Supreme Court: సుప్రీంకోర్టులో ముగ్గురు న్యాయమూర్తుల నియామకం.. మరో మహిళకు అవకాశం
- సుప్రీంకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తులు
- జడ్జీల నియామకానికి కేంద్రం ఆమోదం
- మూడో మహిళా జడ్జిగా జస్టిస్ సునీతా అగర్వాల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సుప్రీంకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తుల నియామకానికి కేంద్ర ప్రభుత్వం సోమవారం ఆమోదం తెలిపింది. గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సునీతా అగర్వాల్, ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయ, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్‌ను సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియమిస్తూ కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ ముగ్గురి పేర్లను సుప్రీంకోర్టు కొలీజియం సెప్టెంబర్ 28న జరిగిన సమావేశంలో సిఫారసు చేసింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని కొలీజియం.. సుప్రీంకోర్టు పనితీరును మరింత బలోపేతం చేసేందుకు ఈ నియామకాలు ఉపయోగపడతాయని పేర్కొంది.
సుప్రీంకోర్టులో ప్రస్తుతం 34 మంది న్యాయమూర్తులు పనిచేస్తున్నారు. కొత్తగా నియమితులైన ముగ్గురు న్యాయమూర్తులు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ సంఖ్య 37కి చేరుతుంది. సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తితో కలిపి మొత్తం 38 మంది న్యాయమూర్తులు ఉండేలా మంజూరైన పోస్టులు ఉన్నాయి.
Also Read
- Kharagpur-Amaravati Greenfield Highway: అమరావతికి ఈస్ట్ గేట్‌వే.. 1,107 కి.మీ. గ్రీన్‌ఫీల్డ్ హైవే.. రూట్ ఇదే..!
- Mayawati: గత నెలలో తొలగింపు.. మళ్లిప్పుడు పదవి.. మేనల్లుడికి కీలక పోస్ట్ ఇచ్చిన మాయావతి
- UP: 8 మంది రాజ్యసభ అభ్యర్థుల్ని ప్రకటించిన బీజేపీ.. కేంద్రమంత్రి హర్దీప్ పూరీకి దక్కని అవకాశం
- DA Hike: దసరా పండగ వేళ వారికి శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. డీఏ పెంపు..
ఇక జస్టిస్ సునీతా అగర్వాల్ నియామకంతో ప్రస్తుతం సుప్రీంకోర్టులో పనిచేస్తున్న మహిళా న్యాయమూర్తుల సంఖ్య మూడుకు చేరనుంది. 2011లో ఆమె అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2013లో శాశ్వత న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం 2023 జూలైలో గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. న్యాయవ్యవస్థలోకి రాకముందు జస్టిస్ సునీతా అగర్వాల్ సివిల్ కేసులపై న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. 1990లో న్యాయవాదిగా నమోదు చేసుకున్నారు.
జస్టిస్ దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయ
జస్టిస్ దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయ 2025 జనవరి నుంచి ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తున్నారు. అంతకుముందు 2023 జూలైలో బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. 2011లో అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందిన ఆయన.. 2013 ఆగస్టులో శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టకముందు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి చీఫ్ స్టాండింగ్ కౌన్సెల్‌గా పనిచేశారు.
జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్
జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్‌కు జార్ఖండ్, త్రిపుర, తెలంగాణ హైకోర్టుల్లో పనిచేసిన అనుభవం ఉంది. 2012 జనవరిలో జార్ఖండ్ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2014 జనవరిలో శాశ్వత న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత జార్ఖండ్ హైకోర్టు యాక్టింగ్ చీఫ్ జస్టిస్‌గా కూడా పనిచేశారు. 2023 ఏప్రిల్‌లో త్రిపుర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. అనంతరం తెలంగాణ హైకోర్టుకు బదిలీ అయ్యారు. 2025 జూలైలో తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ముగ్గురు న్యాయమూర్తులు సుప్రీంకోర్టులో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత దేశ అత్యున్నత న్యాయస్థానంలో ఖాళీగా ఉన్న పోస్టుల సంఖ్య మరింత తగ్గనుంది.
తాజావార్తలు
-
Supreme Court: సుప్రీంకోర్టులో ముగ్గురు న్యాయమూర్తుల నియామకం.. మరో మహిళకు అవకాశం
-
Sharwanand : శర్వానంద్ కెరీర్లో కొత్త ఫేజ్
-
Kharagpur-Amaravati Greenfield Highway: అమరావతికి ఈస్ట్ గేట్‌వే.. 1,107 కి.మీ. గ్రీన్‌ఫీల్డ్ హైవే.. రూట్ ఇదే..!
-
Mayawati: గత నెలలో తొలగింపు.. మళ్లిప్పుడు పదవి.. మేనల్లుడికి కీలక పోస్ట్ ఇచ్చిన మాయావతి
-
TG CPGET రెండో విడత సీట్ల కేటాయింపు.. భారీగా మిగిలిపోనున్న పీజీ సీట్లు..
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!