ఉండనున్నాయి. ఇప్పటికే ఫ్లిప్‌కార్ట్ వెబ్‌సైట్‌లో బ్లాక్‌బస్టర్ డీల్‌లకు సంబందించిన పోస్టర్స్ వచ్చేశాయి. ఐఫోన్ 12 రూ. 32,999 నుంచి ఆరంభం అవుతుందని ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది. ఇక ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్ ధరలు త్వరలోనే రివీల్ కానున్నాయని పేర్కొంది.
‘బిగ్ బిలియన్ డేస్’ సేల్ సందర్భంగా అన్ని డిస్కౌంట్లు కలిపి స్పెషల్ సేల్‌లో ఐఫోన్ 14ను రూ. 50వేల కంటే తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. ఐఫోన్ 14 ధర రూ. 50వేల లోపే ఉంటుందని టీజర్‌లో ఫ్లిప్‌కార్ట్ హింట్ ఇచ్చింది. సేల్‌లో ఈ ఫోన్ ధర మరింత తగ్గుతుందని పేర్కొంటూ.. ‘4?,???’ ఆఫర్‌ను గెస్ చేయాలని కస్టమర్లను టీజర్ పేజీలో అడుగుతోంది. ఈ లెక్కన బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో ఐఫోన్ 14 రూ. 49,999 లేదా అంతకంటే తక్కువకే లిస్ట్ కావచ్చు. ఇక బ్యాంక్, ఇతర ఆఫర్లతో ఈ ఫోన్ ధర భారీగా తగ్గే అవకాశం ఉంది.
Also Read: King Kohli: వన్డే ప్రపంచకప్‌కు విరాట్ కోహ్లీ సిద్ధం.. బ్రహ్మానందం మాదిరి స్టిల్స్ వైరల్!
ఐఫోన్ 14పై రూ. 30వేల వరకు ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ అందిస్తున్నట్లు ఫ్లిప్‌కార్ట్ టీజర్‌లో స్పష్టం చేసింది. స్పెషల్ సేల్‌లో ఈ ఆఫర్లు లిమిటెడ్ పీరియడ్ వరకే అందుబాటులో ఉంటాయని పేర్కొంది. ఒకవేళ పూర్తి ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ వర్తిస్తే.. మీకు ఐఫోన్ 14 దాదాపుగా రూ. 20,000లకు అందుబాటులో ఉంటుంది. ఎక్స్‌ఛేంజ్ చేసేముందు మీ పాత ఫోన్‌కు ఎంత వస్తుందో తెలుసుకుంటే బెటర్. ఏదేమైనా ఐఫోన్ 14ను తక్కువ ధరకు సొంత చేసుకునే అవకాశం మళ్లీ మళ్లీ రాదు అనే చెప్పాలి.