BSNL Freedom 2.0: జియో, ఎయిర్‌టెల్‌లకు షాకిచ్చిన బీఎస్ఎన్ఎల్.. రూపాయికే సిమ్‌తో పాటు బంపర్ ఆఫర్లు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BSNL Freedom 2.0: రీఛార్జ్ ధరల పెంపుతో ప్రైవేట్ టెలికాం నెట్‌వర్క్‌లైన జియో, ఎయిర్టెల్ వినియోగదారుల జేబులకు భారీగా చిల్లులు పెడుతున్న వేళ.. ప్రభుత్వ రంగ దిగ్గజం బీఎస్ఎన్ఎల్ అనూహ్య కౌంటర్ ఇచ్చింది. ప్రైవేట్ కంపెనీల దోపిడీకి చెక్ పెడుతూ, రానున్న దసరా-దీపావళి పండగల సీజన్లో వినియోగదారులను ఆకర్షించేందుకు కళ్లు చెదిరే ధమాకా ప్లాన్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. కేవలం ఒక్క రూపాయి (₹1) చెల్లిస్తే చాలు.. కొత్త సిమ్ కార్డుతో పాటు ఉచిత కాలింగ్, డేటాను సైతం అందిస్తూ మార్కెట్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
‘ఫ్రీడమ్ 2.0’తో ప్రైవేట్ నెట్‌వర్క్‌లకు బిగ్ ట్విస్ట్
కొత్త కస్టమర్లను బీఎస్ఎన్ఎల్ వైపు తిప్పుకోవడమే లక్ష్యంగా పరిచయం చేసిన ‘ఫ్రీడమ్ 2.0’ ప్లాన్ ఇప్పుడు టెలికాం పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది. ఒక్క రూపాయి ఖర్చు చేస్తే లభించే ప్రయోజనాలు ఇలా ఉన్నాయి. సిమ్ కార్డు ధర కేవలం రూ. 1 మాత్రమే. అలాగే 24 రోజుల వాలిడిటీతో దేశవ్యాప్తంగా ఏ నెట్‌వర్క్‌కైనా ఫ్రీగా కాల్స్ మాట్లాడుకునే సదుపాయం. వీటితో పాటు ప్రతిరోజూ 1 జీబీ డేటాతో పాటు రోజుకు 100 ఉచిత ఎస్ఎంఎస్లు వస్తాయి. చిన్నపాటి రీఛార్జ్‌లకే వందల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితుల్లో, రూపాయికే 24 రోజుల సర్వీసులను బీఎస్ఎన్ఎల్ అందించడం ద్వారా జియో, ఎయిర్టెల్ గుత్తాధిపత్యానికి గట్టి సవాల్ విసిరినట్లు అయ్యింది. ప్రైవేట్ కంపెనీల అధిక టారిఫ్‌లతో విసుగెత్తి వేరే నెట్‌వర్క్‌కు పోర్ట్ (MNP) అవ్వాలనుకునే వారికి, అలాగే కొత్తగా సిమ్ కొనుగోలు చేసే వారికి మాత్రమే ఈ బంపర్ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. ప్రస్తుతం ఉన్న పాత కస్టమర్లకు ఇది వర్తించదు. ఈ ప్రత్యేక పండగ ఆఫర్ అక్టోబర్ 12 వరకు మాత్రమే అందుబాటులో ఉండనుంది. ప్రైవేట్ కంపెనీలకు గుడ్‌బై చెప్పి ఈ ప్రయోజనాలను పొందాలనుకునే వారు అక్టోబర్ 12 లోగా దగ్గరలోని బీఎస్ఎన్ఎల్ కస్టమర్ సర్వీస్ పాయింట్ లేదా గుర్తింపు పొందిన రిటైలర్ వద్దకు వెళ్లి, ఆధార్ కార్డుతో కేవైసీ (KYC) పూర్తి చేసి కొత్త సిమ్‌ను యాక్టివేట్ చేసుకోవచ్చు.
Also Read
- DA Hike: దసరా పండగ వేళ వారికి శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. డీఏ పెంపు..
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- LPG Subsidy: సిలిండర్ బుక్ చేసుకునేవారికి శుభవార్త.. రూ.300 సబ్సిడీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్!
- Petrol Diesel Price Hike: వాహనదారులకు షాక్.. పెట్రోల్ రూ.5, డీజిల్ రూ.3 పెంపు
తాజావార్తలు
-
BSNL Freedom 2.0: జియో, ఎయిర్‌టెల్‌లకు షాకిచ్చిన బీఎస్ఎన్ఎల్.. రూపాయికే సిమ్‌తో పాటు బంపర్ ఆఫర్లు!
-
Supreme Court: సుప్రీంకోర్టులో ముగ్గురు న్యాయమూర్తుల నియామకం.. మరో మహిళకు అవకాశం
-
Sharwanand : శర్వానంద్ కెరీర్లో కొత్త ఫేజ్
-
Kharagpur-Amaravati Greenfield Highway: అమరావతికి ఈస్ట్ గేట్‌వే.. 1,107 కి.మీ. గ్రీన్‌ఫీల్డ్ హైవే.. రూట్ ఇదే..!
-
Mayawati: గత నెలలో తొలగింపు.. మళ్లిప్పుడు పదవి.. మేనల్లుడికి కీలక పోస్ట్ ఇచ్చిన మాయావతి
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!