King Kohli: వన్డే ప్రపంచకప్‌కు విరాట్ కోహ్లీ సిద్ధం.. బ్రహ్మానందం మాదిరి స్టిల్స్ వైరల్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Virat Kohli’s Indian Jersey Pics Goes Viral: టీమిండియా మాజీ కెప్టెన్, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సొంత గడ్డపై జరుగుతున్న వన్డే ప్రపంచకప్ 2023కి సిద్దమవుతున్నాడు. వన్డే ప్రపంచకప్‌లో భాగంగా ఆదివారం (అక్టోబర్ 6) భారత్ తన తొలి మ్యాచ్ ఆస్ట్రేలియాతో ఆడనుంది. ఈ మ్యాచ్ కోసం ‘కింగ్ కోహ్లీ’ చైన్నైలోని చిదంబరం స్టేడియంలో శ్రమిస్తున్నాడు. ఆస్ట్రేలియా మ్యాచ్ కోసం 3-4 రోజుల క్రితమే చెన్నై చేరుకున్న.. విరాట్ ప్రాక్టీస్ ప్రారంభించాడు. భారత జట్టుకు టైటిల్ అందించాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతున్నాడు.
ప్రపంచకప్ 2023లో బరిలోకి దిగే కొత్త జెర్సీతో విరాట్ కోహ్లీ ఉన్న పోటోలను ఐసీసీ తన ఎక్స్‌లో పోస్ట్ చేసింది. అయితే కోహ్లీ పలు స్టిల్స్ ఇచ్చిన పిక్స్ పోస్ట్ చేసింది. ఐసీసీ పోస్ట్ చేసిన ఫోటోలలో విరాట్ గ్లోవ్, బ్యాట్ పట్టుకుని వెరైటీ స్టిల్స్ ఇచ్చాడు. ఇందుకు సంబందించిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ పోటోలను చూసిన ఫాన్స్ ఫన్నీగా కామెంట్స్ పెడుతున్నారు. ‘విరాట్ భయ్యా.. సూపర్ స్టిల్స్’, ‘ప్రపంచకప్ కొట్టాలి’, ‘బ్రహ్మానందం మాదిరి స్టిల్స్ సూపర్’ అని కామెంట్స్ చేస్తున్నారు.
Also Read
- ICC Rankings: ఒక్క సెంచరీతో టాప్‌లోకి దూసుకెళ్లిన శ్రేయస్ అయ్యర్.. తగ్గిన విరాట్ కోహ్లీ ర్యాంక్..
- Bhutan PM: మోడీ ‘విష్ణువు అవతారం’.. 25 ఏళ్ల పాలనపై భూటాన్ ప్రధాని ప్రశంసలు
- Bhatti Vikramarka: "మీరు చేసిన తప్పులు వారానికి ఒకటి బయటపెడతా".. హరీష్ రావుపై భట్టి విక్రమార్క ఫైర్..
- iPhone Sales: పండుగల వేళ ఐఫోన్ ప్రియులకు బంపర్ ఆఫర్.. ఐఫోన్ 15, 16, 17లపై ఊహించని తగ్గింపు!
విరాట్ కోహ్లీ మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నాడు. భారత్, ఆస్ట్రేలియా మ్యాచ్‌ను వీక్షించేందుకు టికెట్లు కొనడానికి చెన్నై స్టేడియం దగ్గరకు వచ్చిన ఓ దివ్యాంగ అభిమానిని కోహ్లీ కలిశాడు. కోహ్లీ అంటే ఎంతో అభిమానం ఉన్న దివ్యాంగ అభిమాని ఎంతో కష్టపడి వీల్ చైర్‌లో రాగా.. అతడిని కలిసి ఫొటో దిగాడు. అభిమాని ఇచ్చిన గిఫ్ట్‌ను తీసుకున్నాడు. దీంతో ఆ దివ్యాంగ అభిమాని ఆనందానికి హద్దుల్లేకుండా పోయాయి. ప్రస్తుతం ఇందుకుసంబంధించిన ఫొటోలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
King Kohli is ready for #CWC23 👑 pic.twitter.com/sRiWCXPEX8
— ICC (@ICC) October 6, 2023
తాజావార్తలు
-
ICC Rankings: ఒక్క సెంచరీతో టాప్‌లోకి దూసుకెళ్లిన శ్రేయస్ అయ్యర్.. తగ్గిన విరాట్ కోహ్లీ ర్యాంక్..
-
Mythri Ravi: “రూ. 2 కోట్లతో తీస్తే రూ. 400 కోట్లా? మాకు ఇది చెంపపెట్టు”
-
Pre-Launch Scam: తెల్లాపూర్‌లో తక్కువ ధరకే ఫ్లాట్లు అని ఎర.. నిలువునా ముంచిన బిల్డర్
-
Bhutan PM: మోడీ ‘విష్ణువు అవతారం’.. 25 ఏళ్ల పాలనపై భూటాన్ ప్రధాని ప్రశంసలు
-
Sivakarthikeyan: ఫ్యాన్స్‌కు శివకార్తికేయన్ ఇచ్చిన ఆ ఒక్క సలహా.. నెట్టింట వీడియో వైరల్!
ట్రెండింగ్
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!