How to watch World Cup 2023 matches online in India for free: క్రికెట్ అభిమానులకు శుభవార్త. భారత్ వేదికగా అక్టోబర్ 5 నుంచి జరిగే వన్డే ప్రపంచకప్ 2023 మ్యాచ్‌లు స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి. ఇంగ్లీష్‌తో పాటు హిందీ, మరాఠీ, తమిళం, తెలుగు, కన్నడ, బెంగాలీ, గుజరాతీ, మలయాళ భాషల్లో ప్రపంచకప్ మ్యాచ్‌లను అభిమానులు వీక్షించవచ్చు. మొత్తం 9 భాషల్లో మెగా టోర్నీ మ్యాచ్‌లు భారతదేశంలో ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి.
9 భాషల్లో వ్యాఖ్యానించేందుకు స్టార్ స్పోర్ట్స్ ఇప్పటికే 120 మంది వ్యాఖ్యాతలను ఎంపిక చేసింది. ఇందులో పలు దేశాల మాజీ ఆటగాళ్లు ఉన్నారు. రవిశాస్త్రి, సునీల్ గవాస్కర్, హర్ష భోగ్లే, హర్భజన్ సింగ్, పీయూష్ చావ్లా, ఎస్ శ్రీశాంత్, సునీల్ జోషి, ఎంఎస్‌కే ప్రసాద్, సందీప్ పాటిల్, రికీ పాంటింగ్, మాథ్యూ హేడెన్, షేన్ వాట్సన్, ఆరోన్ ఫించ్, నాజర్ హుస్సేన్, ఇయాన్ బిషప్, ఇయాన్ మోర్గాన్, షాన్ పొలాక్, మిథాలీ రాజ్ ఉన్నారు.
Also Read: Uterus in Man Stomach: యువకుడి కడుపులో గర్భాశయం.. షాక్ తిన్న డాక్టర్లు!
తెలుగు వ్యాఖ్యాతలుగా వేణుగోపాలరావు, మిథాలీరాజ్, ఎమ్మెస్కే ప్రసాద్, ఆర్జే శశి, యాంకర్ రవి, హీరో నందు, టి సుమన్, ఆశిష్ రెడ్డి, కల్యాణ్ కృష్ణ, జ్ఞానేశ్వర రావు, రాకేష్ దేవా, ఎన్ సీ కౌషిక్, వింధ్య విశాఖ వ్యవహరించనున్నారు. వన్డే ప్రపంచకప్ మ్యాచ్‌లను డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ యాప్‌లో ఉచితంగా చూడవచ్చు. హాట్‌స్టార్ వెబ్‌సైట్ ద్వారా చూడాలనుకునేవారు తప్పనిసరిగా సబ్క్స్రిప్షన్ కలిగి ఉండాలి. మెగా టోర్నీ తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్, న్యూజిలాండ్ తలపడుతాయి. అక్టోబర్ 8న ఆస్ట్రేలియాతో భారత్ తన మొదటి మ్యాచ్ ఆడుతుంది.