Instagram Love: ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రేమ పేరుతో మోసం.. ఇద్దరు యువతుల నుంచి రూ.12 లక్షలకు పైగా కాజేసిన కేటుగాడు.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Instagram Love: మెదక్ జిల్లాలో సోషల్ మీడియాను వేదికగా చేసుకుని ప్రేమ పేరుతో ఇద్దరు యువతులను మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. టేక్మాల్ గ్రామానికి చెందిన ఇద్దరు యువతులను వేర్వేరు పేర్లతో నమ్మించి లక్షల రూపాయలు వసూలు చేసిన యువకుడిపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దుర్గేష్ అనే యువకుడు ఇన్‌స్టాగ్రామ్‌లో తన పేరును “రిత్విక్ రెడ్డి”గా మార్చుకుని ఓ యువతికి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపాడు. యువతి ఆ రిక్వెస్ట్‌ను అంగీకరించడంతో ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. తాను ఛత్తీస్‌గఢ్‌లో ఐపీఎస్ శిక్షణ పొందుతున్నానని నమ్మించి, ప్రేమ పేరుతో యువతిని మాయమాటలు చెప్పి దగ్గరయ్యాడు. ఆ తర్వాత తనకు ఖర్చుల కోసం డబ్బు అవసరమని, త్వరలో పెళ్లి చేసుకుంటానని నమ్మించి యువతి నుంచి రూ.5 లక్షల నగదుతో పాటు తులం బంగారు కమ్మలను తీసుకున్నాడు. కొంతకాలం తర్వాత అతడు యువతితో సంబంధాలను తగ్గించి తప్పించుకునే ప్రయత్నం చేశాడు.
Also Read
- China Caste System: చైనాలో కుల వ్యవస్థ?.. కమ్యూనిజం వెనుక దాగిన చీకటి కోణం బట్టబయలు..
- 144Hz రిఫ్రెష్ రేట్‌తో Hisense E8S ULED Mini-LED టీవీలు భారత్‌లో లాంచ్.. ధర ఎంతంటే?
- Touching Elders Feet: పెద్దల కాళ్లకు నమస్కారం చేయడం.. కేవలం సంప్రదాయమేనా.! శాస్త్రీయ కోణం కూడా ఉందా.?
- Anupama Singh: "మీరు పెంచిన భూతమే మిమ్మల్ని కాటేసింది".. ఐరాసలో పాకిస్థాన్‌కు భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
మరోవైపు అదే గ్రామానికి చెందిన మరో 17 ఏళ్ల బాలికకు “సాత్విక్ రెడ్డి” పేరుతో ఇన్‌స్టాగ్రామ్‌లో ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపిన దుర్గేష్, ఆమెతో కూడా పరిచయం పెంచుకున్నాడు. ఈసారి తాను ఎంబీబీఎస్ చదువుతున్నానని చెప్పి నమ్మించాడు. చదువుకు, ఇతర ఖర్చులకు డబ్బు అవసరమని చెబుతూ విడతల వారీగా సుమారు రూ.7 లక్షలు రాబట్టాడు. అయితే కొంతకాలం తర్వాత దుర్గేష్ ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి అందుబాటులో లేకపోవడంతో ఇద్దరు బాధితులు మోసపోయినట్లు గుర్తించారు. దీంతో వారు టేక్మాల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా అసలు విషయం బయటపడింది.
తాజావార్తలు
-
Instagram Love: ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రేమ పేరుతో మోసం.. ఇద్దరు యువతుల నుంచి రూ.12 లక్షలకు పైగా కాజేసిన కేటుగాడు.!
-
Gold and Silver Prices Today: గోల్డ్, సిల్వర్ ధరలు ఢమాల్.. ఊహించని రీతిలో తగ్గినయ్
-
Mutual Funds: ఆదాయం తక్కువగా ఉందని బాధపడుతున్నారా? ఈ పెట్టుబడితో ధనవంతులైపోవచ్చు..!
-
China Caste System: చైనాలో కుల వ్యవస్థ?.. కమ్యూనిజం వెనుక దాగిన చీకటి కోణం బట్టబయలు..
-
144Hz రిఫ్రెష్ రేట్‌తో Hisense E8S ULED Mini-LED టీవీలు భారత్‌లో లాంచ్.. ధర ఎంతంటే?
ట్రెండింగ్
-
Tilak Varma-Siraj: తెలుగు ప్లేయర్స్ సిరాజ్, తిలక్‌కు లీగల్ నోటీసులు.. ఇద్దరు టాలీవుడ్ హీరోస్‌కు కూడా!
-
Smriti Mandhana: క్రికెట్ చరిత్రలోనే తొలి ప్లేయర్‌గా స్మృతి మంధాన.. పురుష క్రికెటర్లకు కూడా సాధ్యం కాని రేర్ రికార్డు!
-
పార్లమెంట్‌కూ చేరిన FIFA World Cup జోష్.. వైకింగ్ పడవ ప్రయాణాన్ని అనుకరించిన ఎంపీలు.! వీడియో వైరల్..
-
Sreesanth: ఆమె లేకపోతే ఆత్మహత్య చేసుకునేవాడిని.. తీహార్ జైల్లో నరకం అనుభవించా!
-
Sreesanth Challenges Harbhajan: “దమ్ముంటే రింగ్‌లోకి రా.!” హర్భజన్ సింగ్‌కు ఓపెన్ ఛాలెంజ్ విసిరిన శ్రీశాంత్.!