Tweets War in AP: రెండు రాష్ట్రాల సీఎంల భేటీపై ట్వీట్స్ వార్..
- రెండు రాష్ట్రాల సీఎంల భేటీపై ఆసక్తికర ట్వీట్లు
- రెండు రాష్ట్రాల సీఎంల సమావేశంపై మాజీ మంత్రి బొత్స రియాక్షన్
- బొత్సకు మంత్రి అచ్చెన్న కౌంటర్
- తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశంపై పేర్ని నాని ఆసక్తికర ట్వీట్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాసేపట్లో హైదరాబాద్ ప్రజాభవన్ వేదికగా ఏపీ-తెలంగాణ ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న విభజన సమస్యల పరిష్కారంతో పాటు పలు ఇతర అంశాలపైనా ఇద్దరు సీఎంలు దృష్టి సారిస్తారు. ఇద్దరూ సీఎంలు అయ్యాక తొలిసారి భేటీ కానుండటంతో ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. కాగా.. ఈ భేటీపై మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. పోర్టుల్లో, టీటీడీ ఆస్తుల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వాటాలు కోరుతున్నట్టుగా వస్తున్న వార్తలు ఏపీ ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయని అన్నారు. అంతే కాదు పారదర్శకతకోసం, ప్రజలకు వాస్తవాలు తెలియడానికి ముఖ్యమంత్రుల సమావేశాన్ని ప్రత్యక్షప్రసారం చేయాలన్నారు. ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకోవాలని బొత్స సత్యనారాయణ ట్విట్టర్ లో కోరారు.
1.విభజన సమస్యల పరిష్కారానికి ఇవాళ 2 రాష్ట్రాల CMల సమావేశం నేపథ్యంలో పోర్టుల్లో, టీటీడీ ఆస్తుల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వాటాలు కోరుతున్నట్టుగా వస్తున్న వార్తలు AP ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి.
Also Read
— Botcha Satyanarayana (@BotchaBSN) July 6, 2024
Read Also: AI Pharma Hub : సంగారెడ్డిలో ఏఐ ఆధారిత ఫార్మా హబ్ ద్వారా 50,000 ఉద్యోగాలు
బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలకు మంత్రి అచ్చెన్నాయుడు కౌంటర్ ఇచ్చారు. ‘భలే జోకులేస్తున్నారు బొత్స గారు..! పారదర్శకత గురించి మీరు.. జగన్ మాట్లాడితే నవ్విపోతారు.. వద్దులెండీ..?’ అంటూ ట్వీట్ చేశారు. అలాగే పారదర్శకతకు పాతరేసిందే మీరు.. మీ పార్టీ. ప్రెస్ మీట్లు కూడా లైవ్ కాకుండా ఎడిట్ చేసి ఇవ్వాలని ఆదేశించే నాయకత్వంలో మీరు పని చేస్తున్నారని సెటైర్లు వేశారు. దయచేసి పారదర్శకత.. వాస్తవాలు వంటి పెద్ద పెద్ద పదాలు మీరు వాడొద్దని బొత్సకు సూచించారు. ప్రస్తుతం ఏపీ సేఫ్ హ్యాండ్స్ లో ఉందని.. డోంట్ వర్రీ. ప్రజలకు అన్ని విషయాలు తెలుసన్నారు. ఇద్దరు సీఎలు సమావేశమయ్యాక అన్నీ తెలుస్తాయని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.
భలే జోకులేస్తున్నారు బొత్స గారు..! పారదర్శకత గురించి మీరు.. జగన్ మాట్లాడితే నవ్విపోతారు.. వద్దులెండీ..?
పారదర్శకతకు పాతరేసిందే మీరు.. మీ పార్టీ. ప్రెస్ మీట్లు కూడా లైవ్ కాకుండా ఎడిట్ చేసి ఇవ్వాలని ఆదేశించే నాయకత్వంలో మీరు పని చేస్తున్నారు.. దయచేసి పారదర్శకత.. వాస్తవాలు వంటి పెద్ద…— Kinjarapu Atchannaidu (@katchannaidu) July 6, 2024
Read Also: Anant ambani wedding: టీ 20 వరల్డ్ కప్ విజేతలకు అంబానీ ఫ్యామిలీ ఘన సన్మానం
మరోవైపు.. తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశంపై మాజీ మంత్రి పేర్ని నాని ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘తెలుగు న్యూస్ ఛానళ్ళ బ్రేకింగ్ వార్తలు చూస్తున్నా.. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో ఇద్దరి డిమాండ్లు తీరాలంటే ఒకే మార్గం అన్నట్టుంది. రెండు రాష్ట్రాల పునరేకీకరణయే ఏకైక మార్గంగా కనపడుతుంది’. అని తెలిపారు.
తెలుగు న్యూస్ ఛానళ్ళ బ్రేకింగ్ వార్తలు చూస్తుంటే.. నేటి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో ఇద్దరి డిమాండ్లు తీరాలంటే రెండు రాష్ట్రాల పునారేకీకరణయే ఏకైక మార్గంగా కనపడుతుంది !
— Perni Nani (@perni_nani) July 6, 2024
తాజావార్తలు
-
OTR: నరసాపురంలో కాపుల అసంతృప్తికి అసలు కారణం ఇదేనా..?
-
OTR: నెల్లూరు వైసీపీలో మొదలైన అసంతృప్తి రగడ.. అధిష్టానం తీరుపై నేతల గుస్సా..
-
Jharkhand: దిగొచ్చిన హేమంత్ సర్కార్.. విద్యార్థుల డిమాండ్లకు అంగీకారం!
-
Off The Record: వనపర్తి కాంగ్రెస్‌లో రగులుతున్న లొల్లి! ఎమ్మెల్యేను టార్గెట్ చేసిన చిన్నారెడ్డి
-
Vishnu Deo Sai: రైతుగా మారిన ముఖ్యమంత్రి.. పొలం దున్నిన విష్ణు దేవ్
ట్రెండింగ్
-
BSNL పెద్ద స్కెచే వేసిందిగా.. రూ.1,111కే 200 Mbps స్పీడ్, 5000GB డేటా, 25+ OTT ప్లాట్ ఫార్మ్స్.!
-
CSK Coach: అతడు ఏం చేశాడని.. కోచ్‌గా వద్దు.. కామెంటరీకే పరిమితమైతే మంచిది!
-
Guinness World Record: 44 ఏళ్ల ‘యాష్లే పాల్సన్’ సంచలనం.. 12 గంటల 47 నిమిషాల్లో 100 మైళ్ల పరుగు.. గిన్నిస్‌బుక్‌లో చోటు.!
-
Coriander at Home: విత్తనాలు లేకుండానే కొత్తిమీర మొక్కలను పెంచండి ఇలా.. ఇక మార్కెట్లో కొనాల్సిన అవసరమే ఉండదు.!
-
6.9-అంగుళాల HD+ IPS LCD స్క్రీన్, 6,000mAh బ్యాటరీతో రూ.20 వేలలోపే POCO M8x 5G.!