Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Internet Shutdown For 24 Hours

Internet Shutdown: 24 గంటల పాటు ఇంటర్నెట్ బంద్..సోషల్ మీడియా యూజర్లకు హెచ్చరిక..

Published Date :July 21, 2024 , 6:33 pm
By RAMAKRISHNA KENCHE
  • రేపు హర్యానా రాష్ట్రంలో బ్రజ్ మండల్ జలాభిషేక యాత్ర
  • గతంలో ఈ యాత్ర సందర్భంగా భారీ ఘర్షణలు
  • మరోసారి ఎలాంటి విధ్వంసం చోటుచేసుకోకుండా హర్యానా ప్రభుత్వం చర్యలు
  • 24 గంటల పాటు ఇంటర్నెట్.. బల్క్ ఎస్ఎమ్ఎస్ సేవలను నిలుపుదల
  • జులై 21వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి అమల్లోకి
Internet Shutdown: 24 గంటల పాటు ఇంటర్నెట్ బంద్..సోషల్ మీడియా యూజర్లకు హెచ్చరిక..
  • Follow Us :
  • google news
  • dailyhunt

రేపు హర్యానా రాష్ట్రంలో బ్రజ్ మండల్ జలాభిషేక యాత్ర చేపట్టనున్నారు. గతంలో ఇరు వర్గాల మధ్య జరిగిన ఘటన వల్ల పలువురు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఘర్షణలో పోలీసులు కూడా మృతి చెందారు. ఈ నేపథ్యంలో హర్యానా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. యాత్ర సమయంలో నుహ్ జిల్లాలో 24 గంటల పాటు ఇంటర్నెట్ మరియు బల్క్ ఎస్ఎమ్ఎస్ సేవలను నిలిపేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. తాజా ఉత్తర్వల ప్రకారం.. నుహ్ జిల్లాలో జులై 21వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి 22 సాయంత్రం 6 గంటల వరకు వర్తిస్తుంది. తప్పుడు వదంతులు వ్యాపించి శాంతిభద్రతలకు భంగం కలిగించడం, విధ్వంసకర అంశాలను వ్యాప్తి చేయడానికి ఇంటర్నెట్ సేవలను దుర్వినియోగం చేస్తున్నారని ప్రభుత్వం పేర్కొంది. నూహ్‌లోని ప్రజా ఆస్తులు మరియు సౌకర్యాలకు నష్టం వాటిల్లకుండా నిరోధించడానికి ఈ ఆదేశాలు జారీ చేసినట్లు హర్యానా డిప్యూటీ కమిషనర్ ధీరేంద్ర ఖడ్గత తెలిపారు.

READ MORE: Heavy Floods: ప్రకాశం బ్యారేజీకి వరద ఉద్ధృతి.. గోదావరిలో పెరుగుతున్న ప్రవాహం

ఇది కాకుండా.. మొబైల్ ఇంటర్నెట్ సేవల ద్వారా వాట్సాప్, ఫేస్‌బుక్, ఎక్స్ మొదలైన వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా తప్పుడు సమాచారం వ్యాప్తి చేయొద్దని పోలీసులు హెచ్చరించారు. గతంలో ఇలాంటి వదంతులు వ్యాప్తి చేయడం ద్వారా హింసాత్మక కార్యకలాపాలు చోటుచేసుకుటున్నాయి. చట్టవిరుద్ధ కార్యకలాపాలలో పాల్గొనడం ద్వారా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఆస్తులకు నష్టం కలిగింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రజల సౌలభ్యం, ప్రాథమిక గృహావసరాల మేరకు వ్యక్తిగత ఎస్ఎమ్ఎస్ , మొబైల్ రీఛార్జ్, బ్యాంకింగ్ ఎస్ఎమ్ఎస్, వాయిస్ కాల్స్, కార్పొరేట్, దేశీయ బ్రాడ్‌బ్యాండ్, అద్దె లైన్ల ద్వారా అందించే ఇంటర్నెట్ సేవలకు మినహాయింపు ఇచ్చినట్లు డిప్యూటీ కమిషనర్ ధీరేంద్ర ఖడ్గత తెలిపారు.

READ MORE: TCS Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్..టీసీఎస్ లో భారీగా ఉద్యోగాలు

యాత్ర సజావుగా సాగేందుకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు నూహ్ పోలీసులు తెలిపారు. గత ఏడాది జులై 31న హర్యానాలోని నుహ్ జిల్లాలో విశ్వహిందూ పరిషత్ ఊరేగింపును పలువురు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇందులో ఇద్దరు హోంగార్డులు మృతి చెందగా.. కనీసం 15 మంది గాయపడ్డారు. బ్రజ్ మండల్ జలాభిషేక యాత్ర సందర్భంగా జనం రాళ్లు రువ్వడంతో పాటు కార్లకు నిప్పు పెట్టారు. అదే రాత్రి.. గురుగ్రామ్‌లోని ఒక మసీదుపై ఒక గుంపు దాడి చేసింది. ఈ ఘర్షణ తర్వాత అల్లర్లు చెలరేగాయి. దీంతో 5 మంది మృతి చెందగా.. పలువురు గాయపడ్డారు. బ్రజ్ మండల్ జలాభిషేక యాత్రలో మతం పేరుతో కొందరు వికృత చేష్టలు పరస్పర సామరస్యానికి భంగం వాటిల్లకుండా చూసేందుకు పోలీసులు కఠినంగా వ్యవహరించనున్నారు. అక్రమాస్తులపై పోలీసులు ప్రత్యేక నిఘా ఉంచనున్నారు. ఇందుకోసం డ్రోన్ల సాయం కూడా తీసుకోనున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Braj Mandal Jalabhisheka Yatra
  • Haryana
  • haryana government
  • Internet shutdown for 24 hours
  • LATEST TELUGU NEWS

తాజావార్తలు

  • Off The Record : శైలజానాథ్ రాకతో టికెట్ కథ మళ్లీ మొదటికొచ్చిందా? లెక్కలు మారితే మళ్లీ చిక్కులేనని టెన్షన్

  • OTR: జనసేన నేత ఇల్లు కూల్చివేతతో రాజకీయ ప్రకంపనలు.. పేర్ని నాని ఎంట్రీతో కూటమిలో రచ్చ!

  • Central Govt: మీకు ఈ ప్రశ్నలకు జవాబులు తెలుసా..? అయితే రూ.10 వేలు మీకే..

  • OTR: ఓల్డేజ్ హోంగా బీఆర్ఎస్.. అప్పుడే గులాబీ తోటలో ప్రకంపనలు!

  • Madhapur job scam : సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల పేరిట భారీ మోసం..రూ.5 కోట్లు బురిడీ..

ట్రెండింగ్‌

  • సరికొత్త కలర్స్, అబ్బురపరిచే డిజైన్, 200MP కెమెరాతో మార్కెట్ ను షేక్ చేయడానికి సిద్దమైన Huawei Pura 90 సిరీస్..!

  • Pillow Cover Stains : నూనె మరకలతో దిండ్లు చెడిపోయాయా.? ఇలా చేస్తే కొత్తలాగే మెరుస్తాయి.!

  • Ragi Bread : ఈస్ట్ అక్కర్లేదు.. గ్లూటెన్ భయం లేదు.. ఆరోగ్యకరమైన ‘రాగి బ్రెడ్’ ఇప్పుడు ఇంట్లోనే.!

  • రికార్డు సృష్టించిన MG Majestor.. రైలును లాగి గిన్నిస్ బుక్‌లో స్థానం!

  • Car Prices Hike: కారు కొనాలనుకుంటే కోనేయండమ్మా.. మే 1 నుండి మరింత కాస్ట్లీ కాబోతున్నాయి..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions